కర్నూల్

చిన్నారులకు పౌష్ఠికాహారం బాలామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, సెప్టెంబర్ 25: చిన్నారులకు మంచి పోషకవిలువలు వున్న పౌష్టికాహారం బాలామృతం అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. స్ధానిక అంగన్‌వాడీ కేంద్రం లో సిడిపిఓ పద్మావతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బాలామృతం పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా విచ్చేసిన మంత్రి చిన్నారుల తల్లులకు బాలామృతం ప్యాకెట్లను పంపిణీ చే శారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలామృతం 6 నెలల చిన్నారుల నుండి మూడేళ్ల పిల్లల వరకు పౌష్టికాహారం అందించడం వల్ల వారి లో ఎదుగుదల ఉంటుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు అమృత హస్తంగా అంగన్‌వాడీ కేంద్రా ల్లో పంపిణీ చేసేవారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగన్‌వాడీ కేంద్రాల్లో బాలామృతం ప్రారంభించారన్నారు. మొదటగా గుంటూరులో, నేడు ఆళ్లగడ్డలో ప్రారంభించామన్నా రు. గ్రామీణప్రాంతాల్లో, పట్టణ ప్రాం తాల్లో పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందివ్వడం తప్పనిసరి అని ముఖ్యమంత్రి అందిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వున్న చిన్నారులకు ఆంగ్ల విద్యను అందించాలన్న ఉద్దేశ్యంతో అంగన్‌వాడీ కార్యకర్తలకు ఆంగ్ల విద్యాభోధనపై శిక్షణ ఇచ్చారన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆంగ్ల బోధన అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, సింగం వెంకటేశ్వరరెడ్డి, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

హంద్రీనీవా నీటితో డోన్ చెరువులు నింపుతాం
డోన్, సెప్టెంబర్ 25:డోన్ ప్రాంతంలోని చెరువులను నింపేందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందని, త్వరలోనే హంద్రీనీవా నీటితో చెరువులు నింపుతామని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కెఇ ప్రతాప్ స్పష్టం చేశారు. ‘ఇంటింటికీ టిడిపి’ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని కొచ్చెర్వు, చింతలపేట, గోసానిపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు చింతలపేటలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 106 చెరువులకు ప్రతిపాదనలు పంపితే మొదటి దశలో 56 చెరువులు నింపేందుకు ప్రభుత్వం సమ్మతించినట్లు వివరించారు. పత్తికొండలోని 53 చెరువులు డోన్ నియోజకవర్గంలోని వెంకటాపురం, జగదుర్తి, ఉడుములపాడు చెరువులు నింపడానికి అనుమతి లభించిందని, పనులు త్వరలోనే ప్రారంభించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు. కార్యక్రమంలో గొర్రెల సహకార సంఘం చైర్మన్ నాగేశ్వరరావుయాదవ్, మార్కెట్ యార్డు చైర్మన్ మురళీకృష్ణగౌడ్, ఎంపిపి టిఇ లక్ష్మిదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్నగౌడ్ పాల్గొన్నారు.