కర్నూల్

పోలింగ్ కేంద్రాలకు తరలిన ఎన్నికల సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాలటౌన్, ఆగస్టు 22: నంద్యాల ఉప ఎన్నికలో భాగంగా విధులు నిర్వర్తించడానికి వచ్చిన ఎన్నికల అధికారులు, వెబ్‌క్యాస్టింగ్ అధికారులు నంద్యాల మార్కెట్ యార్డు వద్ద నుంచి బయలుదేరి వెళ్లారు. నంద్యాల పరిధిలోని 255 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తరలివెళ్లారు. పోలింగ్ ఉదయం 7గంటల నుంచి ప్రారంభం అవుతుండడంతో ఎన్నికల అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని బుధవారం చేయాల్సిన ఎన్నికల విధులలో ఉపక్రమించారు. అలాగే పోలీసులు కూడా తమకు నియమించిన కేంద్రాల వద్దకు తరలివెళ్లిపోయారు. మహిళా కానిస్టేబుళ్లకు, హోంగార్డులకు ప్రత్యేక రూంలను ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటుచేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినా క్షణాల్లో అక్కడికి చేరుకునేందుకు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచారు.

సమస్యాత్మక గ్రామాల్లో డ్రోన్లతో నిఘా-ఎస్పీ
కర్నూలు, ఆగస్టు 22: నంద్యాల ఉపఎన్నిక జరిగే సమస్యాత్మక గ్రామాలపై డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని ఎస్పీ గోపినాథ్‌జెట్టి చెప్పారు. మంగళవారం అయ్యలూరు గ్రామాన్ని, పోలింగ్ బూత్‌లను ఎస్పీ డ్రోన్ కెమెరాలతో పరిశీలించారు. ఎటువంటి సంఘటనలకు తావివ్వకుండా ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణలో మరింత నిఘా పటిష్టం చేసేందుకు డ్రోన్ కెమెరాలు చాలా ఉపయోగపడుతున్నాయన్నారు. డ్రోన్ కెమెరా, 259 బాడీ ఓస్ కెమెరాలు, 60 సిసి కెమెరాలతో సాంకేతిక పరిజానాన్ని పోలీసులు వినియోగిస్తున్నారన్నారు. రెవిన్యూ వారి ఆధ్వర్యంలో పోలీంగ్ బూత్‌ల దగ్గర వెబ్‌కాస్టింగ్ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జన సమూహం ఎక్కువగా ఉన్నచోట, రద్దీ ప్రదేశాల్లో, ఎత్తు ప్రదేశాల నుండే ఫోటోల రూపంలో చిత్రీకరిస్తూ ఎప్పటికప్పుడు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. అనంతరం విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మతో కలసి ఎస్పీ పొన్నాపురం గ్రామాం, పోలింగ్ బూత్‌లను తనిఖీ చేసి పరిశీలించారు. ఎస్పీ వెంట ఈ కాప్స్ ఇంచార్జి రాఘవరెడ్డి, డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు ఉన్నారు.