కర్నూల్

బాలికలపై అకృత్యాలు బాధాకరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 19:బాలికలపై అత్యాచారాలు, అకృత్యాలు జరగడం బాధాకరమని, ఇకపై అలాంటివి జరగకుండా మన దేశం నుంచి తరిమికొట్టాలని నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి పిలుపునిచ్చారు. నగరంలోని ఏపిఎస్పీ క్యాంపులో ‘సురక్షిత బాల్యం-సురక్షిత భారతదేశం’ అంశంపై సత్యార్థి, సిఎం చంద్రబాబులు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యార్థి మాట్లాడుతూ తాను మహాఉద్యమం చేపట్టానన్నారు. చిన్న పిల్లల భవిష్యత్తు, సంక్షేమం, హక్కుల కోసం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకూ యాత్ర చేపట్టానన్నారు. అలాగే బాలబాలికపై లైంగిక వేధింపులు, క్రూరత్వాన్ని తరిమివేయడంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ఈ యాత్రకు శ్రీకారం చుట్టానన్నారు. తాను చేపట్టిన ఈ యాత్రలో సిఎం చంద్రబాబు ప్రత్యేకంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, క్రూరత్వం లాంటి జాఢ్యాలను సమాజం నుంచి పారదోలేందుకు తాను పోరాటం చేస్తున్నానన్నారు. బుద్ధుడు, మహాత్మాగాంధీ పుట్టిన భారతదేశంలో నేను జన్మించడం గర్వంగా వుందన్నారు. దేశవ్యాప్తంగా లైంగిక వేధింపులు, బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అవమానపరచడం వంటి కేసులు 15 వేలు రిజిస్టర్ అయ్యాయని అందులో 4శాతం పరిష్కారం కాగా 90 శాతం పెండింగ్‌లో వున్నాయన్నారు. పాఠశాల ఆవరణలో పిల్లలు అవమానాలకు గురవుతున్నారని పిల్లలకు జరిగిన అన్యాయంపై త్వరితగతిన తీర్పు వెలువడాలన్నారు. భారత దేశం యువత దేశం అన్నారు. 4 శాతం విద్య, ఆరోగ్యానికి ఖర్చు చేస్తున్నారన్నారు. 2001లో సిఎం చంద్రబాబును కలిశానని, ఏపి దశ దిశ రూపురేఖలు మార్చే శక్తి చంద్రబాబుకు వుందన్నారు. రాజకీయ, అభివృద్ధి సంక్షేమ పథకాలను హృదయంతో చేయాలన్నారు. తల్లిదండ్రులు పిల్లల పట్ల స్నేహితులుగా మెలగాలన్నారు.
సత్యార్థి యాత్రకు సంపూర్ణ మద్దతు:సిఎం చంద్రబాబు
రాష్ట్రంలో బాలబాలికల సంరక్షణ కోసం సత్యార్థి చేపట్టిన పవిత్ర కార్యక్రమానికి తనతో పాటు ప్రతిఒక్కరూ మద్దతు తెలపాలని సిఎం చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. పిల్లల సంరక్షణ కోసం 40ఏళ్ల నుంచి పోరాడుతున్న వ్యక్తి సత్యార్థి అన్నారు. సత్యార్థి ఒక అడుగు ముందుకేయడంతో నేడు విజయాలు చూస్తున్నామని, ఇలాంటి వారు ఎందరో తయారు కావాల్సిన అవరం ఉందన్నారు. మనం వేసే ప్రతి అడుగు భవిష్యత్తుకు పునాది కావాలన్నారు. చెడును ఖండిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. సత్యార్థి పోరాటం మా అందరిలో స్ఫూర్తి నింపిందన్నారు. పిల్లలకు స్వేచ్ఛ, ఆనంద జీవితం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అనంతరం సిఎం చంద్రబాబు సత్యార్థి, ఆయన సతీమణి సమేధలను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు.