కర్నూల్

పార్టీలోకి ఎవరొచ్చినా ఆహ్వానిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఏప్రిల్ 29:పార్టీ నియమ నిబంధనలకు లోబడి సర్దుకుపోయే వారు ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి వెల్లడించారు. నగరంలోని ఎస్‌బిఐ సర్కిల్ టిజె కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన కర్నూలు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని శనివారం ఆయన ఎంపి బుట్టా రేణుకతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరు మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నికల్లో పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు అభ్యర్థిని ఎంపిక చేస్తామన్నారు. నంద్యాల నియోజకవర్గంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా శిల్పామోహన్‌రెడ్డి వైకాపాలో చేరుతున్నట్లు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి కానీ శిల్పామోహన్‌రెడ్డి ప్రస్తావన తమ దృష్టికి రాలేదన్నారు. ఒకవేళ మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా శిల్పా లాంటి వారెవరైనా వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బివై రామయ్య, కర్నూలు నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత సిహెచ్ మద్దయ్య, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి మృతి
జూపాడుబంగ్లా, ఏప్రిల్ 29:మండల పరిధిలోని కెజి రోడ్డుపై 80.బన్నూరు, జూపాడుబంగ్లా గ్రామాల మధ్య శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బిటెక్ విద్యార్థి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఆత్మకూరు తాలూకా కొత్తపల్లి మండలం శివపురం గ్రామానికి చెందిన గొల్ల నరేష్(19) బిటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం కర్నూలులో వెళ్లి సెల్‌ఫోన్ తీసుకుని తిరిగి సొంత గ్రామానికి వస్తుండగా 80.బన్నూలు, జూపాడుబంగ్లా గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న ఆత్మకూరు బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలిసిన వెంటనే ఎస్‌ఐ అశోక్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నందికొట్కూరు ఆసుపత్రికి తరలించారు.