కర్నూల్

విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని పెంపొందించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, నవంబర్ 11: బనగానపల్లెలో రాష్టస్థ్రాయి హ్యాండ్‌బాల్ పోటీలు నిర్వహించడం ఆనందంగా వుందని, రాబోయే కాలంలో అవకాశం వస్తే జాతీయ స్థాయి క్రీడలను కూడా తాము నిర్వహిస్తామని ఎమ్మెల్యే బిసి జనార్థనరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని నెహ్రూ ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల మైదానంలో రాష్టస్థ్రాయి అండర్ 14 బాలుర, బాలికల హ్యాండ్‌బాల్ పోటీలను ఎమ్మెల్యే పాఠశాల కరస్పాండెంట్ కోడూరు హరినాథరెడ్డి, జిల్లా స్కూల్‌గేమ్స్ కార్యదర్శి అబ్రహం, ఇన్‌చార్జి ఎంఇఓ గురుస్వామి తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన అనంతరం ప్రారంభించారు. 13 జిల్లాల క్రీడాకారుల మార్చ్ఫాస్ట్ ద్వారా చేసిన గౌరవందనాన్ని స్వీకరించారు. విద్యార్థుల పరిచయ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చదువులతో పాటు క్రీడలు, సాంస్కృతి కార్యక్రమాల్లో కూడా రాణించాలన్నారు. ఇప్పుడు జరుగుతున్న క్రీడల్లో జిల్లాకు చెందిన బాలబాలికలు చక్కగా రాణించా జాతీయ స్థాయిల గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. వ్యాయామ ఉపాధ్యాయులు న్యాయబద్దంగా వ్యవహరించి క్రీడలను నిర్వహించాలన్నారు. పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ రాష్టస్థ్రాయి హ్యాండ్‌బాల్ పోటీలు బనగానపల్లెలో అందునా తమ పాఠశాలలో నిర్వహించడం ఆనందంగా వుందని అన్నారు. ఇది తమకు ఎంతోకాలంగా వున్న కోరిక ఇప్పుడు తీరిందన్నారు. విద్యార్థులు గెలుపోటములను క్రీడాస్పూర్తితో స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్‌ఐ రాకేశ్, పాఠశాల హెచ్‌ఎం కోడూరు కమల్‌తేజారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కోడూరు రవితేజారెడ్డి, క్రీడల పరిశీలకుడు భాస్కర్‌రెడ్డి, పిడిలు డిఆర్ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీపతి చంద్రావతి, మోహన్‌రెడ్డి, భుజంగరావు, నరసింహ, షేక్షావలి, ప్రభాకర్, 13 జిల్లాలకు చెందిన అండర్ 14 పోటీల్లో పాల్గొనే 500 మంది విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు, స్థానికులు పాల్గొన్నారు.
అగ్రిలోల్డ్ డిపాజిటర్ల నమోదుకు చివరి తేది 20
* ఎస్పీ గోపీనాథ్‌జెట్టి
కర్నూలు, నవంబర్ 11: అగ్రిగోల్డ్ డిపాజిటర్ల నమోదుకై జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీసుస్టేషన్లలో 23 కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ గోపీనాథ్‌జెట్టి ఒక ప్రకటలో తెలిపారు. ఇంకా నమోదు చేసుకోని వారు ఉంటే ఈ నెల 20వ తేదీలోపు నమోదు చేసుకోవాలన్నారు. ఇంకా నమోదు చేసుకోని డిపాజిట్ దారులు, తమ ఓరిజనల్ డిపాజిట్ బాండ్లు, రశీదులు, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌బుక్‌లతోపాటు అదనంగా ఒకసెట్ జిరాక్స్ కాపీలు వెంట తీసుకొచ్చి నమోదు చేయించుకొని రసీదు పొందాలని ఎస్పీ తెలిపారు. ఈ ప్రక్రియకు ఈ నెల 20వ తేదీ చివరి రోజు అని, నమోదు చేసుకొని వారు నమోదు చేసుకోవాలని విజప్తి చేశారు.
పంటలు కాల్చిన వారు ఎంతటివారైనా వదలం..
* మాజీ కేంద్ర మంత్రి కోట్ల
దేవనకొండ, నవంబర్ 11: రైతులు పండించిన పంటలకు నిప్పుపెట్టి కాల్చడం పిరికివాళ్ల చర్య అని, దానికి బాధ్యులైన ఎంతటి వారినైన వదలమని మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని బేతపల్లిగ్రామానికి వచ్చి వేరుశెనగ పంటల వాములు దగ్ధమైన పొలాల్లోకి వెళ్లి పరిశీలించి బాధితులను పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన గ్రామస్థులతో మాట్లాడుతూ వేరుశెనగ పంట వావాముల విషయంపై పోలీసు, రెవెన్యూ అధికారులకు తెలిపామని త్వరలో వాటిని కల్చిన నిందితులను వెలుగులోకి తీసుకొని వస్తున్నట్లు స్పష్టం చేశారు. బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తన వంతుగా సహాయం చేస్తామని కోట్ల బరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుండి సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.వచ్చే ఖరీఫ్ సీజన్‌లో బాధిత రైతులకు ఎరువులు, విత్తనాలను అందించేందుకు తన వంతు సహాయం చేస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అవి కేవలం పుకార్లు మాత్రమేనని కోట్ల స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి, వేమనాథ్‌రెడ్డి, బొజ్జప్పనాయుడు, పురుషోత్తంగౌడ్, చెన్నకేశవులు, లక్ష్మన్న, గోవిందరాజులు, హనుమంతు పాల్గొన్నారు.