కర్నూల్

ఆటో బోల్తా.. ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలిమిగుండ్ల, మార్చి 13 : మండల పరిధిలోని అంకిరెడ్డిపల్లె గ్రామ సమీపంలో సోమవారం ఉదయం ట్రాలీఆటో అదుపుతప్పి బోల్తాపడిన సంఘటనలో ముగ్గురు మృతి చెందగా 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. మండలంలోని బెలుం గ్రామానికి చెందిన ట్రాలీఆటోలో డ్రైవర్ అంకిరెడ్డిపల్లెలో సుమారు 20 మంది మహిళా కూలీలను ఎక్కించుకుని అవుకు మండలంలోని కాచీపురం సుంకేసుల గ్రామ పొలాల్లో మిరపతోటలో పండు మిరప కోతకు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపల్లెలో మహిళా కూలీలను ఎక్కించుకుని ఆటో బయల్దేరి గ్రామ శివారులోని గాలిమరల విద్యుత్ సబ్ స్టేషన్ వద్దకు రాగానే ఆటో అదుపు తప్పి నడిరోడ్డుపై రెండు పల్టీలు కొట్టి బోల్తాపడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో యర్రగుడి చెన్నమ్మ(51), ఉచ్చాల లక్ష్మిదేవి(50) అక్కడికక్కడే మృతిచెందగా, దూదేకుల కుళ్లాయమ్మ(40) కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇక ఈ ప్రమాదంలో దూదేకుల ఆశమ్మ, దూదేకుల సిద్దమ్మ, దూదేకుల కుళ్లాయమ్మ, తులశమ్మ, కుమారి, లక్ష్మిదేవి, ధనలక్ష్మి, చాంద్‌బీ, కమాల్‌బీ, షుకూర్‌బీ, పీరమ్మ, వెంకటమ్మ, హుసేనమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఆటో అదుపుతప్పి బోల్తాపడిందని స్థానికులు పేర్కొన్నారు. మృతిచెందిన వారు, గాయపడిన వారందరూ ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో అంకిరెడ్డిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటనా స్థలం మృతి చెందిన వారి బంధుమిత్రుల రోదనలతో మార్మోగింది. విషయం తెలిసిన వెంటనే ఏఎస్‌ఐ ఉస్మాన్‌గని సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. అలాగే గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తాడిపత్రికి తరలించారు. కాగా ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరు విద్యార్థుల మృతి
* మరొకరికి తీవ్రగాయాలు
ఆలూరు, మార్చి 13:మండల పరిధిలోని హులేబీడు క్రాస్ రోడ్డు వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థులు మృతి చెందారు. వివరాలు.. మనేకుర్తి గ్రామానికి చెందిన నరసింహులు(15), మూసనహళ్లి గ్రామానికి చెందిన మల్లికార్జున(15) తమ స్నేహితుడు మనేకుర్తికి చెందిన భీమలింగతో కలిసి ద్విచక్ర వాహనంపై ఆలూరు నుంచి తిరిగి తమ గ్రామానికి వస్తుండగా హులేబీడు క్రాస్ రోడ్డు వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో మల్లికార్జున, నరసింహులు అక్కడికక్కడే మృతిచెందారు. భీమలింగ తీవ్రంగా గాయపడడంతో ఆదోని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు విద్యార్థులు కమ్మరచేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారని, సోమవారం సరస్వతీ పూజ ఉన్నందున వారి వారి గ్రామాల నుంచి పూజకు వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ధనుంజయ తెలిపారు.