కర్నూల్

సిఎం చంద్రబాబుకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, సెప్టెంబర్ 19:సురక్షిత బాల్యం-సురక్షిత భారతదేశం కార్యక్రమంలో పాల్గొనడానికి మంగళవారం నగరంలోన ఎస్‌ఎపి క్యాంప్‌నకు చేరుకున్న సిఎం చంద్రబాబుకు హెలిప్యాడ్ వద్ద ఘనస్వాగతం లభించింది. డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎంపి టిజి వెంకటేష్, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణియాదవ్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కెడిసిసి బ్యాంకు చైర్మన్ మల్లికార్జునరెడ్డి, టిడిపి నాయకులు కెఇ ప్రతాప్, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఘనంగా స్వాగ తం పలికారు. అనంతరం సిఎం ఎస్‌ఎపి క్యాంపు నుంచి రోడ్డు మార్గాన బయల్దేరి విద్యుత్ భవన్ దగ్గర నోబెల్ అవార్డు గ్రహీత కైలాస్ సత్యార్థి చేపట్టిన ర్యాలీకి స్వాగతం పలికారు. అలాగే ఆయనతో పాటు ర్యాలీలో పాల్గొని ఎస్‌ఎపి క్యాంపులో ‘సురక్షిత బాల్యం -సురక్షిత భారతదేశం’ అంశంపై బాలబాలికలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, తదితరులు పాల్గొన్నారు.
దుర్గాదేవి విగ్రహాల ఏర్పాటుకు
టిజిబి యూత్ ఆర్థికసాయం
కల్లూరు, సెప్టెంబర్ 19:దసర నవరాత్రులు పురస్కరించుకుని నగరంలో దుర్గాదేవి విగ్రహాలను ఏర్పాటుచేసే ప్రతి కమిటీ సభ్యులకు రూ. 10వేల చొప్పున టిజిబి యూత్ అధ్యక్షుడు టిజి భరత్ అందజేశారు. నగరంలోని వౌర్యాఇన్‌లో మంగళవారం టిజిబి యూత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన భరత్ మాట్లాడుతూ దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుపుకోవాలని, ఈ ఉత్సవాలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. దుర్గామాత విగ్రహాలు ఏర్పాటు చేసే కమిటీలను ప్రతి ఏడాది ప్రోత్సహిస్తూ అమ్మవారికి పూజలు అత్యంత ఘనంగా జరిగేలా కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో దుర్గా మాత ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
జిడిపి నీటితో చెరువులు నింపాలి
* సిఎం చంద్రబాబుకు విష్ణు వినతి
కర్నూలు సిటీ, సెప్టెంబర్ 19:కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న చెరువులు, కుంటలను గాజులదినె్న ప్రాజెక్టు(జిడిపి) నీటితో నింపాలని కోడుమూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి డి.విష్ణువర్ధన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంగళవారం సిఎం చంద్రబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా నుంచి తుంగభద్ర ప్రాజెక్టు, ఎఎల్‌సి నుంచి గాజులదినె్న ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయాలని భావిస్తున్నారని, ప్రస్తుతం జిల్లాలో రోజూ వర్షాలు కురుస్తున్నాయని రైతులకు 10 నుంచి 15 రోజుల వరకూ సాగునీటి అవసరం ఉండదన్నారు. ఆ నీటితో నియోజక వర్గంలోని అన్ని చెరువులు, కుంటలను నింపితే ముమ్ముందు రైతులకు సాగునీరందించ వచ్చన్నారు. ముఖ్యంగా కోడుమూరు మండలంలోని కల్లపరికుంట, పులకుర్తి చెక్ డ్యాం, కోడుమూరు హంద్రీనదికి తాగునీరు, అమడగుంట్లకుంట, ప్యాలకుర్తి కుంట, గూడూరు మండలంలోని కుమ్మరి కుంట, బుజగలవాని చెరువు, ఊరచెరువు, కె.నాగలాపురం చెరువు, గుడిపాడుకుంట, బెళగల్ మండలంలోని బ్రాహ్మణదొడ్డి చెరువు, బ్యాతోలి చెక్‌డ్యాం, చిన్నరేవుల కుంటతో పాటు కల్లూరు మండలంలోని చిన్నరాయనితిప్ప చెరువులను నీటితో నింపాలని కోరారు. దీనిపై స్పందించిన సిఎం చంద్రబాబు కోడుమూరు నియోజకవర్గంలోని చెరువులను జిడిపి నీటితో నింపాలని కలెక్టర్ సత్యనారాయణకు ఆదేశాలు జారీ చేశారని వెల్లడించారు.