కర్నూల్

సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకున్న అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవనకొండ, ఏప్రిల్ 29: రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలని అఖిలపక్ష పార్టీలు సర్వ సభ్య సమావేశాన్ని అడ్డుకున్నాయి. శనివారం స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఎంపి పి రామచంద్ర నాయుడు అధ్యక్షతన ఎంపిడిఓ భాస్కర్‌నాయుడు ఆధ్వర్యంలో అధికారులు, ప్రజా ప్రతినిధులతో ప్రారంభమైన సమావేశాన్ని అఖిలపక్ష పార్టీల నాయకులు ముట్టడించారు. ఆయా పార్టీల నాయకులు, రైతులు ఎంపిడిఓ కార్యాలయాన్ని బైఠాయించారు. ప్రజల సమస్యలు పరిష్కరించని మండల సమావేశాలు ఎందుకని వారు అధికారులను ప్రశ్నించారు. రైతులకు పరిహారం అందించాలని గత నాలుగు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికి అధికారులు ఎందుకు స్పందించలేదని వారు నిలదీశారు. అందుకు స్పందించిన ఎంపిపి రామచంద్రనాయుడు, ఎంపిడిఓ భాస్కర్‌నాయుడు, ఏఓ అల్త్ఫా అలీఖాన్, ఎస్‌ఐ గంగయ్యయాదవ్, ఇతర అధికారులు చర్చించుకుని 20 రోజుల్లో రైతుల ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల హామీ మేరకు వారు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మద్దిలేటిశెట్టి, సిపిఎం డివిజన్ కార్యదర్శి వీరశైఖర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటరెడ్డి, వైసిసి కోకన్వీనర్ రామకృష్ణ, ఎంఆర్‌పిఎస్ జిల్లా కార్యదర్శి సుధాకర్, లోక్‌సత్తా పార్టీ నాయకులు రామదాసుగౌడ్, సిపిఐ మండల కార్యదర్శి నర్సరావు, శ్రీనివాసులు నాయుడు, శేఖర్, కుంకునూరు, వేలమకూరు, ఆలారుదినె్న రైతులు పాల్గొన్నారు.
మఠంలో వైభవంగా
అక్షయ తృతీయ వేడుకలు
* మూల బృందావనానికి గంధలేపనం అలంకరణ
మంత్రాలయం, ఏప్రిల్ 29: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీరాఘవేంద్ర స్వామి మఠంలో శనివారం అక్షయ తృతీయ వేడుకలు వైభవంగా జరిగాయి. పీఠాధిపతి శ్రీ సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో వేకువ జమున శ్రీరాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పంచాబృతాభిషేకం, తులసి అర్చన, నిర్మమల్య విసర్జన, ఉత్సవరాయల పాదపూజ. కనక మహాపూజ, తదితర ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. అనంతరం శ్రీ మూలరామ దేవతామూర్తులకు ఫల పుష్పాల అభిషేకాలతోపాటు వివిధ రకాల పూజలు చేసి ధూప ధీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక హారతి ఇచ్చారు. అక్షయ తృతీయ పురస్కరించుకుని ఎండ వేడిమి నుండి చల్లపరచేందుకు శ్రీ రాఘవేంద్రస్వామి మూల బృందావనానికి గంధలేపనం చేసి ప్రత్యేక పూజలు చేశారు. గంధలేపనం చేయటం వలన స్వామి ఎక్కువగా ఉన్న ఎండ తీవ్రత నుండి చల్లబడటమేకాకుండా భక్తులను చల్లగా చూస్తారనే నమ్మకం ఉంది. అనంతరం స్వామి మూల బృందావనంతోపాటు మఠంలో కొలువుదీరిన పూర్వపుపీఠాధిపతుల బృందావనాలకు సైతం గంధలేపనం చేసి ప్రత్యేక హారతి ఇచ్చారు. ఆంధ్ర కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలనుండి వచ్చిన భక్తులు అదిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
చంద్రబాబుది అబద్దాల పరిపాలన
* రామరాజ్యం జగన్‌తోనే సాధ్యం
* ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి
కర్నూలు సిటీ, ఏప్రిల్ 29:సిఎం చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి అబద్దాలతోనే పరిపాలన కొనసాగిస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో చూసిన రామరాజ్యం మళ్లీ జగన్‌తోనే సాధ్యమన్నారు. నగరంలోని రాయల్ ఫంక్షన్ హాలులో శనివారం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం, లేనిచో నిరుద్యోగ భృతి, రైతు, డ్వాక్రా, చేనేత రుణమాఫీ, వంటి 600 వాగ్దానాలు ప్రజలకు చేసి ఇప్పటి వరకూ వాటిలో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో వైఎస్ హయాంలో ప్రజలు ఎంతో సుఖశాంతులతో జీవనం సాగించే వారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తీవ్ర వర్షాభావం, కరవు పరిస్థితులతో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రకృతి కూడా సహకరించడం లేదన్నారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రకృతి కూడా సహకరించి సకాలంలో వర్షాలు కురిసి రైతన్న సుభిక్షంగా ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశారు. వైకాపా రాష్ట్ర కార్యదర్శి బివై రామయ్య మాట్లాడుతూ ఎక్కడికెళ్లినా జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణ చూసి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించేందుకు భయపడుతుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తెలంగాణలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోవడంతో అక్కడి కెసిఆర్ తరిమికొట్టడంతో ఏపిలో పడ్డారని, ఇక్కడి నుంచి కూడా తరిమికొడితేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. కర్నూలు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ దమ్ముంటే టిడిపి నాయకులు వార్డుల్లో తలెత్తుకు తిరగాలని సవాల్ విసిరారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారానని చెప్పిన ఎమ్మెల్యే ఏమేరకు అభివృద్ధి చేశారో ప్రజలే ప్రశ్నించాలని సూచించారు. కొందరు అభివృద్ధి పేరు చెప్పి పార్టీలు మారి డబ్బులు సంపాదించుకోవటానికి రాజకీయాల్లోకి వస్తున్నారని, అలాంటి వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మతిన్ ముజరుద్దీన్, వైకాపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తెర్నెకల్లు సురేంద్రరెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర నేత మద్దయ్య, రైతు సంఘం నాయకులు వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, జహీర్‌అహ్మద్‌ఖాన్, జిల్లా కార్యదర్శి నాగరాజు పాల్గొన్నారు.