కర్నూల్

నువ్వా.. నేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మార్చి 19:శాసన మండలిలో ముగ్గురు సభ్యుల ఎన్నికకు ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. పట్ట్భద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనంతపురంలో నిర్వహిస్తుండగా స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ హైస్కూలులో కొనసాగనుంది. పట్ట్భద్రుల నియోజకవర్గ ఫలితం రాత్రి పొద్దు పోయాక కాని వెల్లడయ్యే అవకాశం లేదని, ఉపాధ్యాయ నియోజకవర్గ ఫలితం సాయంత్రానికి వెలువడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఫలితం మధ్యాహ్నం 12గంటల లోపే ప్రకటించే అవకాశం ఉంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసినట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆదివారం తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై అధికారులు, సిబ్బందికి శిక్షణ పూర్తయిందని, నమూనా లెక్కింపు కార్యక్రమం కూడా నిర్వహించి సంతృప్తి వ్యక్తం చేశారు. కాగా జిల్లాలో పట్ట్భద్రుల నియోజకవర్గంలో మొత్తం 82,591 ఓట్లు ఉండగా 51,813 ఓట్లు పోలయ్యాయి. అందులో పురుషులు 37,946, మహిళలు 13,867 ఓట్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. మొత్తం ఓట్లలో 62.73శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించున్నట్లు స్పష్టం చేశారు. పట్ట్భద్రుల నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్సీ గేయానంద్ పిడిఎఫ్ అభ్యర్థిగా మరోమారు పోటీ చేస్తుండగా వైకాపా తరఫున వెన్నపూస గోపాల్‌రెడ్డి, టిడిపి మద్దతుతో కర్నూలు జిల్లాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కెజె రెడ్డి పోటీ పడ్డారు. ఇక ఉపాధ్యాయ నియోజకర్గంలో జిల్లా వ్యాప్తంగా 6,670 మంది ఓటర్లు ఉండగా వారిలో 93.17శాతం 6,215 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలైన ఓట్లలో మహిళలవి 2,270, పురుషులవి 3,945 ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఉపాధ్యాయ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టిడిపి తరఫున మరోమారు పోటీలో ఉండగా కెవి సుబ్బారెడ్డి వైకాపా మద్దతుతో, ఒంటేరు శ్రీనివాసరెడ్డి పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతపురంలో నిర్వహిస్తున్నారు.
స్థానిక ఫలితాలపైనే అందరి దృష్టి
నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగిన స్థానిక సంస్థల నియోజకవర్గ మండలి ఎన్నికల ఫలితంపైనే అందరి దృష్టి ఉంది. స్థానిక సంస్థల ప్రతినిధులే ఓట్లు వేసినా సామాన్యుడి ఆసక్తి సైతం ఈ ఫలితంపైనే కేంద్రీకృతమైంది. జిల్లాలో 1084 ఓట్లకు గానూ 1077 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మహిళలు 621 మంది, పురుషులు 456 మంది ఓటు హక్కు వినియోగించున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభించి మధ్యాహ్నం 12గంటల సమయానికి ఫలితాన్ని ప్రకటించనున్నారు. టిడిపి అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మరోమారు పోటీ చేస్తుండగా వైకాపా మద్దతుతో గౌరు వెంకటరెడ్డి పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉండటంతో ఇరు పార్టీలకు చెందిన వారే కాకుండా విశే్లషకులు సైతం ఫలితంపై పూర్తిస్థాయిలో అభిప్రాయం వ్యక్తం చేయలేకపోతున్నారు. ఎవరు విజయం సాధించినా 100లోపే ఆధిక్యత ఉంటుందన్న అభిప్రాయం అత్యధికుల్లో వ్యక్తమవుతోంది. వైకాపా సైతం తాము 90 నుంచి 100 వంద ఓట్ల మెజారిటీతో గెలుస్తామని వెల్లడిస్తుండగా టిడిపి అభ్యిర్థి మాత్రం 200 ఓట్లకు పైగా ఆధిక్యత ఖాయమన్న ధీమాతో ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికి అనుకూలంగా ఓటరు తీర్పు ఇచ్చాడో నేడు తేలనుంది.