కర్నూల్

ప్రజాదర్బార్‌లో రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోనిటౌన్, సెప్టెంబర్ 25:ప్రజాదర్బార్‌లో ఇప్పటికి 20సార్లు తమ సమస్యపై ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవడం లేదని సోమవారం ఆదోనిలో జరిగిన ప్రజాదర్బార్‌లో ఓ రైతు కుటుంబం పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే గమనించిన టూటౌన్ పోలీసులు వారిని అడ్డుకొని పురుగు మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి... హొళగుంద మండలం ఇంగదహాల్ గ్రామానికి చెందిన దస్తగిరమ్మ, ఆమె భర్త కాశీం, బంధువులు దస్తగిరి నబీరసూళ్లు పురుగుల మందు డబ్బాతో ప్రజాదర్బార్‌కు వచ్చి ఆత్మహత్యాయత్నానికి ప్రత్నించారు. ఈవిషయం తెలుసుకున్న ఇన్‌ఛార్జి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ వారిని విచారించారు. తమకు సంబంధించిన ఆదోని మండలంలోని బలదూరు గ్రామ పరిధిలో ఉన్న 3.53 ఎకరాల భూమిని 2012లో అప్పటి తహశీల్దార్ ఇంగళదహాల్ గ్రామానికి చెందిన రైతు వెంకటరామిరెడ్డికి పాస్‌పుస్తకం ఇచ్చారని వాపోయారు. తమకు కూడా పాస్‌పుస్తకం ఉందని, రెండు పాస్‌పుస్తకాలు ఎలా ఇస్తారని, తాము న్యాయం కోసం గత ఐదు సంవత్సరాలగా కర్నూలు కలెక్టర్ కార్యాలయం చుట్టూ, కర్నూలు ప్రజాదర్బార్‌లో ఫిర్యాదులు చేశామని, అయిన ఎవరూ పట్టించుకోలేదని, 20సార్లు ఫిర్యాదు చేసినా న్యాయం చేయకపోవడంతోనే తాము ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తెచ్చుకున్నట్లు వాపోయారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీనిపై సమగ్రంగా విచారించి చర్యలు తీసుకోవాలని ఇన్‌ఛార్జి కలెక్టర్ ఆదోని ఆర్డీఓ ఓబులేసు ఆదేశించారు.
జూపాడుబంగ్లా ఎత్తిపోతల ద్వారా నీరు విడుదల
జూపాడుబంగ్లా, సెప్టెంబర్ 25 : మండల పరిధిలోని తాటిపాడు గ్రామ సమీపంలో జూపాడుబంగ్లా ఫేజ్-1, ఫేజ్-2 లిఫ్టు ఇరిగేషన్‌ను సోమవారం నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి స్విచ్ ఆన్‌చేసి ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు విడుదల చేశారు. మండలంలోని పారుమంచాల, తరిగోపుల, లింగాపురం, 80.బన్నూరు, తంగెడంచె గ్రామాల పొలాల రైతులకు నీరు సరఫరా అవుతుంది. ఈ ఎత్తిపోతల పథకానికి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ. 80 కోట్ల నిధులను విడుదల చేయగా 2009 ఫిబ్రవరి 14వ తేదీ అప్పటి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ పథకం ద్వారా శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి 120 క్యుసెక్యుల నీరు 5 పంపుల ద్వారా సరఫరా అవుతుంది. ఫేజ్-1 ఎత్తిపోతల పథకం కింద 4,550 ఎకరాలు, ఫేజ్-2కింద 2,750 ఎకరాల భూములకు నీరు అందుతోంది. ఈ సందర్భంగా మాండ్ర మాట్లాడుతూ బీడు భూములకు సాగునీరు, గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు, నిరుపేదలకు ఇళ్ల మంజూరు, రేషన్‌కార్డులు, పింఛన్లు వంటి వౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సిఎం చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు మోహన్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, కృష్ణయ్య యాదవ్, మంజూల, బాలమద్దిలేటి, తదితరులు పాల్గొన్నారు.