కర్నూల్

అంగన్‌వాడీల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎమ్మిగనూరు, మార్చి 25: అంగన్‌వాడీ సెంటర్లలో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్‌జెడి శారద శనివారం అన్నారు. ఈ మేరకు పట్టణంలోని ఉన్న 1,2,11,13 అంగన్‌వాడీ సెంటర్లను ఆకస్మతికంగా తనిఖీలు నిర్వహించారు. సెంటర్లలో రిజిస్ట్రర్, పిల్లలకు వడ్డించే భోజనాన్ని పరిశీలించారు. భోజనం, గుడ్లు సరిగ్గా ఇస్తున్నార అని అంగన్‌వాడీలో పిల్లలను అడిగి తెలుసుకున్నారు. సెంటర్లలో రిజిస్ట్రర్లు సరిగా లేకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లపై ఆర్‌జేడి ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భణిలు, బాలింతల రిజిస్ట్రర్లను ప్రతి సెంటర్లలో ఆమె పరిశీలించారు. ప్రతి రిజిస్ట్రర్‌లో తప్పలు ఉండడంతో మరో సారి ఇలాగే జరిగితే మాత్రం కఠిన చర్యలు తప్పవని, సిడిపిఓ, సూపర్‌వైజర్లు ఏం చేస్తున్నారని వారిపై మండిపడ్డారు. పిల్లల వయస్సు, బరువు కూడా సరి చూసుకోవాలని, వేయింగ్ మిషన్లు సరిగ్గా లేకపోవడంతో అంగన్‌వాడీ టీచర్లపై ఆర్‌జెడి మండిపడ్డారు. అనంతరం విలేఖర్లతో ఆమె మాట్లాడుతూ ప్రతి అంగన్‌వాడీలో పిల్లలను తప్పనిసరిగ్గా చేర్పించాలని, పిల్లలకు 5 ఏళ్లు నిండిన తరువాత సర్ట్ఫికెట్ ఇచ్చి ప్రైమరీ స్కూల్‌లో చేర్పిస్తామన్నారు. కొందరు అంగన్‌వాడీ సెంటర్ల టీచర్లు అద్దె బకాయిలు ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని విలేఖర్లు ప్రశ్నించగా మున్సిపల్ పరిధిలో ఉన్న సెంటర్లలో 3వేల వరకు అద్దెలు ఇస్తున్నామని, అ సెంటర్లలో పిల్లలకు ప్లేగ్రౌండ్, మురుగుదొడ్లు, కొళాయిలు సౌకర్యాలు ఉంటే నే ఇస్తున్నామని, అవి లేకుంటే అద్దె రూ.2వేల వరకు ఇస్తున్నామన్నారు. అర్బన్ ఏరియాలో కూడా వెయ్యి రూపాయల వరకే అద్దెలు ఇస్తున్నారన్నారు. దీంట్లో ఎవరైన అంగన్‌వాడీ టీచర్లు అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని ఆర్‌జేడి పేర్కొన్నారు. ఆమె వెంట సిడిపిఓ నాగమణి, సూపర్‌వైజర్లు నాగసుంకమ్మ, సుశీల, సిబ్బంది పాల్గొన్నారు.

29 నుంచి శ్రీచౌడేశ్వరీమాత తిరుణాల
బనగానపల్లె, మార్చి 25:ఈ నెల 29వ తేదీ ఉగాది నుంచి నందవరం శ్రీచౌడేశ్వరీమాత ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. తొలి రోజు ఉదయం ఉత్సవాలకు అంకురార్పణ, సాయంకాలం 4 గంటలకు గ్రామ రైతు సంఘం ఆధ్వర్యంలో పనే్నరపు బండ్లు తిప్పుతారు. రాత్రికి బ్రాహ్మణులు పంచాంగ శ్రవణం చేస్తారు. 30న రాత్రి 8 గంటల నుంచి శ్రీ చెన్నకేశవస్వామి అక్షతారోపణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 10 గంటలకు శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవస్వామివార్లకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. అనంతరం స్వామివార్ల గ్రామోత్సవం. అదేరోజు రాత్రి హరికథా కాలక్షేపం, ఆర్కెస్ట్రా కార్యక్రమాలు కల్పించారు. 31వ తేదీ ఉదయం నుంచి అమ్మవారికి కుంకుమార్చనలు, ఇతర పూజలు వైభవంగా జరుగుతాయి. సాయంకాలం 4 గంటలకు శ్రీదేవి రాయభార ఉత్సవం జరుగుతుంది. ఏప్రిల్ 1వ తేదీ అమ్మవారికి సహస్రనామార్చనలు, కుంకుమార్చనలు, ఇతర విశేష పూజలు మెండుగా జరిపిస్తారు. అమ్మవారికి తొగటవీరులు పసుపు-కుంకుమ, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అదేరోజు అర్ధరాత్రి 12 గంటలకు అమ్మవారికి విశ్వబ్రాహ్మణ భాస్కరయ్య ఆచారి దృష్టిచుక్క పెడతారు. అనంతరం తెల్లవాజామున 1 గంటకు అమ్మవారి తిరుణాళ్లలో ముఖ్య ఘట్టం జ్యోతి మహోత్సవ ఘట్టం జరుగుతుంది(తెల్లవారితే ఆదివారం). 2వ తేదీ అమ్మవారికి ఉదయం వివిధ విశేష పూజలు, సాయంకాలం 4 గంటలకు రథోత్సవం. 3వ తేదీ అమ్మవారి రథాన్ని వెనక్కు లాగుతారు.