కర్నూల్

యథేచ్చగా నగదు పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల, ఆగస్టు 22: నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా నగదు, మద్యం ఏరులై పారుతోంది. సోమవారం సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియడంతో డబ్బు పంపిణీకి పార్టీల నాయకులు శ్రీకారం చుట్టారు. రాత్రి పొద్దుపోయేంతవరకు ఈ తతంగం కొనసాగింది. అదే విధంగా మద్యం సరాఫరా కూడా జరిగింది. పట్టణంలో నంద్యాల ఆర్డీఓ రామసుందర్‌రెడ్డి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ విధించారు. సోమవారం సాయంత్రం 6 గంటల నుండి పోలింగ్ ముగిసే వరకు పట్టణంలో, గ్రామాల్లో ఎక్కడా కూడా గుంపులుగా సమావేశాలు నిర్వహించరాదని, ర్యాలీలు నిర్వహించరాదని, ప్రచారాలు చేయరాదని ఓ వైపు పోలీసు జీపులు మైకుల్లో వివరిస్తున్నా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందిన చోటా నేతలు గల్లీల్లో గుట్టు చప్పుడు కాకుండ నగదు పంపిణీ కార్యక్రమాన్ని రాత్రి పూట పోలీసుల కంట పడకుండ గుట్టుగా చేసుకుపోతున్నారు. ఎక్కడ కూడా బయటి వాహనాలు కనపడకపోగా ద్విచక్ర వాహనాలను ఉపయోగిస్తూ ఆయా వార్డుల్లో కౌన్సిలర్లు, ఇన్‌చార్జిలు, వారి కింద పనిచేసే చోటా, మోటా నాయకులు నగదు పంపిణీని ఇంటింటికి వెళ్లి అందజేస్తున్నారు. ఎవరి దగ్గర కూడా భారీ నగదు ఉండకుండ జాగ్రత్త పడుతుండడంతో పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. రాష్టస్థ్రాయి నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నంద్యాలను ఖాళీ చేసి వెళ్లిన అనంతరం హోటళ్లన్ని పోలీసుల స్వాధీనంలోకి వచ్చినప్పటికి స్థానిక నేతలు కొందరు తమ అనుచరులతో ఆయా హోటళ్లలో తిష్టవేసి చోటా మోటా నాయకుల ద్వారా గుట్టుగా నగదును తరలిస్తున్నారు. ఇక పోలింగ్ నేడు (బుధవారం) ఉండడంతో మంగళవారం నుండే మద్యం షాపులను ఎక్సైజ్ శాఖ సీలు వేయడంతో నాయకులు మద్యం కేసులను గుట్టుగా తరలించుకుపోయారు. ఏ మద్యం షాపులో చూసినా రెండురోజుల నుండి నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ కూడా మద్యం బాటిళ్లు లూజుగా లభించడం లేదు. మందుబాబులు మద్యం కోసం వైన్ షాపుల్లో స్టాకు లేకపోవడంతో బార్ అండ్ రెస్టారెంట్ల వైపు చూస్తున్నారు. పోలింగ్ రోజు ఓటర్లకు మద్యం సరఫరా చేసేందుకు గల్లీ గల్లీకి ఒక సమాంతర బెల్టు షాపు నిర్వహించే విధంగా క్వార్టర్ బాటిళ్ల కేసులను ఎవరి కంటా పడకుండ చీకటి పడిన గంటలోపు వైన్ షాపులను ఖాళీ చేశారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచార ఘట్టం ప్రశాంతంగా ముగిసింది. ఇక పోలింగ్ జరగాల్సి ఉంది. పోలింగ్‌కు మంగళవారం ఒక్కటే మద్యలో మిగిలింది. మంగళవారం కూడా ఓటర్లకు నగదు పంపిణీ చేసేందుకు ఆయా గల్లీ లీడర్లు ఏర్పాటు చేసుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక కోసం ఆరు బెటాలియన్ల కేంద్ర బలగాలు, 25 ఎపిఎస్‌పి బెటాలియన్ల పోలీసు సిబ్బంది నంద్యాలలో తిష్టవేశారు. వీరికి తోడు స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది కలసి నంద్యాల పట్టణంలో రాత్రంతా గస్తీ నిర్వహించి గట్టి నిఘా ఉంచాలని రాయలసీమ ఐజీ ఇక్బాల్ అహ్మద్ పోలీసు అధికారులను ఆదేశించారు.

32 మండలాల్లో వర్షం
కర్నూలు సిటీ, ఆగస్టు 22: జిల్లాలో సోమవారం రాత్రి 32 మండలాల్లో వర్షం కురిసింది. వాటిలో 11 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. గడివేముల మండలంలో 42.8 మి.మీ నమోదు కాగా పాణ్యం 36.4 మి.మీ, వెలుగోడు 35. మి.మీ, బండిఆత్మకూరు 25.4 మి.మీ, కోసిగి 25.2 మి.మీ, మహానంది 24.6 మి.మీ, ఎమ్మిగనూరు 22.4 మి.మీ, పెద్దకడుబూరు 22.2 మి.మీ, బేతంచెర్ల 22 మి.మీ, నందవరం 21 మి.మీ, వెల్దుర్తి 20.8 మి.మీ, ఓర్వకల్లు 18.2 మి.మీ, నంద్యాల 14.8 మి.మీ, కృష్ణగిరి 13.4 మి.మీ, హోళగుంద 13.2 మి.మీ, గోనెగండ్ల మండలంలో 11.6 మి.మీ నమోదైంది. మంత్రాలయం, సిబెళగల్, గూడూరు, కౌతాళం, గోస్పాడు, పగిడ్యాల, కర్నూలు, మిడ్తూర్, ఆస్పరి, దొర్నిపాడు, ఆళ్లగడ్డ, కల్లూరు, సంజామల, కోవెలకుంట్ల, కోడుమూరు, రుద్రవరం వంటి తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
బ్యాంకుల సమ్మె
నంద్యాల రూరల్, ఆగస్టు 22: దేశవ్యాప్త బ్యాంకుల సమ్మెకు యుఎఫ్‌బియు పిలుపు మేరకు నంద్యాల మెయిన్ బ్రాంచి ఆవరణలో అన్ని బ్యాంకుల ఉద్యోగులు మంగళవారం సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్ని బ్యాంకుల కార్యదర్శి దేవేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న బ్యాంకు పురోభివృద్ధి వ్యతిరేక విధానాలకు, కస్టమర్ల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సమ్మె చేయడం జరిగిందన్నారు. జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి, 30 కార్పొరేట్ రుణాలు బయటపెట్టి, స్టాండింగ్ కమి టీ సిఫార్సులను అమలు చేయాలన్నారు. సమ్మెలో లోకల్ కార్యదర్శి పరదేశి కిరణ్, మద్దిలేటి, ధర్మశేషు, సుబ్బన్న, పూర్ణచంద్రరావు, మాధవీలత పాల్గొన్నారు.