కర్నూల్

విద్యారంగంలో సంస్కరణలకు పునాది వేసిన వౌలానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 11: భారత స్వాతంత్య్రా అనంతరం విద్యారంగాన్ని పటిష్టం చేసేందుకు వౌలానా అబుల్ కలాం ఆజాద్ అనేక సంస్కరణలు తీసుకొచ్చి అమలు పరిచారని ఉప ముఖ్యమంత్రికెయి కృష్ణమూర్తి చెప్పారు. శనివారం స్థానిక ఉస్మానియా కళాశాల ఆవరణంలో విద్యాపితామహుడు భారత రత్న అబుల్ కలాం ఆజాత్ 129వ జయంతి రాష్టస్థ్రాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్బంగా కెయి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.43కోట్లు ఉన్న బడ్జెట్‌ను ప్రస్తుతం రూ.196కోట్లకు పెంచి అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలు ప్రవేశపెట్టి అమలు పరిచామన్నారు. వౌలానా అబుల్ కలాం జయంతిని ప్రభుత్వం జాతీయ విద్యా దినోత్సవంగా ప్రకటించిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు రాష్ట్రంలో అత్యధికంగా ముస్లిం జనాభా కల్గిన కర్నూలు జిల్లాలో రాష్టస్థ్రాయి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈమేరకు అధికారికంగా జయంతి ఉత్సవం జరుపుకోవడం జిల్లాకు దక్కిన గౌరవమన్నారు. అబుల్ కలాం 11 సంవత్సరాలు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉండి విద్యారంగంలో అనేక నూతన సంస్కరణలు ప్రవేశపెట్టడంతోపాటు, శాస్ర్తియ సాంకేతిక విద్యావిధానాన్ని పెంపొందించారన్నారు. విద్యారంగానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డును బహుకరించిందన్నారు. ఆయన గొప్ప యోదుడే కాక ఖురాన్ గ్రంధాని కూడ అనువాదం చేశారన్నారు. 1923లో అబుల్ కలాం ఆజాద్ భాతర జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికయ్యారన్నారు. ఉప్పుసత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని అప్పటి బ్రిటీష్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు జైలు శిక్షకూడా అనుభవించిన గొప్పత్యాగ శీలి అని పేర్కొన్నారు. పేద ముస్లిం ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు అదిక ప్రాదానత ఇస్తూ ముస్లిం యువతకు దుల్‌హాన్ స్కీం, దుకాణ్, మకాన్ కింద చిన్న వ్యాపారాస్తుల రుణాల మంజూరు, 72 షాదికానాలకు రూ.12కోట్లు విదుడల చేశామన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి, గృహానిర్మాణ శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ వౌలాన విద్యలో ఉన్నత శిఖరాలను అధిరోహించి విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేసిన మహానీయుని జయంతిని ప్రభుత్వ ఆధీనంలో ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఆయన ప్రతిజ్ఞ ప్రతిభ కారణంగానే స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించారన్నారు. నాణ్యమైన చదువుకోసం ప్రపంచ స్థాయిలో పోటీ పడి నూతన విద్యావిదానాన్ని తీసుకొచ్చారన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియా మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక ప్రాదాన్యత ఇస్తుందని, ప్రతి పేద మహిళ అక్షరాస్యతను పొందాలన్నారు. భవిష్యత్తులో ఉపయోగపడే చదువేనన్ని మహిళలు ఎంత వరకు చదువ గల్గితే అంత వరకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుందన్నారు. దుల్‌హాన్ స్కీం కింద గతంలో రూ.25 వేలు ఉండేదని, ప్రస్తుతం రూ.50వేల వరకు ముస్లిం యువతల వివాహా ఖర్చులు మంజూరు చూస్తోందన్నారు. కర్నూలు ఎంపి బుట్టారేణుక మాట్లాడుతూ దేశ భక్తి ఉన్న వౌలానా ఆజాద్‌ను ఆదర్శంగా చేసుకొని నడుచుకోవాలన్నారు. ఆయన జన్మదినాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎదో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి నివాళ్లు అర్పించుకోవాలన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ భారతదేశంలో మొదటి విద్యాశాఖ మంత్రిగా వౌలానా ఉండటమే కాకుండ దేశాభివృద్ధి ఎనలేని కృషి చేశారన్నారు. ముస్లిం మైనార్టీ విద్యార్థులకు రూ.285కోట్లు స్కాలర్‌షీపుల కింద ముంజూరు చేశామన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధి కోసం రూ.3కోట్లలో మిని హజ్‌హౌస్ నిర్మాణం చేపడుతుందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మైనార్టీ కార్పోరేషన్ ద్వారా రూ.153.83కోట్లతో 23,976 మంది లబ్ధిదారులకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఉపముఖ్యమంత్రి కెయి కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జీ మంత్రి కాలవ శ్రీనివాసులు దుల్‌హన్ స్కీం కింద 291 మంది మహిళలకు రూ.కోటి 45లక్షల మోగాచెక్‌ను అందజేశారు. అలాగే వివిధ పథకాల కింద 530మందికి రూ.8.26కోట్లు మెగా చెక్‌ను, 11షాదీఖానాలకు రూ.1.54కోట్లు వౌజన్, ఇమామ్‌ల కింద రూ.48లక్షలు, మెప్మాకింద 34 గ్రూపులకు రూ.1.60కోట్లు మెగా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదే విధంగా 178కుట్టు మిషన్లు అందజేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్‌ఎండి ఫరూక్, నగర ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి, కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా, ఉర్దూ అకాడవి చైర్మన్ నౌమాన్, వౌనార్టీ సంక్షేమ అధికారి మస్తాన్ వలి, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, 15సూత్రాల కమిటీ సభ్యులు పుకార్ నజీర్‌సాహెబ్, రోషన్ అలీ, జాన్ మిస్టషర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

హాకీ మన జాతీయ క్రీడ
కర్నూలు సిటీ, నవంబర్ 11: హాకీ మన జాతీయ క్రీడని రాజ్యసభ సభ్యులు టిజీ. వెంకటేష్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం స్థానిక అవుట్ డోర్ స్టేడియం నందు 8వ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలను ప్రారంభించి, 11 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారుణిలు చేసిన మార్చ్‌పాస్ట్‌ను వందనాన్ని స్వీకరించి, రాయలసీమ ఐజి ఇక్బాల్ మహమ్మద్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా టిజీ మాట్లాడుతూ హాకీ జాతీయ క్రీడని, ముఖేష్ కుమార్ హాకీ క్రీడలో మంచి ప్రతిభను కరపర్చి ఒలింపియన్‌గా నిలిచాడని, క్రీడాకారిణులు కూడా ఆయనలాగా రాణించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు క్రీడలను ప్రోత్సహిండమే కాకుండ నిదులను కూడా మంజూరు చేశారని వెల్లడించారు. అలాగే అవుట్ డోర్ స్టేడియం నందు అదనపు ఇండోర్ స్టేడియాన్ని నిర్మించామన్నారు. నగరంలో ఏ క్రీడలు జరిగిన తన వంతు సహాయాన్ని అందిస్తానన్నారు. ఐజి ఇక్బాల్ మాట్లాడుతూ రాష్ట్ర నలుమూల నుంచి విచ్చేసిన క్రీడాకారుణీలు హాకీలో రాణించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకొని రావాలన్నారు. రాష్ట్ర హాకీ జనరల్ సెక్రేటరీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎపిలో ఇన్‌ప్రాస్ట్రక్షర్ లేదన్నారు. అయితే కర్నూలు నందు హకీ అస్ట్రోటర్ప్ నిర్మిస్టే క్రీడాకారుణిలు రాణిస్తారన్నారు. రాబోయే రోజుల్లో హాకీకి మంచి రోజులు రానున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో హాకీ సంఘం జిల్లా అధ్యక్షులు చాణిక్యరాజ్, కార్యదర్శి సుధీర్, ఉపాధ్యక్షులు ప్రవీన్ రాజ్, కోశాధికారి వెంకటేశ్వర్లు, థామస్ ఫీటర్, టోర్నమెంట్ డైరెక్టర్ రవిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయానికీ తప్పని నకిలీల బెడద!
నంద్యాల, నవంబర్ 11: వ్యవసాయ రంగంలో కూడా నకిలీలు పెరిగిపోవడంతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. ముఖ్యంగా మనదేశంలో 70 శాతం జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ రంగం ఉజ్వలంగా ఉండాలంటే వరుణదేవుడు కరుణించకతప్పదు. వరుణ దేవుడు కరుణించి సాగునీటి వసతులు పుష్కలంగా ఉన్నా నకిలీల కారణంగా ప్రతి ఏడాది రైతాంగం తీవ్ర నష్టాల పాలు అవుతుంది. సన్నకారు రైతుల వార్షిక ఆదాయం వారి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకే చాలడం లేదు. దిగుబడులు వచ్చినా గిట్టుబాటు ధర లేక దళారుల ప్రమేయంతో రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. మన రాష్ట్రంలో సన్నకారు రైతు 2 నుండి 5 ఎకరాలు సాగుచేసినా దానిపై నెలసరి ఆదాయం సగటున రూ.6,400లు మాత్రమే వస్తున్నట్లు ఇటీవల ఓ సర్వేలో వెల్లడైన నిజం. ఆ మొత్తం రైతు కుటుంబం ఆరోగ్య పరిరక్షణ, వైద్య ఖర్చులకే సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫి పథకం కూడా రైతులకు ఉపశమనం కలిగించడం లేదు. రైతుల ఆదాయానికి ఖర్చుకు తేడా భారీగా ఉండడంతో రైతు ఏడాదికేడాది అప్పుల ఊబిలో కురుకుపోతున్నాడు. రాష్ట్రంలో 25 ఎకరాలు, అంతకన్న ఎక్కువ పొలం ఉన్న రైతులు వేళ్లమీద లెక్క కట్టవచ్చు. వీరి నెలసరి ఆదాయం రూ.40 వేల వరకు ఉండడంతో వీరు పెద్దగా అప్పుల పాలు అవడం లేదు. వ్యవసాయ రంగంలో నష్టాలు పెరగడంతో రైతులకు దిక్కుతోచక ఉపాధి కోసం నగరాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా రైతాంగానికి నకిలీల బెడద కారణంగా ప్రతి ఏడాది పంట నష్టాలు పెరిగిపోయి అప్పులు మిగిలి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కర్నూలు జిల్లాలో 2015-16లో 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2016-17లో 20 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రైతు ఆత్మహత్య కారణంగా ఆ కుటుంబ సభ్యులు ఉపాది మార్గం లేక రోడ్డున పడడం, లేనిపక్షంలో వారు కూడా ఆత్మహత్యలకు పూనుకోవడం వ్యవసాయ రంగాన్ని కలచివేస్తుంది. పంటల భీమాపై రైతులకు సరైన అవగాహన లేదు. వాతావరణ ఆధారిత భీమా, ప్రధానమంత్రి ఫసల్ యోజన భీమాలపై రైతుల్లో అపోహలు ఉన్నాయి. రైతుల పరిస్థితి ఇలా ఉంటే నకిలీ మాఫియా రాష్ట్రంపై పంజా విసురుతోంది. విత్తనాల్లో నకిలీలు, రసాయనిక ఎరువుల్లో నకిలీలు, క్రిమి సంహారక మందుల్లో నకిలీలు, బయో ఫెర్టిలైజర్స్‌లో కూడా నకిలీలు వెల్లువెత్తడంతో రైతు వేసిన పంట చేతికి వచ్చే వరకు భరోసా ఉండడం లేదు. నకిలీ విత్తనాలతో పంట నష్టపోయినా నష్టపరిహారం ఇచ్చే దిక్కులేదు. వాణిజ్యపంటలైన పత్తి, మిరప సాగులో రైతులు భారీ ఎత్తున క్రిమిసంహారక మందులు వాడుతుంటారు. ఈ మందుల్లో కూడా నకిలీలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వారంలోనే నంద్యాలలో ప్రముఖ కంపెనీ ఉత్పత్తి చేసే క్రిమి సంహారక మందు బేయర్ బ్రాండ్‌పై నకిలీ మందు ఉత్పత్తి చేసి రాష్ట్రంలో చాలా చోట్ల అమ్ముకున్నట్లు తెలిసింది. ఈ మందులు వాడడం వల్ల పంటలకు వచ్చిన చీడపీడలు తగ్గకపోగా మరింత విజృంభించి పంట పూర్తిస్థాయిలో నాశనం అయ్యే పరిస్థితి నెలకొంది. అదేవిధంగా రసాయనిక ఎరువుల్లోను, బయోఫెర్టిలైజర్స్‌లోను నకిలీలు రాజ్యమేలుతున్నాయి.నకిలీలను అరికట్టేందుకు ప్రభుత్వం సరైన యంత్రాంగం ఏర్పాటు చేయలేదన్న విమర్శలు వస్తున్నాయి. మొక్కుబడి చెల్లించుకున్న విధంగా వారానికి ఒకసారి అక్కడక్కడ దాడులు నిర్వహించడం తప్ప నకిలీ మాఫియాపై ఉక్కుపాదం మోపినప్పుడే అవి అదుపులోకి వస్తాయి, నకిలీల కారణంగానే రైతులు పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి, వ్యవసాయ రంగంలో నకిలీలు విస్తరించకుండ కట్టుదిట్టమైన రీతిలో చట్టాలు రూపొందించి, గట్టి అధికారులను నియమిస్తే తప్ప నకిలీలు అదుపు కావని అంటున్నారు. మొత్తం మీద వ్యవసాయ రంగం కుదేలవడానికి ఒక వైపు నకిలీలు, మరోవైపు పండిన పంటను అమ్ముకోవడంలో దళారీల ప్రమేయం పెరగడంతో అటు రైతు, ఇటు వినియోగదారుడు నష్టపోతున్నాడే తప్ప వారు బాగుపడింది లేదు. సన్న, మధ్యకారు రైతులు వ్యవసాయ రంగాన్ని విడనాడి ఉపాధి అవకాశాలను వెతుక్కొనేందుకు నగరాలకు వలసబాట పట్టకుండ నివారించాలంటే వ్యవసాయ రంగంలో నకిలీలను పూర్తిస్థాయిలో నివారించినప్పుడే సాధ్యమవుతుంది.

శ్రీశైలంలో ప్రముఖులు
శ్రీశైలం, నవంబర్ 11: శ్రీశైలం మహా పుణ్యక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను అటవీశాఖ మంత్రి సిద్ధారాఘవరావు శనివారం సాయంత్ర స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు సాదరస్వాగతం పలికారు. కాగా శనివారం ఉదయం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని హైకోర్టు జడ్జి అమరనాధ గౌడు, ఇన్‌కంట్యాక్స్ ట్రిబ్యునల్ బెంగళూరు మినిస్టరీ లా అండ్ జస్టీస్ రమణారావు వేర్వేరు సమయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనాది ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అమ్మవారి ఆశీర్వచన మండపంలో ప్రముఖులను ఆలయ అర్చక వేదపండితులు ఆశీర్వదించి స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించారు. కాగా ఆదివారం ఉదయం హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వామి అమ్మవార్లను దర్శించుకుని సేవించుకోనున్నారు.
అన్నదానానికి విరాళం
భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల నిత్యన్నదాన నిధికి ఇరువురు భక్తులు వేర్వేరు సమయాల్లో తమ విరాళాన్ని సమర్పించారు. వీరిలో గుంటూరుకు చెందిన స్వరచంద్ రూ.1,05,000లు, హైదరాబాదుకు చెందిన రామారావు రూ.1,01,116లు శనివారం అన్నదాన వితరణకు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాన్ని అన్నదాన సూపరింటెండెంట్ మల్లయ్యకు అందించారు. ఆలయ అధికారి విరాళానికి సంబంధించిన రసీదును, బాండును దాతలకు అందించి వీటిలోపాటు స్వామి అమ్మవార్ల ప్రసాదాలను ఇచ్చి దాతలను ప్రోత్సహించారు.