కర్నూల్

సాగు, తాగునీటి విషయంలో సీమకు అన్యాయం:బైరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఏప్రిల్ 26 : రాష్ట్ర ప్రభు త్వం చర్యల వల్ల సాగు, తాగునీటి విషయంలో రాయలసీమకు తీరని నష్టం జరిగిందని ఆర్పీఎస్ అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చేపట్టిన బస్సు యాత్ర లో భాగంగా పట్టణంలోని గాంధీ చౌక్‌లో మాట్లాడుతూ ఎప్పుడూ నీటి కరవు లేని నంద్యాల, ఆళ్లగడ్డ పట్టణాల్లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడిందన్నారు. పాలకుల నిర్లక్ష్యం కారణంగానే సీమ ప్రజలు సాగు, తాగునీరు హక్కులు కోల్పోయారన్నారు. ఎపి, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పోటీ పడి శ్రీశైల జలాశయం నుంచి నీటిని తరలించుకుపోవడం వల్లనే ఎన్నడూలేని విధంగా శ్రీశైలం జలాశయం డెడ్ స్టోరేజికి చేరుకుందన్నారు. శ్రీశైల జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం స్థిరీకరించాలని డిమాండ్ చేసినా కృష్ణా, గుంటూరు జిల్లాల రైతుల ప్రయోజనాల కోసం జలవనరుల మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్‌రావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమ్మక్కై సీమ ప్రయోజనాలను తుంగలో తొక్కి గుంటూరు, కృష్ణా రైతులను ఆదుకొనేందుకు కృష్ణా జలాలను తరలించారన్నారు. దీంతో కర్నూలు, నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, డోన్ తదితర పట్టణాల్లో లాతూరు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎన్నికలు వస్తే ఆర్పీఎస్ సత్తా చాటు తుందన్నారు. సీమ ప్రజలకు తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తే వారి ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. సీమ ప్రాంతం లో పరిశ్రమల ఏర్పాటుపై కూడా ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందన్నారు. ముఖ్యమంత్రి అమరావతి జపం చేస్తూ పరిశ్రమలను, విద్యాసంస్థలను, శిక్షణా కేంద్రాలను అక్కడికి తరలించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాజధాని, హైకోర్టు, ఎయిమ్స్, వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఐఐటి, మెట్రో రైలు తదితర సంస్థలన్ని అమరావతికి క్యూ కట్టడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉందన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రతిపక్ష నాయకుడు జగన్ పెదవి విప్పడం లేదని, ఉత్తర ఆంధ్రాలో భాగాపురం విమానాశ్రయం కోసం దీక్షలు చేపట్టిన వైకాపా సీమ ప్రాంతం కోసం ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నించారు.