కర్నూల్

కౌలురైతుల కుటుంబాల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, అక్టోబర్ 13: అడవి పందుల నుంచి తమ పంటలు కాపాడుకుందామని భూమిని కౌలుకు తీసుకుని పంటలు వేసిని ముగ్గురు కౌలు రైతుల కుటుంబాల్లో విషాధం నింపింది. అడవి పందుల కోసం తీసిన విద్యుత్‌తీగలు ఆ కుటుంబాల్లో ముగ్గురిని బలీ తీసుకోగా మరో ఇద్దరు తీవ్రగాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని మిక్కినేనిపల్లె గ్రామానికి చెందిన ఉప్పరి ఈశ్వరయ్య, ఉప్పరి లక్ష్మన్న, షేక్ షాకీర్ అనే ముగ్గురు రైతులు అదే గ్రామానికి చెందిన వారి భూములను కౌలుకు తీసుకొని సీడుపత్తి సాగుచేశారు. అడవి పందులనుండి పంటను కాపాడుకొనేందుకు రోజూ కష్టాలు పడుతూనే ఉండేవారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పంటల రక్షణార్థం పంటల చుట్టూ విద్యుత్ తీగలను అమర్చి రైతులు ఇంటికి వెళ్లిపోయారు. అనంతరం శుక్రవారం ఉదయం రోజువారిగా రైతులు ఉప్పరి లక్ష్మన్న, ఉప్పరి ఈశ్వరయ్య, షేక్ షాకీర్ కుటుంబ సభ్యులు తమ పొలంలో పనికి వెళ్లారు. అయితే గురువారం సాయంత్రం పంటలకు అమర్చిన విద్యుత్ తీగలను తొలగించడంలో మరిచిపోయారు. కుటుంబ సభ్యులు పొలం పనిచేసేందుకు కిందకు చూసుకోకుండా పొలంలోకి వెళ్తుంగా అప్పటకీ సరఫరా అవుతున్న విద్యుత్ తీగలను తొక్కడంతో రైతు షేక్ షాకీర్(35), రైతు ఈశ్వరయ్య కొడుకు సుధాకర్(20), రైతు లక్ష్మన్న కూతురు ప్రవళ్లిక(20)లు విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందగా మరో ఇద్దరు రక్షిత, మద్దమ్మలు తీవ్రంగా గాయపడ్డారు. గుర్తించిన కుటుంబ సభ్యులు విద్యుత్ తీగలను తొలగించి తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం వెంటనే నంద్యాల ఆసుపత్రికి తరలించారు. విద్యుత్‌షాక్‌తో ముగ్గురు మృతి చెందడంతో ఆ కుటుంబాల్లో, బంధువుల ఇళ్లల్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఆ గ్రామం మొత్తం శోకసముద్రంలో మునిగిపోయింది. మృతుల ఇళ్లల్లో ఆర్థనాదాలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న తహశీల్దార్ వెంకటేశ్వర్లు, సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐ విజయభాస్కర్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని అక్కడికి చేరుకొని మృతికి గల కారణాలను గ్రామస్థుల ద్వారా తెలుసుకున్నారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం కోవెలకుంట్ల ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
నీటమునిగిన పంటలు
పత్తికొండ, అక్టోబర్ 13: వేసిన పంటలు చేతికి వచ్చిన సమయంలోభారీ వర్షాలతో పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయాలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు నీటిలో మునిగి పోవటంతోతమను ఆదుకునే వారి కోసం రైతులు ఎదురు చూశారు. భారీ వర్షాల కారణంగా మండలంలో రైతులు సాగుచేసిన పత్తి, వేరుశెనగ, ఉల్లి, టమోటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో పెట్టుబడులు కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీ పరివాహక ప్రాంతమైన బురుజుల, హోసూరు, చిన్నహూల్తి,పెద్దహుల్తి, నలకదొడ్డి, మండగిరి గ్రామాలతోపాటు కోతిరాళ్ళ, కనకదినె్నగ్రామాల్లోని పంటల భూముల్లోకి వరద నీరు చేరటంతో పంటలు నీటిలో మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎడతెరిపి లేని వానలతో మండలంలోని వందలాది మట్టిమిద్దెలు పడిపోయాయని, ఈమేరకు రెవెన్యూ అధికారులు వివరాలు సేకరిస్తున్నారని తహశీల్దార్ రమణరావు తెలిపారు. నీట మునిగిన పంటలు రైతుల వివరాలను వ్యవసాయ అధికారులను సర్వేలు నిర్వహిస్తున్నారని, పూర్తి వివరాలు అందాల్సి ఉందని మండల వ్యవసాయ అధికారి కిశోర్ అన్నారు. ప్రభుత్వం పంటలు దెబ్బతిన్న తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
నిండుకుండలా తెలుగుగంగ
మహానంది : వెలుగోడు నుండి తమిళనాడుకు వెళ్లే తెలుగుగంగ ప్రధాన కాల్వ నిండు కుండలా ప్రవహిస్తుంది. వర్షాలు బాగా కురువడంతో గత వారం రోజులుగా నీటి ఉద్ధృతి అధికంగా కనిపించింది. నిండు కుండలా ప్రవహిస్తున్న ఈ నీరు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, చిత్తూరులోని చెరువులు నింపుతూ తమిళనాడుకు వెళ్తాయి. ఈ జలకళను చూస్తూ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రైతులకు బోర్లలో నీరు పుష్కలంగా చేరడంతో రైతులు ఆనందంతో ఉన్నారు.
పొంగిన పాలేరు వాగు...
మండలంలోని మహానంది సమీపంలో ఉన్న పాలేరు వాగు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఉదృతంగా ప్రవహించింది. మహానంది నుండి బోయలకుంట్ల వెళ్లే దారిలో ఈ కాల్వకు వర్షాలు అధికంగా కురియడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రాజకీయ నాయకులు, ఉన్నతాదికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉన్న ఈ వాగు లో లెవెల్ బ్రిడ్జి ఉండడంతో వాహనదారుల అవస్థలు వర్ణణాతీతం. సుదూర ప్రాంతాల నుండి వచ్చే ఈ వాహనదారులు 2 కి.మీ.లు ప్రయాణిస్తే మహానందికి చేరుకోవచ్చు. ఈ వాగు పొంగితే 50 కి.మీ.లుప్రయాణించాల్సి ఉంటుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
హంద్రీకి చేరిన గాజులదినె్న ప్రాజెక్టు నీరు
కల్లూరు : గాజులదినె్న ప్రాజెక్టు నుండి నాలుగు గేట్లు ఎత్తి నీటిని హంద్రీ నదీకి విడుదల చేశారు. ఈనీరు శుక్రవారం తెల్లవారు జామున్న మండల పరిధిలోని రేమడూరు, పుసులూరు, బొల్లవరం, నాయకల్లు, బస్తిపాడు, చిన్నటేకూరు, పెద్దటేకూరు, దొడ్డిపాడు, దూపాడు, లక్ష్మిపురం, అశ్వాత్తాపురం, పందిపాడు గ్రామాల పరిదిని గాజుల దినె్నప్రాజెక్టునీరు భారీగా పరుగులు తీసింది. ఈ నీటి ఉద్ధృతికి హంద్రీ నదీలోని కంప్పచెట్లు, ఒడ్డుకున్న పెద్ద చెట్లు తట్టుకోలేక వేర్లతోపాటు ఊడి కొట్టుకుపోయాయి. ఆయా గ్రామాల్లో హంద్రీ నదిలోకి ప్రజలు దిగే ప్రాంతాల్లో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది గస్తీలు కాశారు. దీంతో నీరు అధికమైనా ఎలాంటి ప్రాణహాని మండంలో చోటు చేసుకోలేదు. ఈనీరు మండలంలో మూడు రోజుల పాటు పారే అవకాశం ఉందని, పెద్దలు, పిల్లలు హంద్రీనదీ పరిసర ప్రాంతాలోకి వెళ్లకూడదని ఆయా గ్రామాల్లో దండోరాలు వేసి హెచ్చరికలు జారీచేశారు.
వేదావతికి కొనసాగుతున్న వరద ఉద్ధృతి
హొళగుంద : అనంతపురం, గుత్తి, గుంతకల్లులో కురిసన భారీ వర్షానికి శుక్రవారం రెండవ రోజు కూడా మార్లమడికి వద్ద ప్రవహించే వేదావతి నది వరద నీటితోప్రమాదస్థాయిలో ప్రవహించింది. నదిలో దాదాపు 15 అడుగుల మేరా వరద నీరు పొంగి ప్రవహిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. మూడేళ్ళ నుంచి నదిలో భారీ స్థాయిలో వరద నీటిని చూడలేదని, ఈసంవత్సరం ప్రమాద స్థాయిలో వరద నీరు ఉద్ధృత్తంగా ప్రవహించడం వల్ల రాత్రి నీటి పరవళ్ళ శబ్దం అధికంగా వినిపించిందన్నారు. వరద నీటివల్ల ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాలకు రెండు రోజుల నుంచి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ప్రయాణికులు మార్లమడికి బీరప్ప గుడి కట్టపై సేద తీరారు. హొళగుందలో మరి కొందరికి సాయిబన్నదర్గాలో భోజనం వసతి సదుపాయాన్ని కల్పించారు. మండలంలో 30.4 మి.మీ వర్షం కురిసిందని తహశీల్దార్ సతీష్ తెలిపారు. నదిలోకి ఎవరు వెళ్లకుండా ఎస్‌ఐ మారుతి, కానిస్టేబుళ్ళు సుధాకర్, నారాయణ, తిప్పన్న, పగలు రాత్రి పోలీసు బందోబస్తు నిర్వహించారు. హెబ్బటం పెద్దవంక, తెల్లవంకలో వరదనీరు పొంగి ప్రవహించడం వల్ల ఆదోని నుంచి హొళగుందకు వచ్చే బస్సులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. వేదావతి నది, హెబ్బటం, పెద్దవంక, తెల్లవంకపై బిడ్జ్రిలను ఎత్తుగా నిర్మించాలని జిల్లా ఉన్నత అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మండల ప్రజలు విజ్ఞప్తి చేశారు.

హంద్రీనీవాకు నీరు విడుదల
నందికొట్కూరు, అక్టోబర్ 13: మండలంలోని మల్యాల హంద్రినీవా మొదటి ఎత్తిపోతల పథకం నుంచి శుక్రవారం నాలుగు పంపుల ద్వారా నీరు విడుదల చేశారు. భారీ వర్షాల కారణంగా తాత్కాలికంగా నీటి విడుదలను బంద్ చేసిన అధికారులు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కుల చొప్పన 1400 క్యూసెక్కుల కృష్ణా జలాలను విడుదల చేశారు.

లంచం కేసులో విఆర్‌ఓకు జైలు శిక్ష
* కర్నూలు ఎసిబి డిఎస్పీ జయరామరాజు
కర్నూలు, అక్టోబర్ 13: పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చే విషయంలో రూ.6వేలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు పట్టుబడ్డ కేసులో హరివరం గ్రామ రెవెన్యూ అధికారి తలారి సుబ్బారాయుడుకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ ఎసిబి కేసుల ప్రత్యేక జడ్జి సుధాకర్ తీరునిచ్చారని కర్నూలు ఎసిబి డిఎస్పీ సి.జయరామరాజు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. బనగానపల్లె మండలం వీరాపారం గ్రామానికి చెందిన శ్రీదేవికి చెందిన 20 సెంట్ల భూమికి పట్టదారు పాసు పుస్తకం, ఆస్తి హక్కు పత్రాలు ఇవ్వడానికి ముద్దాయి హరివరం గ్రామ విఆర్‌ఓ సుబ్బరాయుడు రూ.6వేలు లంచం డిమాండ్ చేయగా, ఆమె ఎసిబి అధికారులను ఆశ్రయించగా ఎసిబి ఆమె ఫిర్యాదను స్వీకరించి ఆమె ముద్దాయికి లంచం ఉయ్యాలవాడ తహశీల్దార్ ఆఫీసులో 2014 అక్టోబర్ 30వ తేదీన ఇస్తుండగా వల పన్ని పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్షతోపాటు జరిమానా విధినట్లు ఆయన తెలిపారు.

మూడేళ్లుగా పని చేయని మంచి నీటి పథకం!
కోడుమూరు, అక్టోబర్ 13: మూడేళ్లుగా తమకు నీళ్లు ఇవ్వకుండా రాజకీయం చేశారు... ఓట్లు వేయలేదని గొంతులు ఎండగట్టారని ప్రజలు కోడుమూరు శాసన సభ్యుడు ఎం.మణిగాంధీకి విన్నవించారు. శుక్రవారం మండలంలోని క్రిష్ణాపురం గ్రామంలో జరిగే ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమానికి ఎమ్మెల్యే మణిగాంధీ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పరిశీలకులు అంకం విజయరావు, జిల్లా స్థాయి టిడిపి నాయకులు అయ్యప్పరెడ్డి, సత్రం రామక్రిష్ణుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా టిడిపి శ్రేణులు అంతా గ్రామంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి వచ్చి తమకు గ్రామంలోని ఒక రాజకీయ నాయకుల చేష్టల వల్ల మూడేళ్లుగా నీటి సమస్య ఏర్పడిందని ఆరోపించారు. ప్రస్తుతం జోరుగా వానలు కురుస్తున్నా తామంతా తాగు నీటి ఇబ్బందులతో అల్లాడుతున్నామని టిడిపి శ్రేణులకు విన్నవించారు. ఒక వైపు తాగు నీటి సమస్యలు, మరో వైపు రోడ్డు సమస్యలతో అష్టకష్టాలు పడుతున్నామని దీనావస్థతో ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే స్పందించి వెంటనే కోడుమూరు ఆర్‌డబ్య్లుఎస్ అధికారులకు ఫోన్లో మాట్లాడారు. ప్రజలకు రక్షిత మంచి నీటి పథకాల నుంచి అందించాల్సిన నీటిని ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. వారం రోజుల్లో ప్రజలకు తాగు నీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించడంతో ప్రజలు శాంతించారు. ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పాటు చేసిన మంచి నీటి పథకాలపై రాజకీయం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అదే విధంగా కోడుమూరు నుంచి క్రిష్ణాపురం వచ్చే రోడ్డు , ఎస్సీ కాలనీలో బోరుకు మరమ్మతులు వెంటనే చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే గ్రామంలో ఇంకా అర్హులైన వారికి పింఛన్లు రాకుంటే తమ దృష్టికి తీసుకురావాలని, ఎన్టీఆర్ గృహాలు కావాల్సిన వారికి తక్షణమే మంజూరు చేయిస్తామన్నారు. సిఎం చంద్రబాబునాయుడు గ్రామీణ స్థాయి నుంచి అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి శ్రేణులు కెయి రవికుమార్, శేషుఫణియాదవ్, యోగేశ్వరరెడ్డి, వెంకటశివుడు, ప్రహ్లాదరెడ్డి పాల్గొన్నారు.
నూతన పోలింగ్ కేంద్రా ఏర్పాటుకు
ప్రతిపాదనలు సిద్ధం చేయండి

కర్నూలు ఓల్డ్‌సిటీ, అక్టోబర్ 13: పట్టణ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో 1300 ఓటర్లు మించితే అదే ప్రాంతంలో నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాదు నుండి ఉమ్మడి రాష్ట్రాల కలెక్టర్లతో ప్రత్యేక ఓటర్ల నమోదు, ఎలక్ట్రోల్ పోల్‌పై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019 సాధారణ ఎన్నికల్లో ఇవింలతోపాటు వివి ప్యాడ్‌లు వినియోగిస్తున్నందు వల్ల పట్టణ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల సంఖ్య 1300 దాటితే ఓటర్లను విభజించి అదే పరిసర ప్రాంతాల్లో నూతన పోలింగ్ కేంద్రాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోని పోలింగ్ కేంద్రాల సరిహద్దులు, వివరాలతో కూడిన మ్యాప్‌లు, ప్రతి గృహంలోని ఓటర్ల సంఖ్య సంబంధిత అంశాలను ఈ నెల 21వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. సర్వీసు ఓటర్లకు సంబంధించి పెండింగ్ ఉన్న నియోజకవర్గా తహశీల్దార్ల నుండి సంజాయిషిలు తీసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో 539 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ సరిహద్దు, ఇంటి నెంబర్, ఓటర్ల వివరాలు, పేపర్ మ్యాప్‌లతో వివరాలు పొందుపరచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 25న నూతన పోలింగ్ కేంద్రాలకు, ఐదు పోలింగ్ కేంద్రాల పేరు మార్పుకు, 14 పోలింగ్ కేంద్రాల మార్పుకు ప్రతిపాదనలు సమర్పించాలన్నారు. ఫారమ్-6, 6ఎ, 7, 8ల ద్వారా స్వీకరించిన దరఖాస్తులను దాదాపు పూర్తి చేశామన్నారు. ఆలూరు నియోజకవర్గంలో సర్వీసు ఓటరుకు సంబంధించి వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని సంబంధిత తహశీల్దారు నుండి సంజాయిషీ తీసుకుంటామని ఎన్నికల అధికారికి తెలిపారు. జిల్లా కేంద్రం నుండి 242 ట్యాబ్‌లు అదిలాబాదు జిల్లాకు పంపామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో జెసి ప్రసన్న వెంకటేష్, డిఆర్వో గంగాధర్ గౌడ్, ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, రాంసుందర్‌రెడ్డి, ఓబులేసు, అన్ని నియోజకవర్గాల ఎలక్టరోల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.
తిమ్మప్ప కుటుంబాన్ని ఆదుకుంటాం
* మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్యే ఎస్వీ
కల్లూరు, అక్టోబర్ 13: హంద్రీ నదిలో కొట్టుకుపోయిన తిమ్మప్ప కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియా, స్థానిక ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం మంత్రి, ఎమ్మెల్యేలు సంఘట స్థలానికి వెళ్లి బాధితుని భార్య చిట్టెమ్మను పరామర్శించారు. అనంతరం అనంతరం వారు మాట్లాడుతూ నగరంలోని బుదవారిపేటలో నివాసం ఉంటున్న తిమ్మన్న హంద్రీ నదికి గాజుల దినె్న ప్రాజెక్టు నీరు వదిలిన విషయం తెలుసుకున్న అతను శుక్రవారం మధ్యాహ్నం హంద్రీ నది ఒడ్డుకు వెళ్లాడు. అయితే అతను హంద్రీ నది లోని నీటి ప్రవాహాన్ని చూస్తూండగా ప్రమాద వశాత్తు తిమ్మప్ప (29)నదిలోకి జారిపోగా నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. మృత్యునికి కుటుంబాన్ని ప్రభుత్వం తరపున అని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు. విషయం తెలిసిన పోలీసు సిబ్బంది, అగ్నిమాపక ఇబ్బంది, స్థానిక ప్రజలు అతని ఆచూకి కోసం ఎంత గాలించిన ఫలితం లేకుండ పోయిందన్నారు. వారుతెలిపారు. ఈకార్యక్రమంలో టిడిపి నాయకులు, పాల్గొన్నారు.
ఎంపి టిజి పరామర్శ
కర్నూలు: హంద్రీనదిలో గల్లంతు అయిన తిమ్మప్ప కుటుంబాన్ని పరామర్శించారు. ముంపుకు గురైన వారిని ఆదుకుంటామని అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన ప్రజలకు సూచించారు. బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానిక నేతలు అబ్బాస్, శ్రీరాములు, యునస్ తదితరులు పాల్గొన్నారు.

నగరం చుట్టూ గస్తీ ముమ్మరం
* బ్లూకోల్ట్స్ వాహనాలు ప్రారంభం * ఎస్పీ గోపినాథ్‌జెట్టి
కర్నూలు, అక్టోబర్ 13: నగరం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతకు గస్తీ పెంచామని ఎస్పీ గోపినాథ్‌జెట్టి చెప్పారు. శుక్రవారం కర్నూలు 2వ పట్టణ పోలీసుస్టేషన్‌లో బ్లూకోల్ట్స్ వాహానాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు, ఆదోని, సబ్ డివిజన్‌లలో రక్షక్ వాహానాలు, హైవే పెట్రోలింగ్ వాహనాలు, బ్లూకోల్ట్‌స టీమ్‌లు కమాండ్ కంట్రోల్ అనుసంధానంతో పని చేస్తాయన్నారు. నగరంలో అత్యవసర పరిస్థితుల సంఘటనలు జరిగినప్పుడు కాని, ప్రాపర్టికి సంబంధించిన నేరాలుగాని, మహిళలపై జరిగే నేరాలుగాని, ట్రాఫిక్ తదితర సమస్యలపై దృష్టిసారించి కమాండ్ కంట్రోల్ అనుంధానంతో త్వరగా స్పందించడానికి బ్లూకోల్ట్ వాహనాలను ప్రారంభించామన్నారు. బ్లూకోల్ట్స్ వాహానాలను ఒక్కో పోలీస్‌స్టేషన్‌కు 3 నుండి 4 వాహానాలను కేటాయించడం జరిగిందన్నారు. నగరంలో ఎక్కడైనా ఏదైనా నేరాలు, ప్రమాదాలు, జరిగినప్పుడు సమాచారం అందిన వెంటనే సంఘటన స్థలానికి బ్లూకోల్ట్స్ వాహానాలను వెళతాయన్నారు. నేరం జరిగిన ప్రాంతాల నుండి నింధితులు తప్పించుకోకుండా అక్కడి దారులను బ్లాక్ చేసి నింధితులను ఆదుపులోకి తీసుకునేవిధంగా బ్లూకేల్ట్‌స పని చేస్తాయన్నారు. లాక్డ్‌హౌస్ మానిరింగ్ సిస్టమ్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నామన్నారు. ప్రజలందరూ ఉచితంగా ఎల్‌హెచ్‌యంఎస్ యాప్‌ను ఉపయోగించుకుని లబ్ధి పొందాలన్నారు. అపార్టుమెంట్లలో సిసి కెమరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సిసి కెమెరాల పుటేజిల వలన కేసులను ఛేదించటానికి సులువుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు బాబుప్రసాద్, వినోద్‌కుమార్, సిఐలు దివాకర్‌రెడ్డి, డేగలప్రభాకర్, రామానాయుడు, నాగరాజారావు, శ్రీనివాసరావు, సుబ్రమణ్యం, ఎస్సైలు పాల్గొన్నారు.
కొత్త హోండా క్లిక్ విడుదల
కల్లూరు, అక్టోబర్ 13: నగరంలోని ఈద్గా పక్కన ఉన్న శ్రీనివాస హోండా షోరూంలో శుక్రవారం హోండా కంపెనీ ప్రవేశపెట్టిన కొత్త హోండా క్లిక్ ద్విచక్రవాహనాన్ని కంపెనీ సేల్స్ ఇన్‌చార్జి సదానంద, నెఫెల్ మహ్మద్, శ్రీవాసవి మేనేజర్ సొమిశెట్టి, సురేష్‌బాబులు విడుదల చేశారు. ఈసందర్భంగా కంపెనీ ఇన్‌చార్జి సదానంద మాట్లాడుతూ నూతన మోడల్ హోండా క్లిక్ వాహనం అతి తక్కువ ధరకు లభిస్తుందని, 102కిలోల బరువు అధిక సామర్థ్యం 110 సిసి, ఎక్కువ మైలేజి వస్తుందన్నారు. అనంతరం నూతనంగా ప్రవేశపెట్టిన వాహనాలను నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిబ్బంది, సిడబ్ల్యూఓ హోండా కంపెనీ వారు పాల్గొన్నారు.

బావిలో పడి మహిళ మృతి
వెలుగోడు, అక్టోబర్ 13: మండలపరిధిలోని అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన మద్దెల దేవి(42) బావిలో పడి మృతి చెందింది. సోమవారం ఇంట్లో నుండి వెళ్లిన మద్దెల దేవి శుక్రవారం గోదాముల సమీపంలో వున్న వ్యవసాయ బావిలో మృతదేహంగా కనిపించింది. మహిళ దేహంపై దుస్తులు లేక పోవడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు పరిగణిస్తున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తిపై దాడి..కేసు నమోదు
బండిఆత్మకూరు, అక్టోబర్ 13: మండలంలోని నారాయణాపురం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి షేక్ దుబ్బమాబుసాపై అదే గ్రామానికి చెందిన డీలర్ మాబూ, శివశంకర్‌రెడ్డితోపాటు మరికొందరు ఇంటికి పిలిపించి దాడికి పాల్పడినట్లు ఎస్‌ఐ విష్ణునారాయణ తెలిపారు. గత నెల 27వ తేదీన స్థానిక ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యాక్రమంలో భాగంగా నారాయణాపురం గ్రామంలో పర్యటిస్తుండగా దుబ్బమాబూసాతోపాటు మరికొందరు ఎమ్మెల్యేకు నారాయణాపురం గ్రామంలోని ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద టర్నింగ్ ఉండడంతో ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న డీలర్ మాబూసా వ్యాపారం చేసుకొనే బంకుతోపాటు డ్రైనేజిని ఆక్రమించి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ స్థానిక సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. సర్పంచ్ పంచాయతీ కార్యదర్శి మోదీ మొహిద్దీన్ సదరు డీలరు మాబూసాకు నోటీసులు ఇచ్చారు. దీన్ని మనసులో పెట్టుకొని శివశంకర్‌రెడ్డి, డీలరు మాబుసాలు దుబ్బమాబుసాను ఇంటికి పిలిపించి దాడికి పాల్పడినట్లు దుబ్బమాబూసా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
మట్కాబీటర్ అరెస్టు
వెలుగోడు, అక్టోబర్ 13: వెలుగోడులోని రాజానగర్‌కు చెందిన మట్కాబీటర్ షేక్ వలిబాషాను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సమాచారం మేరకు వలిబాషా ఇంటిపై దాడి చేసిన పోలీసులు అతడి నుండి రూ.3,200 నగదు, మట్కారాసే పుస్తకం, మూడు సెల్‌ఫోన్లు, మూడు బ్యాంకు పాసుపుస్తకాలు, ఒక చెక్‌బుక్ ను స్వాధీనం చేసుకున్నారు. వలిబాషా నందికొట్కూరుకు చెందిన లాడెన్ అలియాస్ నాయక్‌ను, చిన్నదేవళాపురంకు చెందిన వెంకటేశ్వర్లును ఏజెంట్లుగా పెట్టుకుని మట్కా రాస్తున్నాడని పోలీసులు తెలిపారు. వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.
పిడుగుపాటుకు మహిళ మృతి
కొలిమిగుండ్ల, అక్టోబర్ 13: మండలంలోని అబ్దుల్లాపురం గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం పిడుగు పడి నరసింహారెడ్డి భార్య లక్ష్మిదేవి (50) మృతి చెందింది. లక్ష్మిదేవి, ఆమె కుమారుడు హరినాథరెడ్డి గ్రామ సమీపంలోని దానిమ్మతోట నుండి గ్రామానికి వస్తుండగా పెద్ద ఎత్తున మెరుపులతో కూడిన శబ్దం వచ్చింది. ఈ శబ్దానికి వెనుకభాగంలో వస్తున్న లక్ష్మిదేవి అక్కడికక్కడే కుప్పకూలింది. విషయాన్ని గమనించిన ఆమె కుమారుడు హరినాథరెడ్డి వెనక్కి తిరిగి చూడగా తమ తల్లి విలవిలలాడుతూ మృతి చెందడంతో విషయాన్ని గ్రామస్థులకు తెలియజేయగా బంధువులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని విలపించారు. విషయం తెలిసిన వెంటనే తహశీల్దార్ ఫకూర్ అహ్మద్, విఆర్‌ఓలు వెంకటేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య, పోలీసు సిబ్బంది అబ్దుల్లాపురానికి చేరుకొని ఘటన వివరాలు తెలుసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నంద్యాల ఆసుపత్రిలో నిండుగర్భిణి మృతి
నంద్యాలటౌన్, అక్టోబర్ 13: నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం ఓ నిండుగర్భిణి వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే రుద్రవరం మండలం పెద్దకంబలూరు గ్రామానికి చెందిన మధుసూదన భార్య ప్రసన్న గురువారం రాత్రి నొప్పులు రావడంతో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆసుపత్రిలోని కాన్పుల వార్డుకు తరలించారు. శుక్రవారం ఉదయం వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేసి పాపను బయటకు తీశారు. అయితే ఆపరేషన్ చేసే సమయంలో అధిక రక్తస్రావం అయినట్లు బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యమే తన భార్య మృతికి కారణమంటూ బంధువులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేశారు. విషయం తెలిసిన కో ఆర్డినేటర్ రామకృష్ణ అక్కడికి చేరుకుని ఆమెకు ముందే ఆరోగ్యం సరిగ్గా లేదని అందువల్లే మృతి చెందిందని వైద్యుల నిర్లక్ష్యం కాదని తెలిపారు. అనంతరం ప్రసన్న బంధువులకు సర్దిచెప్పడంతో వారు వెళ్లిపోయారు. ఓ నిండుగర్భిణీ బిడ్డను వదలి అనంతలోకాలకు వెళ్లిపోయిందని బంధువులు కంటతడిపెట్టారు.