కర్నూల్

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, సెప్టెంబర్ 21: ఆదోనిలోని శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు గురువారం భక్తిశ్రద్ధలతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఎటు చూసిన శరన్నవరాత్రి కాంతులు కనిపిస్తున్నాయి. గంగాభవాని దేవాలయంలో గంగాభవాని మాతను సంతాన లక్ష్మీగా అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. పెద్ద ఎత్తున మహిళలు అమ్మవారిని పూజించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు. మున్సిపల్ మైదానంలో విజయదశమి శరన్నవరాత్రుల ఉత్సవ కమిటీ అధ్యక్షులు కునిగిరి నాగరాజు ఆధ్వర్యంలో దుర్గామాతను నెలకొల్పి ఉదయం హోమాలు నిర్వహించారు. విద్యుత్ దీపాలతో మున్సిపల్ మైదానం కళకళలాడింది. ఈకార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు ఎండి. బసవరాజుస్వామి, మారుతిరావు, శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొని పూజలు చేశారు. తిక్కలక్ష్మమ్మ అవ్వను పసుపు కుంకుమలతో అలంకరణ చేశారు. ఆలయ ధర్మకర్త రాచోటి రామయ్య, రాచోటి సుబ్బయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. అంభాభవాని దేవాలయంలో దుర్గామాత విగ్రహాన్ని నెలకొల్పి పూజలు చేశారు. లంగరబావి వీధి, అంబేద్కర్ నగర్, కిల్చన్‌పేట్, కన్యకాపరమేశ్వరి దేవాలయం, కొల్హాపురమ్మ దేవాలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరణ చేసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. మున్సిపల్ మైదానంలో సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బైచిగేరిలో అంభవాని దేవాలయం, మున్సిపల్ కాలనీలోని మాత పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. భక్తులతో దేవాలయాలు కిటకిటలాడుతున్నాయి. కాగా అంబేద్కర్ నగర్‌లో దుర్గాదేవి విగ్రహాన్ని ఏర్పాటు చేసి శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆ ప్రాంతం భక్తులు సాయంత్రం దుర్గామాత దేవి విగ్రహాన్ని మేళతాళాలతో ఆంజనేయస్వామి దేవాలయం నుండి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
మంత్రాలయంలో...
మంత్రాలయం: మంత్రాలయంలో దుర్గానవరాత్రి మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం శరన్నవరాత్రులు వేడుకల్లో నాగంగా శ్రీవాసవి దేవస్తానం ఆధ్వర్యంలో వాసవీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన వేడుకల సందర్భంగా మొదటిరోజు దుర్గాదేవి స్వర్ణకవచ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులు అమ్మవారికి పంచామృతాభిషేకం, కుంకుమార్చనలు తదితర ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనతంరం భక్తులు అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు.
ఆళ్లగడ్డలో...
ఆళ్లగడ్డ: దసరా నవరాత్రి ఉత్సవాలు గురువారం వైభంగా ప్రారంభమయ్యాయి. స్ధానిక అమ్మవారిశాలలో ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు తొమ్మండ్రు వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో మొదటి రోజు వాసవీ మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరీదేవి అలంకారం చేసి కొలువు మండపంలో వుంచారు. నవరాత్రి ఉత్సవాల్లో అర్యవైశ్యులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. టిడిపి నాయకులు గంగుల ఫణికృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి, వాసులు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే విశ్వరూపానగర్‌లో వెలసిన శ్రీ కాళికామాత ఆలయంలో కమిటీ అధ్యక్షులు యాడికి గోపాలాచారి ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మొదటి రోజు కాళికామాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీశైలం డ్యాం నీటిని నిలకడగా ఉంచండి
ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 21: శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం పూర్తి స్థాయిలో నిలకడగా వుండే వరకు దిగువ ప్రాంతానికి నీరు వదలకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందని మాజీ ఎంపి, టిడిపి నాయకులు గంగుల ప్రతాపరెడ్డి అన్నారు. పట్టణంలోని స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం డ్యాంలో ప్రస్తుతం 868 అడుగుల నిలువ వుందని, ఈ నీటిని కిందకు నీరు వదలరాదని అన్నారు. ఈ మాసంలో మంచి వర్షాలు కురవడంతో శ్రీశైలం డ్యాంలోకి ఎక్కువగా నీరు వచ్చి చేరడంతో డ్యాంలో నీటి మట్టం 868 అడుగులకు చేరుకుందన్నారు. డ్యాంలోకి నీరు వస్తుండడంతో రాయలసీమ ప్రాంతంలోని సాగునీటి పధకాలకు నీరు సరఫరా అవుతోందని తద్వారా రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోందన్నారు. ఈ నీటిని విద్యుత్ ఉత్పత్తికి కూడా కిందకు వదలరాదన్నారు. నీటి విడుదల విషయం ప్రభుత్వం జాగ్రత్త వహించాలని కోరారు. అవసరమైతే తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడతామన్నారు. నీటి విద్యుత్ అవసరం లేకుండా ధర్మల్, సోలార్ వంటి విద్యుత్ ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వదలాలని కోరినా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా చేస్తే సరిపోతుందన్నారు. కృష్ణాప్రాంతంలో పట్టిసీమ నీరు ఉపయోగించుకుంటున్నారని, దిగువ ప్రాంతం వారి అవసరం కంటే మన సీమ రైతుల అవసరాన్ని దృష్టిలో వుంచుకోవాలన్నారు. ఇదే రాయలసీమ రైతులకు ప్రభుత్వం ఇచ్చే కానుక అని అన్నారు. శ్రీశైలం డ్యాం నీటిని మరో నెల వరకు దిగువ ప్రాంతానికి వదలకుండా ఓపిక పడితే సీమ రైతులకు ఎంతో మేలు చేసిన వారవౌతామన్నారు. ఈ కార్యక్రమంలో నీనియర్ నాయకులు రామకృష్ణారెడ్డి, గంగుల ఫణికృష్ణారెడ్డి, కేంద్ర కాటన్ బోర్డు మాజీ సభ్యులు చింతకుంట్ల శ్రీనివాసరెడ్డి(వాసు), నాసారి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.