కర్నూల్

ఏసిబి వలలో విఆర్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోన్, మార్చి 20:కరవు పరిస్థితుల్లో కూడా రైతులను లంచం కోసం జలగల్లా పట్టిపీడిస్తున్న గ్రామ పరిపాలన అధికారి(విఆర్‌ఓ)ని సోమవారం ఏసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. డోన్ పట్టణంలోని ఇందిరానగర్ శ్రీనివాస థియేటర్ సమీపంలో ఇంటిలో నివాసం ఉంటున్న విఆర్‌ఓ పుల్లయ్య తన ఇంటిలో రైతు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాలు.. ప్యాపిలి మండలం మాధవరం గ్రామానికి చెందిన లక్ష్మీనారాయణకు వారసత్వంగా భూమి సంక్రమించింది. అన్నదమ్ములు విడిపోగా వాటికి పాస్‌బుక్కులు కూడా పొందారు. అయితే లక్ష్మీనారాయణకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని చాలా రోజులుగా విఆర్‌ఓ చుట్టూ తిరుగుతున్నాడు. ఇదే అదనుగా భావించిన విఆర్‌ఓ పుల్లయ్య పెద్దమొత్తంలో లంచం ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు. దీంతో రైతు కరవుతో పంటలు రాక ఇబ్బందుల్లో వున్నామని, లంచం ఇచ్చుకోలేనని పలుమార్లు మొరపెట్టుకున్నా విఆర్‌ఓ కనికరించలేదు. చివరకు రైతు రూ. 10 వేలు లంచం ఇవ్వడానికి అంగీకరించి ఈ విషయాన్ని ఏసిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం డోన్ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ వద్ద ఉన్న ఇంటిలో విఆర్‌ఓ పుల్లయ్య రైతు నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటుండా ఏసిబి అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏసిబి డీఎస్పీ జయరామరాజు మాట్లాడుతూ రైతు లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు వల పన్ని విఆర్‌ఓ పుల్లయ్య లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, పుల్లయ్యపై గత కొంతకాలంగా ఎన్నో ఫిర్యాదులు అందాయని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ఏసిబి కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం కోసం డిమాండ్ చేస్తుంటే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు. దాడుల్లో ఏసిబి సిఐ సీతారాం, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ముంబాయిలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం ప్రారంభం
* రూ. 3 కోట్ల వ్యయంతో నిర్మాణం
మంత్రాలయం, మార్చి 20: మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి మఠం ఆద్వర్యంలో మహారాష్టల్రోని ముంబాయి పట్టణం జోగేశ్వరలో నూతనంగా నిర్మించిన శ్రీరాఘవేంద్రస్వామి మృత్తిక బృందావనం మఠంను మంత్రాలయం పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు సోమవారం ప్రారంభించారు. భక్తుల సమర్పించిన రూ.3కోట్ల విరాళాలతో ముంబాయి నగరంలో నిర్మించారు. నూతనంగా నిర్మించిన మఠంలో కలియుగ దైవం శ్రీదేవి భూదేవి సమేతుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహాలు, శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం, శివలింగాలను ప్రతిష్ఠించారు. ముందుగా పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులు సతీ సమేతుడైన శ్రీనివాసునికి, శ్రీ ఆంజనేయస్వామికి, శివలింగానికి, శ్రీ రాఘవేంద్ర స్వామి మృత్తిక బృందానానికి మహాపంచామృతాభిషేకం, తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం స్వామి వార్లకు వివిధ రకాల ఆభరణాలతో అలంకరించగా, శ్రీరాఘవేంద్ర స్వామి మృత్తిక బృందావనానికి బంగారు కవచాలు, వివిధ రకాల పూలతో అలంకరించారు. ముందుగా శ్రీ మూలరామదేవతా మూర్తులకు ప్రత్యేక పూజలుచేసి దూపదీప నైవేద్యాలు సమర్పించి హారతి ఇచ్చారు. అంతకుముందు పీఠాధిపతి శ్రీసుభుదేంద్ర తీర్థులను ప్రత్యేక వాహనంలో కూర్చోబెట్టి అశేష భక్తులనడుమ డప్పులు సన్నాయి మేళాలు భజనలు, మహిళల కోలాటాలు, నృత్యాలు మధ్య ముంబాయిలోని జోగేశ్వరలో నూతనంగా నిర్మించిన శ్రీరాఘవేంద్ర స్వామి మఠం వరకు వైభవంగా ఊరేగించారు. స్వామి మృత్తిక బృందావనంను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చారని మఠం మేనేజర్ శ్రీనివాస్‌రావు, సహాయ మేనేజర్ ఐపి నరసింహమూర్తి తెలిపారు. ముంబాయి మహానగరంలో అతి సుందరంగా అన్ని హంగు, రంగులతో భక్తుల కన్నులు మిరమిట్లు గొలిపే విధంగా, ఆధ్యాత్మిక పరిమళాలు విరజిల్లే విధంగా నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలపారు. శ్రీ రాఘవేంద్ర స్వామి మృత్తిక బృందావనాన్ని దర్శించుకుంటే సర్వరోగాలు, పాపాలు హరించి పోతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.