కర్నూల్

అహోబిలేసునికి ప్రత్యేక పూజలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, నవంబర్ 11: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. దిగువ అహోబిలం ఆలయంలో కొలువు దీరిన శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లి, గోదాదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే ఎగువ అహోబిలం బాలాలయంలో కొలువైన శ్రీ జ్వాలానరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పూజలు చేశారు. సెలవు దినం ఆపై శనివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నల్లమల అరణ్యంలో వెలసిన నవనారసింహులను దర్శించుకున్నారు. కార్తీకమాసం కావడంతో మహిళలు ధ్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు.
ముచ్చుమర్రి నుంచి తెలుగుగంగకు
నీటి మళ్లింపు సాధ్యమా..
* వైకాపా రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌కుమార్‌రెడ్డి
కర్నూలుసిటీ, నవంబర్ 11:అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సిఎం చంద్రబాబు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి తెలుగుగంగ, జిఎన్‌ఎస్‌ఎస్(గాలేరు నగరి సుజల స్రవంతి) లకు నీటిని మళ్లించినట్లు ప్రకటించారని, అది ఏ విధంగా సాధ్యమవుతుం దో చెప్పాలని వైకాపా రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల భరత్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నగరంలోని వైకాపా కార్యాలయంలో శనివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. వాస్తవానికి ముచ్చుమర్రి నుంచి కెసి కెనాల్‌కు, హంద్రీనీవాకు నీటిని తరలించడానికి వీలువుతుందని, ఆ విషయం రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబుకు తెలియకపోవచ్చు, కానీ జిల్లా నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆర్డీఎస్ వివాదాన్ని లేవనెత్తి, కెసి కాలువకు నీళ్లు రాకుండా మధ్యలో అడ్డుకట్ట వేస్తుంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కెసి కెనాల్ నిర్వీర్యం కాకూడనే ఉద్దేశ్యంతో ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి 80శాతం పూర్తి చేశారని గుర్తుచేశారు. ఇక రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగుచేసిన జిల్లా కర్నూలు అని, కావున పత్తికి గిట్టుబాటు ధర కల్పించేందుకు పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వైకాపా రైతు విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, యూత్ నాయకులు శ్రీ్ధర్ రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి పాల్గొన్నారు.