కర్నూల్

నంద్యాల టిడిపి టికెట్‌పై వీడని పీటముడి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 29: నంద్యాల ఉప ఎన్నిక నోటీసు మరో వారం రోజుల్లో వెలువడనున్న విషయం ఇప్పటికే అధికారులకు సమాచారం అందింది. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ముందు ముఖ్యమంత్రి మే నెల 1వ తేదీన నంద్యాల పర్యటన కూడా వాయిదా పడింది. దీంతో నంద్యాల అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం మూడు గ్రూపులు రాజధాని అమరావతికి చేరుకొని మంత్రులు, పార్టీ అధ్యక్షులు, పార్టీ అధినేతతో చర్చిస్తున్నట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియను రాజధానికి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుండి ఆదేశాలు అందడంతో ఆమె హుటాహుటిన రాజధానికి బయలుదేరి వెళ్లింది. ఇదే సందర్భంలో నంద్యాల ఎంపి ఎస్పీపైరెడ్డి కూడా ముఖ్యమంత్రి నుండి సమాచారం అందడంతో ఆయనతోపాటు అల్లుడు శ్రీ్ధర్‌రెడ్డితో కలసి శనివారం రాజధానికి చేరుకున్నారు. అటు శిల్పా సోదరులు కూడా హైదరాబాదు నుండి హుటాహుటిన రాజధానికి చేరుకున్నారు. శనివారం మధ్యాహ్నం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావుతోను, ఇతర మంత్రులతోను మూడు వర్గాలు చర్చలు జరిపినట్లు తెలిసింది. శనివారం రాత్రి చంద్రబాబునాయుడుతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. మూడు గ్రూపులను పిలిపించుకున్న సిఎం నంద్యాల ఉప ఎన్నిక టిడిపి టికెట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద నంద్యాల ఉప ఎన్నిక టిడిపి టికెట్ విషయంపై పీటముడి వీడేది ఎన్నడు, ఎవరికి టికెట్ వస్తుందా? అన్న విషయంపై పట్టణంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు జోరుగా చర్చించుకుంటున్నారు. టిడిపి టికెట్ తమకు వస్తుందంటే, కాదు తమకే వస్తుందని బెట్టింగ్‌లకు కూడా వెనుకాడడం లేదు. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఖచ్చితంగా తమకు వస్తుందని, భారీ మొత్తాలతో పందెములు కాస్తున్నట్లు తెలిసింది. మొత్తం మీద టికెట్ ఎవరికి వస్తుందా? అన్న ఉత్కంఠ సిఎం చంద్రబాబు ప్రకటనతో తెరపడే అవకాశాలు ఉన్నాయి.
సిఎం పర్యటన వాయిదా
కర్నూలుటౌన్, ఏప్రిల్ 29 : సిఎం చంద్రబాబు మే 1వ తేదీ జిల్లాలో పర్యటించాల్సి ఉండగా వాయిదా పడినట్లు రెవెన్యూ అధికారులు శనివారం తెలిపారు. సిఎం పర్యటన కోసం గత రెండు రోజులుగా కలెక్టర్ సత్యనారాయణ, జెసి హరికిరణ్, జిల్లా అధికారులు ఏర్పాట్లపై సమీక్షలు, సమావేశాలు నిర్వహించారు. అయితే శనివారం ఉదయం సిఎం కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వచ్చే నెలలో ఢిల్లీ పర్యటన అనంతరం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా అధికారులు ఆదేశాలు అందాయి.
హంపీలో గోమాత విశ్వవిద్యాలయం
* పీఠాధిపతి శంకరభారతి స్వామీజీ
ఆదోనిటౌన్, ఏప్రిల్ 29: ఒక నాటి దక్షిణ భారతదేశ రాజధాని అయిన హంపీ క్షేత్రంలో గోమాత విశ్వవిద్యాలయం త్వరలోనే ఏర్పాటు చేస్తామని హంపీ విద్యారణ్య విరుపాక్షి సంస్థా నం పీఠాధిపతి విద్యారణ్య శంకరభారతి స్వామీజీ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని బ్రాహ్మణ పురోహిత సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మధుసూదన్‌శర్మ స్వగృహంలో అక్షయతృతీయ సందర్భంగా విద్యారణ్యస్వామీజీ, హంపీ విరుపాక్షిస్వామీజీ జ్ఞాన భ్రమరాంబదేవీలకు ప్రత్యేకంగా పూజలుచేశారు. అనంతరం ఆయన మాట్లాడు తూ ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిదండ్రు లు తమ పిల్లలకు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు చేస్తున్నారని, దైవిక జ్ఞానాన్ని దూరం చేస్తున్నారని, దీనివల్ల భవిష్యత్తులో చాలా కష్టంగా ఉంటుందన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు దైవిక జ్ఞానంతోపాటు సేవా కార్యక్రమాలు చేసే విధంగా ముందుకు పోవాలనిన్నారు. ప్రపంచమానవాళికి మార్గదర్శకమైన భగవద్గీతను ప్రతి ఒక్కరూ చదివే విధంగా చూడాలన్నారు. భగవద్గీత వల్ల దైవిక జ్ఞానం పెరుగుతుందన్నారు. ముఖ్యం గా దీపాలు వెలిగిస్తే జ్ఞానం పెరుగుతుందని, అయితే నేడు పుట్టిన రోజు వేడుకలకు దీపాలను ఆర్పుతున్నామని, ఇది చాలా నష్టం కల్గించే విషయమన్నారు. అక్షయతృతిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన తరణంలో దానిని వ్యాపారంగా మార్చారని, బంగారు కొనుగోలు చేయడానికి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విద్యారణ్యస్వామీజీ అక్షయతృతీయ నాడు గృహలోకి వెళ్లారని, దానిని గుర్తుగానే అక్షయతృతిని జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రపంచ మానవాళికి శాంతిని పంచి పెట్టాలని ఆయన కోరారు. అందుకోసం తాము పూజలు చేస్తున్నామని, గోమాతను అందరు పూజించాలని, గోముత్రం, పేడలో అనేక ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని, దానిని ప్రచారం చేయాలన్నారు. అందుకోసమే హంపీలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.