కర్నూల్

హంద్రీనదికి నీరు వదలాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, సెప్టెంబర్ 25:హంద్రీనీవా కాలువకు తొగర్చేడు వద్ద తూము ఏర్పాటుచేసి హంద్రీనదికి నీరు వదలాలని రైతు సంఘం నాయకులు డిమాం డ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో ఎస్‌ఇ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి టి.రమేష్‌కుమార్, రైతు సంఘం పాణ్యం డివిజన్ కార్యదర్శి సోమన్న మాట్లాడుతూ కల్లూరు మం డలానికి చెందిన రైతులు గత రెండు రోజుల నుంచి మండలంలోని ఆయా గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించి సోమవారం ఎస్‌ఇ కార్యాలయాన్ని ముట్టడించారన్నారు. హంద్రీనీవా కాలువ నీరు హంద్రీనదికి వదిలితే దిగువ ప్రాంతాల ప్రజలకు తాగు, సాగునీరు పుష్కలంగా లభిస్తుందన్నారు. గత కొనే్నళ్లుగా హంద్రీనదికి నీరు వదలాలని పలుమార్లు ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి హంద్రీనీవా కాలువకు తూము ఏర్పాటు చేసి తక్షణమే హంద్రీనదికి నీరు విడుదల చేయాలని, లేనిపక్షంలో ఏపి రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి భారీ ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఇకి వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన ఎస్‌ఇ ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్త్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు. కార్యక్రమంలో రామకృష్ణ, సూరి, ఆంజనేయులు, సోమశేఖర్, నాగమద్దయ్య, అక్బర్, తదితరులు పాల్గొన్నారు.