కర్నూల్

ఉపాధి హామీలో ముగ్గురిపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, మార్చి 25:మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు సిబ్బందిని ఏపిడి మురళీధర్‌రావు వారం రోజుల క్రితం సస్పెండ్ చేశారు. అయితే మండలస్థాయి అధికారులు ఈ విషయం బయటకు చెప్పకుండా గోప్యంగా ఉంచారని తెలిసింది. అందిన సమాచారం మేరకు 2016 జనరి 1 నుంచి అక్టోబర్ 31 వరకూ మండలంలో రూ. 3,79,23,408 వ్యయంతో చేపట్టిన ఉపాధి పనులపై డిసెంబర్ 31 నుంచి జనవరి 12వ తేదీ వరకూ 10వ విడత సామాజిక తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో అనేక అవకతవకలు జరిగినట్లు సామాజిక బృందం గుర్తించింది. అయితే బహిరంగ సమావేశం నిర్వహించేందుకు ఎన్నికల కోడ్ ఉండడంతో ఉన్నతాధికారులకు నివేదికలు అందజేశారు. ఆ పనుల్లో రూ. 3.81లక్షల నిధులు దుర్వినియోగమైనట్లు ఉన్నతాధికారులు గుర్తించి కారుకులైన టెక్నికల్ అసిస్టెంట్లు శ్రీనివాసరాజు, సుబ్బనాయక్, ఇసి నరేష్‌లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా మండల స్థాయి అధికారులు రహస్యంగా ఉంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై ఏపిఓ శ్రీనివాసులును వివరణ కోరగా సస్పెన్షన్ వేటు నిజమేనని ధ్రువీకరించారు.
అన్నమయ్యకు స్వరార్చన
ఆళ్లగడ్డ, మార్చి 25: పద కవితామహుడు తాళ్లపాక అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా ఆళ్లగడ్డలో అన్నమ్యకు స్వరార్చన కార్యక్రమం చేపట్టారు. ధర్మజాగారణ సమితి ఆధ్వర్యంలో నాయకులు రామకృష్ణ ఆధ్వర్యంలో తాళ్లపాక అన్నమాచార్యులు 514వ వర్ధంతి సందర్భంగా ఆయన శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఆలాపించిన పాటలను ఆలాపించారు. అహోబిలం ప్రాంతంలో నడయాడిన అన్నమయ్య తన తియ్యటి గానంతో ఆలాపించిన గీతాలను స్వరార్చన రూపంలో ప్రజలకు అందించారు. ఈ కార్యక్రమంలో ధర్మజాగారణ సమితి సభ్యులు విప్రనారాయణాచార్యులు, శ్రీనివాసరెడ్డి, వీరాంజనేయులు, పట్టణంలోని ప్రజలు పాల్గొన్నారు.