కర్నూల్

చంద్రబాబు మాఫియా గాడ్‌ఫాదర్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, జూలై 18:మద్యం మాఫియాతో పాటు అన్ని మాఫియాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గాడ్‌ఫాదర్‌గా ఉన్నారని ప్రముఖ రాజకీయ విశే్లషకులు తెలకపల్లి రవి ఆపరోంచారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవన్‌లో మంగళవారం రాష్ట్ర ఐద్వా నాయకురాలు టిసి.లక్ష్మమ్మ వర్ధంతి సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన రవి మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం మాఫియానే అన్ని మాఫియాల కంటే పెద్దదన్నారు. మద్యం వల్ల పేద కుటుంబాలు మొదలుకుని సంపన్న కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతున్నాయన్నారు. మద్యపానం వల్లే దాదాపు 80శాతం రోడ్డు ప్రమాదాలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రహదారులకు 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు ఏర్పాటు చేసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను తుంగలోతొక్కి జనావాసాల మద్య, విద్యాసంస్థలు, దేవాలయాల సమీపంలో ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం విచారకరమన్నారు. ప్రస్తుతం రోజుకు రూ. 40కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో ఈ వ్యాపారం రాష్ట్ర ప్రభుత్వానికి కల్పతరువుగా మారిందన్నారు. ఇళ్ల మధ్యలో మద్యం షాపులు పెట్టడాన్ని ఖండిస్తూ మహిళలు పోరాటం చేస్తుంటే ఒకపక్క మద్యం మాఫియా గుండాలు, మరొక పక్క పోలీసులు మహిళలపై దాడులకు పాల్పడడం బాధాకరమన్నారు. ఇకనైనా సిఎం చంద్రబాబు ప్రజలకు ఆటంకం కలింగించే మద్యం షాపులను ఎత్తివేసేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో మహిళలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకురాలు నిర్మలమ్మ, జిల్లా కార్యదర్శి అలివేలమ్మ, లలిత కళాసమితి అధ్యక్షుడు పత్తి ఓబులయ్య, సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అవినీతిపై వంద ఫిర్యాదులు
కర్నూలుటౌన్, జూలై 18:జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ అవినీతికి పాల్పడుతున్న అధికారుల వివరాల కోసం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటుచేయగా తొలిరోజే వంద ఫిర్యాదులు అందినట్లు కలెక్టరేట్ అధికారులు తెలిపారు. జిల్లా నలుమూలల నుంచి బాధితులు మంగళవారం కలెక్టర్‌కు ఫోన్ ద్వారా అవినీతికి పాల్పడిన అధికారుల వివరాలను వివరించారు. కలెక్టరేట్‌లోని కమాంట్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటుచేసిన ల్యాండ్‌ఫోన్‌కు 25 ఫిర్యాదులు రాగా నేరుగా కలెక్టర్‌కు వంద మంది ఫిర్యాదు చేశారు. జిల్లాలో అవినీతిని అరికట్టేందుకు తీసుకున్న ప్రత్యేక చర్యల్లో తొలి రోజైన మంగళవారం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్దఎత్తున్న స్పందించండం విశేషం. అవినీతి వివరాలు తెలిపిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అధికారులు పేర్కొంటున్నారు. అవినీతికి పాల్పడుతున్న అధికారుల జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ డిఆర్‌ఓకు నివేదిక పంపారు.
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం:ఎస్పీ
కోడుమూరు, జూలై 18:జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ హెచ్చరించారు. ముఖ్యంగా మట్కా కార్యకలాపాలు, ఇసుక అక్రమ డంప్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎస్పీ మంగళవారం కోడుమూరు పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. మట్కా వల్ల సామాన్యుల జీవితాలు నాశనం అవుతున్నాయని, కావున మట్కాను పూర్తిస్థాయిలో నిర్మూలిస్తామన్నారు. ఇక ఎక్కడపడితే అక్కడ ఇసుక డంప్ చేసి వ్యాపారం చేసే అక్రమార్కుల భరతం పడతామన్నారు. ప్రభుత్వం సూచించిన ఇసుక రీచ్‌ల వద్ద మాత్రమే ఇసుకను తెచ్చుకోవాలని సూచించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి రెగ్యులర్‌గా కౌనె్సలింగ్ ఇవ్వాలని పోలీసులను ఆదేశించారు. అంతేగాక జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. ప్రధానంగా పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని, స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై నిర్లక్ష్యం, అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. గ్రామీణ స్థాయిలో పాఠశాలల పనితీరుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, ప్రతి ఒక్కరూ చదువుకుంటే నేరాలు తగ్గుతాయన్నారు. కప్పట్రాళ్ల గ్రామంలో ఇది వరకూ జరుగుతున్న అభివృద్ధి పనులు నిలిచిపోకుండా తాను కూడా అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎస్పీ స్టేషన్‌లో ఎస్‌ఐ మహేష్‌కుమార్‌తో కలిసి పోలీసుయాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్ వల్ల స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులు, కేసుల వివరాలు తెలుసుకునే అవకాశాలు ఉంటాయని తెలిపారు. అనంతరం కోడుమూరు సర్కిల్ పరిధిలోని పోలీస్‌స్టేషన్ల పనితీరు గురించి ఎస్పీ పోలీసులను అడిగి తెలుసుకున్నారు.
ఎస్పీని కలిసిన లింగందినె్న రైతు
గోనెగండ్ల మండలంలోని లింగందినె్న గ్రామానికి చెందిన వీరాచారి కొడుకు భాస్కర్ ఎస్పీని కలిసారు. తమకు లింగందినె్నలో 4 ఎకరాల పొలం ఉందని, ఈ పొలాన్ని అప్పు తీర్చేందుకు తాకట్టు పెట్టామన్నారు. అయితే తమ పొలాన్ని అనుమతి లేకుండా కోడుమూరు మండలం క్రిష్ణాపురం గ్రామానికి చెందిన ప్రాథమిక వైద్యుడు వెంకటేశ్వరరెడ్డి మరొకరికి విక్రయించాడని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమ పొలాన్ని తిరిగి తమకే ఇప్పించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్పీ ఈ విషయంపై వెంటనే విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని ఎస్ప కోడుమూరు ఎస్‌ఐని ఆదేశించారు.
ప్రమాదాలను అరికట్టాలి
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలుటౌన్, జూలై 18:జిల్లాలో ప్రమాదాలను తగ్గించేందుకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతపై మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఎస్పీ గోపీనాథ్‌జెట్టీతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాలు తగ్గించేందుకు జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ జాతీయ రహదారి, ఇతర రహదారులు, నగరాల్లో ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను గుర్తించి ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అధికారులను ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి నెలా 3వ మంగళవారం రాష్ట్రంలో జరిగే ప్రమాదాలపై సిఎం చంద్రబాబు సమీక్షిస్తారని, జిల్లాలో ప్రమాదాలు జరిగే ప్రాంతాల వివరాలపై ప్రత్యేకంగా సమీక్షిస్తారన్నారు. రోడ్డు ప్రమాదాలపై నిర్లక్ష్యం చేస్తే నిధులు కూడా ఆగిపోతాయని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నగరాల్లో ట్రాఫిక్ రద్దీపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. నగరాల్లో ప్రమాదాల నియంత్రణ బాధ్యత మున్సిపల్ యంత్రాంగానిదే అన్ని సూచించారు. కర్నూలు నుంచి గుంటూరు వెళ్లే రహదారిలో 4 అత్యంత ప్రమాదకర ప్రదేశాలను గుర్తించామని అక్కడ ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకోవాలని రవాణా అధికారులను ఆదేశించారు. నగరంలో రహదారి పనులకు సంబంధించి 49 టెండర్లు పిలిచామని ఈ నెల 29వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని కమిషనర్ హరినాథ్‌రెడ్డి కలెక్టర్‌కు వివరించారు. ప్రధాన కూడలిలో సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేశామని, త్వరలో ఏర్పాటు చేసి నివేదకలు అందిస్తామన్నారు. సమావేశంలో ఆర్టీఓ జగదీశ్వరరావు, రవాణా, పురపాలక, రెవెన్యూ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రోడ్ల విస్తరణలో ఉపాధి కోల్పోయినవారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
నంద్యాల, జూలై 18: నంద్యాల పట్టణంలో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా తమ ఆస్తులు కోల్పోయిన వారికి రెండింతల టిడిఆర్‌తోపాటు కోల్పోయిన భవనానికి నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుందని, పూర్తిస్థాయిలో స్థలం, భవనం కోల్పోయి జీవనోపాధి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని పురపాలక శాఖ సంచాలకులు కన్నబాబు అన్నారు. మంగళవారం నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో రోడ్ల విస్తరణలో బాధితులతో జిల్లా కలెక్టర్‌తో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రోడ్ల విస్తరణలో భాగంగా ఆస్తులు కోల్పోయిన వారి జీవనోపాదులకు ఆటంకం లేకుండ ప్రత్యామ్నాయంగా జీవనోపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. గాంధీ చౌకు నుండి పద్మావతినగర్ ఆర్చ్ వరకు 60 అడుగులు, పద్మావతి నగర్ జంక్షన్ వరకు 80 అడుగుల విస్తీర్ణంతో రోడ్డు విస్తరణ జరుగుతుందన్నారు. గతంలో పాత పట్టణం నుండి వినతులను అనుసరించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ప్రజాభిప్రాయ సేకరణ కూడా సేకరించిన అనంతరమే పనులు చేపడుతున్నామన్నారు. రోడ్ల విస్తరణలో పూర్తిస్థాయి ఆస్తులు కోల్పోయిన వారికి రెండింతల టిడిఆర్ ఇస్తారని, కోల్పోయిన భవనానికి నష్టపరిహారం ఇస్తారని, పూర్తిస్థాయిలో స్థలం, భవనం, కోల్పోయిన వారికి జీవనోపాధి కూడా కల్పిస్తారని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం కల్పించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆస్తులు ఇచ్చేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలన్నారు. అలా రాని పక్షంలో ప్రభుత్వం చట్టం ప్రకారం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు రోడ్ల విస్తరణ చేపట్టామని, ఈ విస్తరణలో దాదాపు 386 మంది ఆస్తులు కోల్పోతున్నారని, వాటిలో 52 మంది పూర్తిగా ఆస్తులు కోల్పోతున్నారని తెలిపారు. రోడ్ల విస్తరణకు అందరు సహకరించాలని గతంలోని పట్టణ ప్రణాళిక ప్రకారం 60 నుండి 80 అడుగుల వరకు విస్తరణ పనులు చేపడుతున్నామన్నారు. ఆస్తులు కోల్పోయిన వారికి అన్ని రకాలుగా ఆదుకుంటామని వారికి కూరగాయల మార్కెట్ వద్ద షాపింగ్ కాంప్లెక్స్‌లో నామమాత్రమే ధరలకు షాపులు అద్దెకు ఇస్తారని హామీ ఇచ్చారు. రోడ్ల విస్తరణలో ఆస్తులు కోల్పోతున్న యజమానులు మాట్లాడుతూ తాము వ్యాపారంపైనే జీవనం సాగిస్తున్నామని, వ్యాపారాలు తప్ప ఏ పనిచేయలేని స్థితిలో ఉన్నామని, రోడ్ల విస్తరణ విరమించాలని, తమ ఆస్తులకు ప్రత్యామ్నాయ ఆస్తులు కల్పించాలని, టిడిఆర్ పత్రాలు కాకుండ నగదు రూపేనా నష్టపరిహారం చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో పట్టణ ప్రణాళిక డైరెక్టర్ రఘు, నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాసరెడ్డి, ఇఇ రాజేంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

భక్తిశ్రద్ధలతో ఎల్లమ్మ జాతర
ఆదోని, జూలై 18: ఆదోని కొండల్లో కొలువై ఉన్న ఎల్లమ్మ అవ్వ జాతర ఆషాడ మాసం చివరి మంగళవారం విశిష్ట దినం కావడంతో ఎల్లమ్మ జాతరను భక్తులు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో ఉదయం నుంచి ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆషాడ మాసంలో చివరి మంగళవారం రోజు ప్రతి సంవత్సరం కూడా ఎల్లమ్మ జాతర జరగడం ఆనవాయితి. ఈసంవత్సరం కూడా ఎల్లమ్మ జాతరను భక్తులు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే ఎల్లమ్మ అవ్వకు ప్రత్యేక పూజలు చేసి హారతులు ఇచ్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆదోని పట్టణం నుంచే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి మహారాష్ట్ర, కర్నాటక ప్రాంతాల నుంచి కూడా భక్తులు వేలాది మంది ఎల్లమ్మ జాతరలో పాల్గొన్నారు. ఎల్ల మ్మ కొండల నిండా ఎక్కడ చూసిన భక్త జన సందోహం కనిపించింది. క్యూలో ఉండి దర్శనం చేసుకున్నారు. వర్షం వచ్చిన వేలాది మంది భక్తులు జాతరలో పాల్గొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఎల్లమ్మ దేవాలయం పక్కనే ఉన్న పరుశురాం దేవాలయంలో స్వామికి, తేరింటి ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తేరింటి ఎల్లమ్మ దేవాలయం వద్ద ఉయ్యల పూజలు పెద్ద ఎత్తున చేశారు. ఉదయం నుంచి ప్రారంభమైన భక్తుల సందడి సాయంత్రం అయిన అలాగే కొనసాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
నంద్యాలలో భారీ వర్షం
నంద్యాల, జూలై 18: రెండు నెలల నుంచి ఊరిస్తున్న వర్షాలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంగా మారడంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నంద్యాల పట్టణంలో మంగళవారం భారీగా వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం కురియడంతో నంద్యాల రహదారులన్నీ జలమయమయ్యాయి. ఒకవైపు ఆక్రమణల తొలగింపు...మరోవైపు భారీ వర్షంతో కాల్వలు మట్టి, రాళ్లతో నిండిపోవడంతో కాల్వలలోని బురదనీరు అంతా రహదారులపై పారుతుండడంతో దుర్గంధం వెదజల్లి కంపుకొడుతున్నాయి. రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతన్న వర్షం రాకతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నీరు లేక చెరువులు ఎండిపోవడంతో వర్షాధార పంటలపై ఆధారపడ్డ రైతులు దుక్కులు దున్నుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
కూరగాయలు కొనలేం..తినలేం...
కోసిగి, జూలై 18: కోసిగిలోని సంతమార్కెట్‌లో మంగళవారం కూరగాయాల ధరలు కొనలేం..తినలేం అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు సకాలంలో రాకపోవడంతో కాయగూరల సాగు పూర్తిగా తగ్గిపోయింది. దీంతో కిలో టమోటాలు రూ.100లకు అమ్మడంతో సామన్య, మధ్య తరగతి ప్రజలు టమోటలను కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంత మార్కెట్‌లో ఆశించిన విధంగా కూరగాయలు రావడం లేదు. టమోట బ్యాక్స్ ధర రూ.1800లు పలుకుతుంది. రైతులు బోరు, బావుల కింద కాయగూరలు సాగు చేద్దామనుకుంటే నీళ్ళులేవు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు కూరగాయలు సరఫరా చేస్తున్నారు. కూరగాయల ధరలు పెరగడంతో వాటిని కొనలేకపోతున్నారు. ఇప్పటికైన ప్రభుత్వం కూరగాయల ధరలను తగ్గించాలని ఆయాగ్రామాల ప్రజలు కోరుతున్నారు.

మహానందిలో దివ్య దర్శనం భక్తులు
మహానంది, జూలై 18: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన దివ్యదర్శనం భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మంగళవారం వీరు మహానందికి చేరుకోగా ఆలయ మ ర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థాని క అభిషేక మండపంలో వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు.

మహానందీశ్వరుని సన్నిధిలో నెల్లూరు ఎమ్మెల్యే
మహానంది, జూలై 18: మహానందిలో నెల్లూరు శాసన సభ్యులు కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో ఎఇఓ ధనుంజయ స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. కల్యాణ మండపంలో వారిని వేదపండితులు రవిశంకర్ అవధాని, నాగేశ్వర శర్మ, శాంతారామ్‌భట్‌లు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించగా, అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు.
ట్రాక్టర్ బోల్తా... ఒకని మృతి
* ఇద్దరికి గాయాలు
ఆదోనిటౌన్, జూలై 18: మండలంలోని పెద్దహరివాణం గ్రామం సమీపంలో మంగళవారం ట్రాక్టర్ బోల్తా పడి లక్ష్మీదేవి(35) మృతి చెందగా మృతురాలి తల్లి మల్లమ్మ, అత్త లక్ష్మమ్మలకు గాయాలైనట్లు ఇస్వీ ఎస్‌ఐ ఈశ్వరయ్య తెలిపారు. పొలం పనులకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్లమడికి నుంచి ఇసుకతో వస్తున్న ట్రాక్టర్‌లో గ్రామం వరకు తమకు వదిలి పెట్టాలని ట్రాక్టర్‌లో మృతురాలితోపాటు ఆమె తల్లి, అత్త ట్రాక్టర్ ఎక్కారని ఎస్‌ఐ వివరించారు. అయితే పెద్దహరివాణం సమీపంలో రోడ్డు పక్కన ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడడంతో ఈప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు