కర్నూల్

నమ్మించి మోసం చేశారు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 21:వ్యవసాయ యంత్ర సామగ్రి, స్పేర్ పంపులు కేవలం రూ. 5 వేలకే ఇస్తామని, ఆ సొమ్మును కూడా కంతుల వారీగా చెల్లించవచ్చు.. లేదా రుణమాఫీ అవుతుందని నమ్మబలకడంతో వారు చెప్పిన చోట సంతకం చేసి, వేలిముద్రలు వేసి మోసపోయామని కొత్తపల్లి మండల పరిధిలోని ఎదురుపాడు గ్రామానికి చెందిన రైతులు ఎన్.బాలచెన్నయ్య, శంకరయ్యతో పాటు మరో 30 మంది రైతులు గురువారం కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. స్ప్రేయర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గత జనవరిలో అధికారులు ప్రకటించడంతో సుమారు 700 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా మార్చిలో మారుతి స్ప్రేయర్లను అధికారులు అందజేశారు. అయితే ఇటీవల ఎదురుపాడు గ్రామానికి చెందిన శంకరయ్య, ఎన్.నబిసా బ్యాంకు ఖాతాల్లో రూ. 14వేలు జమ అయి ఆ తర్వాత విత్ డ్రా చేసుకున్నట్లు ఫోన్‌కు మేసేజ్ వచ్చిందన్నారు. ఈ విషయమై రైతులు బ్యాంకు అధికారులను ప్రశ్నించగా పంట రుణాలు వచ్చాయని రాంపల్లి సొసైటీ అధికారులు డబ్బులు తీసుకెళ్లినట్లు తెలపడంతో రైతులు అవాక్కయ్యారు. తమ ఖాతాల్లోని డబ్బులను వారు ఎలా డ్రా చేస్తారని రైతులు బ్యాంకు అధికారులను నిలదీయగా లబ్ధిదారుల విత్‌డ్రాలను సొసైటీ అధికారులు తీసుకొచ్చి నగదు తీసుకెళ్లారని వారు తెలిపారు. దీంతో సొసైటీ అధికారి బాబురావును కలిసేందుకు ప్రయత్నించడంతో అతను తప్పించుకుని తిరగడం వల్ల రైతులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై డిజిఎం ఉమామహేశ్వరరెడ్డిని వివరణ కోరగా రైతులెవరికీ తైవాన్ స్ప్రేయర్లు ఇవ్వలేదని, పంటరుణాల్లో నుంచే స్ప్రేయర్లు కొని ఇచ్చామని స్పష్టం చేశారు.
వైకాపా మరింత బలోపేతం
* పిఎసి చైర్మన్ బుగ్గన
డోన్, సెప్టెంబర్ 21:డోన్ ప్రాంతంలో వైకాపాను మరింత బలోపేతం చేస్తామని పిఎసి చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. పట్టణంలోని తన నివాసంలో గురువారం ఎమ్మెల్యే బుగ్గన పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ డోన్ నియోజకవర్గంలో వైకాపాను తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామన్నారు. అధికార పార్టీ నాయకుల వత్తిళ్లకు తలొగ్గకుండా ధైర్యంగా పార్టీ అభివృద్ధికి పాటుపడుతున్న కార్యకర్తలు, నాయకులకు అండగా వుంటానని తెలిపారు. చంద్రబాబు పాలన మోసపూరితమని విమర్శించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. వైకాపా తలపెట్టిన ‘వైఎస్‌ఆర్ కుటుంబం’ కార్యక్రమం ద్వారా టిడిపి నేతల అసలు రంగు బయటపడుతోందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలను అర్హులకు అందజేయకుండా తెలుగు తమ్ముళ్లే దిగమింగుతున్నారని, ప్రభుత్వ పథకాలు తెలుగు తమ్ముళ్లకే పరిమితమయ్యాయని ఆరోపించారు. కార్యక్రమంలో జడ్పీటిసి సభ్యులు శ్రీరాములు, వైకాపా సీనియర్ నేత టిఇ చిన్న కేశవయ్యగౌడ్, వైకాపా నాయకులు కొట్రికె హరికిషన్, పోస్టు ప్రసాద్, ఆర్‌ఇ రాజవర్ధన్, తదితరులు పాల్గొన్నారు.