కర్నూల్

ప్రత్యేక భద్రతా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, ఆగస్టు 22: నంద్యాల ఉప ఎన్నిక రాష్ట్రంలోని 13 జిల్లాల ప్రజలు ఎదురుచూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నంద్యాల ఉప ఎన్నికకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు రాయలసీమ ఐజి ఇక్బాల్ అహమ్మద్ నేతృత్వంలో డిఐజి శ్రీనివాస్, కర్నూలు ఎస్పీ గోపినాథ్‌జెట్టి, చిత్తూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల ఎస్పీలను ఎన్నికల విధుల్లో నియమించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇరుపార్టీల నేతలు నంద్యాలలో జరిగే ఉప ఎన్నికను తీసుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అలజడి జరగకుండా... 144సెక్షన్ విధిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పోలీస్ యంత్రాంగం చేపట్టింది. నంద్యాల ఎన్నికల చరిత్రలోనే ఇంత భారీస్థాయిలో భద్రత ఎప్పుడూ లేదన్నది వాస్తవం. పోలీస్ ఉన్నతాధికారులు అత్యాధునిక సాంకేతికతతో పర్యవేక్షణ చేయడానికి 3డ్రోన్2 కెమెరాలను ఏర్పాటు చేయగా, నంద్యాల ఎన్నికల్లో ఎప్పుడూ లేనివిధంగా ఉప ఎన్నికకు అల్లరిమూకలను చెదరగొట్టే వాటర్‌కెనన్ వాహనాన్ని మొట్టమొదటిసారిగా నంద్యాలలో ముందస్తుగా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక గ్రామాల్లో డ్రోన్ కెమెరా నిఘా, 259 నిఘా కెమెరాలు, 60 సిసి కెమెరాలతో పటిష్టం చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్‌క్యాస్టింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. జనసమూహంతో ఎక్కువగా ఉన్నచోట, రద్దీ ప్రదేశాల్లో, ఎత్తు ప్రదేశాల నుంచే ఫొటోలను డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించే విధంగా ఏర్పాటు చేశారు.
నంద్యాల ఉప ఎన్నికల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు ఉన్నతాధికారులు భారీ ఎత్తున పోలీసు బలగాలను నియమించారు. రాయలసీమ ఐజి ఇక్బాల్‌అహ్మద్ నంద్యాలలోనే ఉండి పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు. ముగ్గురు ఐపిఎస్ అధికారులతో పాటు పట్టణంలో బందోబస్తుకు ఎస్పీ రాజశేఖర్‌బాబును నియమించగా, నంద్యాల మండలంలో బందోబస్తుకు విశాఖపట్నం ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ, గోస్పాడు మండలానికి ఒంగోలు ఎస్పీ ఏసుబాబును నియమించారు. అలాగే 9మంది అదనపు ఎస్పీలు, 33మంది డిఎస్పీలు, 103మంది సిఐలు, 242మంది ఎస్‌ఐలు, 394మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1150మంది కానిస్టేబుళ్లు, 270మంది హోంగార్డులు, 288మంది మహిళా కానిస్టేబుళ్లు, 234మంది మహిళా హోంగార్డులు, 15ప్లాటూన్ల ఎఆర్ పోలీసులు, 8 ప్లాటూన్ల ప్రత్యేక పోలీస్ దళాలు, 9 ప్లాటూన్ల ఎపిఎస్పీ పోలీసులు, 6 ప్లాటూన్ల కేంద్ర పోలీసులతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు బందోబస్తు ఏర్పాటు చేశారు. నంద్యాల, నంద్యాల మండలం, గోస్పాడు మండలాలు మంగళవారం సాయంత్రం నుంచే పోలీసుల వలయంలో ఉండిపోయాయి.