కర్నూల్

పత్తికొండ అభివృద్ధే ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్తికొండ, ఏప్రిల్ 15: పత్తికొండను అభివృద్ధి చేయాలని ఆశయంతో ఉన్నామని ఉప ముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి అన్నారు. శనివారం పత్తికొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి భూ పూజలు చేసిన అనంతరం వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మార్కెట్ చైర్మన్ లక్ష్మీనారాణశెట్టి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సిఎం కెయి మాట్లాడుతూ కమీషన్ల కుటుంబం తమది కాదని, మా తండ్రి మాదన్న మార్గ దర్శకత్వంను అనుసరిస్తూ ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలలో ఆలస్యం జరిగినా ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా పత్తికొండ ప్రజల నీటి ఎద్దడిని శశ్వతంగా నివారించేటుకు రూ.3వేల 77లక్షలు వయ్యయంతో పందికోణ రిజర్వాయర్ నుండి పత్తికొండ సంప్ వరకు పైపులైన్ నిర్మించామని, దీంతో నీటి ఎద్దడి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. త్వరలోనే 106 చెరువులకు హంద్రీ కాలువ ద్వారా నీటిని తరలించేందుకు సిఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారన్నారు. కలెక్టర్ విజయ్‌మోమన్ చేపట్టిన పంట కుంటలు, ఫారం పాండ్స్ చర్యలతో కరవు పరిస్థితుల్లో కూడా జిల్లాలో రైతులు రికార్డు స్థాయిలో రూ.22లక్షల మెట్రిక్ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను పండించారని, దీని వెనుక కలెక్టర్ కృషి ఉందని, కలెక్టర్ చర్యలను డిప్యూటీ సిఎం కొనియాడారు. మాజీ మంత్రి కెయి ప్రభాకర్ మాట్లాడుతూ జిల్లాలో పడమటి ప్రాంత రైతుల కోరిక మేరకు టమోటా జ్యూష్ ప్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ కెయి సోదరులు, ఈప్రాంతం రైతలు సహకారంతో పందికోణ, కృష్ణగిరి రిజర్వాయర్లు, కాలువలు నిర్మించేందుకు భూములను ఇచ్చారని, దీంతో హంద్రీ కాలువ ల ద్వారా వచ్చే ఏడాదికి మూడు పంటలకు నీళ్లు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్‌ఛార్జి కెయి శ్యాంబాబు, కెడిసిసి చైర్మన్ మల్లికార్జునరెడ్డి, శాలివాహన సంఘం అధ్యక్షులు నాగేంద్ర, ఆర్డీఓ ఓబులేసు, డిఎస్‌పి బాబా ఫకృద్దీన్, పత్తికొండ, తుగ్గలి, మద్దికెర జడ్పీటీసీలు సుకన్య, వరలక్ష్మీ, పురుష్తోతం చౌదరి, పత్తికొండ ఎంపిపి లక్ష్మీదేవి, టిడిపి నాయకులు విజయ్‌మోహన్‌రెడ్డి, సాంభశివారెడ్డి, నరసింహులు, గోవిందు, అశోక్, లోక్‌నాథ్ పాల్గొన్నారు.