కర్నూల్

పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జూపాడుబంగ్లా, సెప్టెంబర్ 19 : మండల పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద మంగళవారం అధికారులు ప్రత్యేక పూజలు చేసి సాగునీటి అవసరాల కోసం 5వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులు దాటి న తర్వాత పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్‌లో 859.6 అడుగులకు నీరు చేరగా 103టిఎంసిల నీరు ఉన్నట్లు ఇరిగేషన్ సిఇ నారాయణరెడ్డి తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల కోసం కృష్ణా బేసిన్‌ను కోరగా ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో సాగునీటి సమస్యలు దృష్టిలో ఉంచుకుని పోతిరెడ్డిపాడు వద్ద ఉన్న 5,6,7,8 గేట్లను 3 ఇంచుల వరకూ ఎత్తి 5వేల క్యూసెక్యుల నీటిని విడుదల చేశారు. ఈ నీటిని వెలుగోడు రిజర్వాయర్‌లోకి పంపుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పొలాలకు నీటి అవసరం లేదని అందువల్ల ఎస్‌ఆర్‌బిసి కెసి కెనాల్ నీటిని విడుదల చేయడం లేదన్నారు. ప్రకృతి కరుణించి ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు దాదాపు 2లక్షల క్యూసెక్యుల నీరు శ్రీశైలం రిజర్వాయర్‌లోకి చేరుతుందన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 5రోజుల్లో శ్రీశైలం రిజర్వాయర్‌కు పూర్తిస్థాయి నీటి మట్టం చేరే అవకాశం ఉందన్నారు. ఇక శ్రీశైలం రిజర్వాయర్‌కు వచ్చే నీటి లభ్యతపై దిగువకు నీటి విడుదలయ్యే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఇ రాఘవరెడ్డి, డిఇ వెంకటరమేష్ బాబూజీ, ఇఇలు శ్రీనివాసరెడ్డి, పురుషోత్తం, విశ్వనాథ్ పాల్గొన్నారు.
సంపూర్ణ అక్షరాస్యతతోనే దేశాభివృద్ధి
* డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి
కర్నూలు, సెప్టెంబర్ 19:ప్రతిఒక్కరూ విద్యనభ్యసించినప్పుడే దేశం బాగుపడుతుందని డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి పేర్కొన్నారు. నగరంలోని ఏపిఎస్పీ క్యాంపులో మంగళవారం నిర్వహించిన నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి సన్మాన సభలో కెఇ ప్రసంగించారు. సత్యార్థి 80వేల బాలకార్మికులకు వెట్టిచారికి నుంచి విముక్తి కల్పించారన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ స్ర్తి శిశు సంక్షేమ శాఖ ద్వారా 178 బాల్య వివాహాలను ఆపామని, ఆరుగురిని లైంగిక వేధింపుల నుంచి కాపాడామన్నారు. 1090 మంది పిల్లలకు స్ర్తి, శిశుసంక్షేమ శాఖ ద్వారా విద్యనందిస్తున్నామన్నారు. ఈ ఏడాది 303 మంది బాలకార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పించడంతో పాటు వారి సంక్షేమం కోసం పాటుపడుతున్నామన్నారు. అనంతరం సిఎం చంద్రబాబు సత్యార్ణి, ఆయన సతీమణి సమేధలను జ్ఞాపిక, శాలువాతో సత్కరించారు. ఆ తర్వాత మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ముద్రించిన కిశోర వికాసం బ్రోచర్లను సిఎం చంద్రబాబు, సత్యార్థి వేదికపై వున్న ప్రతినిధులందరూ ఆవిష్కరించారు. అంతకుముందు సమావేశ హాలులో స్ర్తి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన ‘సురక్షిత బాల్యం-సురక్షిత భారతదేశం’ ఛాయాచిత్రాలను సిఎం, సత్యార్థి తిలకించారు. ముఖాముఖి అనంతరం సిఎం ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. కార్యక్రమంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, ఏపిఐడిసి చైర్మన్ కెఇ ప్రభాకర్, శాసనమండలి మాజీ చైర్మన్ చక్రపాణియాదవ్, ఎంపిలు టిజి వెంకటేష్, బుట్టా రేణుక, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, డిఐజి ఇక్బాల్‌హుసేన్, ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, శమంతకమణి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
బాలల హక్కులపై అవగాహన కల్పిస్తాం..
ఓర్వకల్లులోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయ విద్యార్థిని శ్యామల మాట్లాడుతూ తాను 7వ తరగతి చదువుతున్నానని, అక్కడ నాకు విద్యతో పాటు అన్ని విషయాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపింది. 1098 మంది బాల కార్మికులను కాపాడి కెజిబివిల్లో చేర్పించారన్నారు. మేము పెద్దాయ్యాక నలుగురికి హక్కులపై అవగాహన కల్పిస్తామన్నారు. ఇంట్లో ఒక అమ్మాయి చదివితే దేశం మొత్తం బాగుపడుతుందన్నారు. కర్నూలు నగరానికి చెందిన పల్లవి తాను 9వ తరగతి చదువుకుంటున్న సమయంలో ఒక వ్యక్తి తనను ప్రేమించి మోసం చేశాడని, దానివల్ల తాను ఆత్మహత్యకు పాల్పడే సమయం లో పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది తనలో మనోధైర్యం నింపి విద్యాబుద్ధులు నేర్పించారని వివరించగా ముఖ్యమంత్రి స్పందించి పల్లవి కష్టం తనకు బాధ కలిగించిందని ఇలాంటి సమస్యను సృష్టించే వారి పట్ల ప్రభు త్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. పల్లవికి ప్రభుత్వ పరంగా అంగన్‌వాడిలో ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ. 5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానన్నారు. పల్లవి అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అందరూ సహకరించాలని తాను కూడా సహకరిస్తానన్నారు. మానవత్వం లేని సమాజంలో ఇంకో అమ్మాయి నష్టపోయిందని ఆమెకు కూడా రూ. 5లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానన్నారు. ఓర్వకల్లు మండలం గుడుంబాతండాకు చెందిన మంగిబాయి మాట్లాడుతూ తాను చిన్నతనంలో సిఎం చంద్రబాబు బనగానపల్లెకు వచ్చిన సమయంలో స్వయంగా కలిశానన్నారు. ఆనాడు సిఎం చదువుకుని ఏమవుతావని ప్రశ్నించగా డాక్టర్‌ను అవుతానని చెప్పానని కానీ నేడు సిఎం చొరవతో నర్సునయ్యానన్నారు. ఇక ఒక తమ్ముడు ఎస్‌ఐ, మరో తమ్ముడు కానిస్టేబుల్ అని తెలపగా సిఎం ఆమెను అభినందించారు.