కర్నూల్

స్కందమాతగా దర్శనమిచిన భ్రమరాంబిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం, సెప్టెంబర్ 25 : శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రీ భ్రమరాంబాదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగం గా ఐదవ రోజు స్కందమాతగా శ్రీశైల భ్రమరాంబ దేవి భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చక వేదపండితులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారికి శ్రీ చక్రార్చన, నవవరనార్చనలు, స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపములు, పారాయణలను ఆలయ అర్చక వేదపండితులు శాస్రోక్తంగా నిర్వహించారు. సాయంకాల పూజల్లో భాగంగా జపములు, అనుష్టానములు, నవవరణార్చన, కుంకుమార్చన, చండీహోమం, రుద్రహోమం, అమ్మవారికి రాత్రి సుభాషిని పూజ, కాళరాత్రి పూజలను వేదపండితులు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. నవదుర్గ అలంకరణల్లో భాగం గా 5వ రోజు శ్రీ భ్రమరాంబాదేవి స్కందమాత అలకరణలో దర్శనమిచ్చారు. అదేవిధంగా స్వామి అమ్మవార్లు శేష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్కందమాత రూపంలో అలంకరింపచేసిన అమ్మవారిని అక్క మహాదేవి అలంకరణ మండపంలో ఆలయ అర్చక వేదపండితులు ప్రత్యేకంగా పూజలు జరిపించారు. నవదుర్గ రూపాల్లో ఐదవ రూపమైన స్కందమా త చతుర్భుజాలను కలిగి ఉండి ఒక చేతిలో స్కంధుణ్ణి పట్టుకొని ఉండి, మిగిలిన చేతుల్లో పద్మాలను, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. ఈ దేవి ఒడిలో బాలుని రూపంలో కుమారస్వామి కూర్చొని ఉంటారు. స్కంద దేవుని జనని కావడం వల్ల ఈ దుర్గ స్వరూపాన్ని స్కందమాతగా పిలువబడుతుంది. స్కందమాతను ఉపాసించడం వల్ల స్కందదేవుని ఉపాసన ఫలి తం కూడా లభిస్తుందనే చెబుతారు. ఈ దేవిని ఆరాధించడం వలన సకల కోర్కెలు నెరవేరడమేకాకుండ శాంతి సౌఖ్యాలు చేకూరుతాయి. ఈ రకంగా అలంకరించిన స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చక వేదపండితులు మరోమారు మహా మంగళహారతులు ఇచ్చి వేదమంత్రోచ్ఛరణల నడుమ, మంగళ వాయిద్యా ల నడుమ అలంకరణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీశైలంలో సాయంత్రం వర్షం కురుస్తుండడంతో గ్రామోత్సవం కార్యక్రమం రద్దు చేశారు. కార్యక్రమంలో ఇఓ నారాయణ భరత్‌గుప్తా, ఆలయ అధికారులు, అర్చక వేదపండితులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.