కర్నూల్

శ్రీశైలంలో భక్తుల రద్దీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, ఏప్రిల్ 15: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేశారు. శుక్రవారం కుంభోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్జిత సేవలు నిలుపుదల చేయడంతో శనివారం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సుమారుగా 40 వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.
ఇంటి దొంగల ముఠా అరెస్టు
* రూ. 4.35 లక్షల విలువ చేసే
బంగారు నగలు స్వాధీనం:ఏఎస్పీ షేక్షావలి
కర్నూలు, ఏప్రిల్ 15:రాత్రి సమయాల్లో తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడే ముఠాను కర్నూలు పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి రూ. 4.35లక్షల విలువైన 14.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీ నం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ షేక్షావలి తెలిపారు. ఏఎస్పీ శనివారం క ర్నూలు సిసిఎస్ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నగరంలోని చెన్నమ్మ సర్కిల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతు న్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలు వెలుగుచూశాయన్నారు. దొంగ లు కొత్తపల్లి మండలం వీరాపురం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు కుమారుడు నాగిరెడ్డి, కొత్తపల్లి గ్రామానికి చెందిన లాల్‌మియ్యా కుమారుడు షేక్ సద్దాం హుస్సేన్, మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామానికి చెందిన జంగయ్య కుమారుడు హరికుమార్‌గా విచారణలో తేలిందన్నారు. వీరు నగరంలోని 4వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో 3 ప్రాంతాల్లో, 1,2వ పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిల్లో కూడా చోరీలకు పాల్పడ్డారన్నారు. దొంగలను అరెస్టు చేయడంలో కృషి చేసిన కర్నూలు సిసిఎస్ డీఎస్పీ హుసేన్‌పీరా, సిఐ లక్ష్మయ్య, ఎస్‌ఐలు ఏవి నారాయణ, శ్రీనివాసులు, రమేష్‌బాబు, హెచ్‌సి మస్తాన్, పిసిలు సుదర్శన్, నాగరాజు, రవికిషోర్, సమీర్, 4వ పట్టణ సిఐ నాగరాజారావు, ఎస్‌ఐ లక్ష్మయ్యలను ఏఎస్సీ అభినందించారు. సమావేశంలో సిసిఎస్ డీఎస్పీతో పాటు సిఐ లక్ష్మయ్య, 4వ పట్టణ సిఐ నాగరాజారావు ఉన్నారు.