కర్నూల్

మీ ఆశీర్వాదంతోనే ఈస్థాయికి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, నవంబర్ 12: ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రజల, అభిమానుల, నాయకుల, కార్యకర్తల అందరి ఆశీర్వాదంతోనే ఇంత ఎత్తుకు ఎదిగామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆదివారం నియోజకవర్గంలోని ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలకు ఇచ్చిన సహకారాన్ని ఇవ్వటం వల్ల ఈ నాడు అత్యున్నత పదవులు అలంకరించామన్నారు. దేశ ఉపరాష్టప్రతి వెంకటయ్యనాయుడు తనను ఆప్యాయంగా పలుకరించి భూమా దంపతులు మంచివ మిత్రులని అన్నారు. అంతే కాకుండా ఆయన కేంద్ర ప్రభుత్వం ద్వారా పర్యాటకశాఖకు అవసరమైన నిధులు ఇచ్చేలా చూడాలంటూ ఆయా శాఖల మంత్రులకు ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు ఫోన్లో చెప్పారన్నారు. లండన్‌లో తెలుగువారు భూమా దంపతులను గుర్తుచేశారన్నారు. త్వరలో ఆ దేశ పార్లమెంట్‌లో మాట్లాడే అవకాశం వస్తుందన్నారు. ఈ అవకాశాలను మీరే కల్పించారని ఆమె అన్నారు. భూమా కుటుంబానికి అండగా నిలిచిన వారి అందరి సమస్యల పరిష్కరిస్తామన్నారు. ఎవరు అందోళన చెందాల్సిన అవంసరం లేదన్నారు. గ్రామాల్లో పేద ప్రజలకు సాయం అందించేందుకు పార్టీలకు అతీతంగా ముందుకు పోదామన్నారు. ఎప్పటి వరకు కెసికి సాగునీరు ఇస్తారో చెప్పాలని మండల టిడిపి నాయకులు మంత్రిని కోరగా కలెక్టర్‌తో మాట్లాడి చెబుతానన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి సమస్యల స్వీకరించి సి ఎం డ్యాష్ బోర్డుకు పంపాలన్నారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణానికి నిధుల కోరత ఉందని కొన్ని రోజుల పాటు ఆగాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మెన్ బి వి రామిరెడ్డి, ఆళ్లగడ్డ మండల టిడిపి అధ్యక్షులు బాచ్చాపురం శేఖర్‌రెడ్డి, శిరివెళ్ల శ్రీకాంత్‌రెడ్డి, చాగలమర్రి నరసింహారెడ్డి, రుద్రవరం సత్యనారాయణ, బాచేపల్లె శేఖర్‌రెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, ఉయ్యాలవాడ కూడాల నారాయణరెడ్డి, ఓబులంపల్లె సొసైటీ అధ్యక్షులు శివారెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రీశైలం, నవంబర్ 12: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీకమాస చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని దేశ నలుమూలల నుండి అధిక సంఖ్యలో భక్తులు శ్రీశైలం చేరుకుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సుమారు 80 వేల మందికి పైగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా. భక్తులు వేకువజామునుండే పవిత్ర పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి పాతాళగంగ వద్ద పలువురు భక్తులు కృష్ణవేణి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి ద్వీపారాధనలు చేసుకున్నారు. భక్తుల తాకిడి ఆదివారం సాయంత్రానికి ఎక్కువ కావడంతో ఆలయ ప్రధాన వీది భక్తులతో కిటకిటలాడింది. అలాగే క్యూ కాంప్లెక్స్‌లు భక్తులతో నిండిపోయాయి. క్యూ కాంప్లెక్స్‌లో ఎక్కువ సమయం వేచి వుండడం వల్ల భక్తుల సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్‌లో, క్యూలైన్లలో ఆలయ సిబ్బంది దేవస్థానం తరుపున అల్పాహారం, పాలు, మంచినీరును భక్తులకు అందించారు. అధిక సంఖ్యలో భక్తులు కళ్యాణకట్టలో తలనీలాలు
సమర్పించుకొని స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ఆలయ ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తీక ద్వీపారాధనలు నిర్వహించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆలయ అధికారులు ఆలయ వేళల్లో మార్పులు చేసి వేకువ జామునుండే భక్తులను ఆర్జిత సేవలకు దర్శనాలకు అనుమతించారు. భక్తులకు విడతల వారిగా అభిషేకాలు నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేసి అభిషేక సేవ కర్తలకు, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనం భక్తులకు, సర్వదర్శనం భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా ఎటువంటి అసౌకర్యం కలుగకుండ స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు తీసుకొనేందుకు ఈవో నారాయణ భరత్ గుప్తా కొంత మంది అధికారులకు ప్రత్యేక విధులు కేటాయించి సిబ్బందిని అప్రమత్తం చేశారు. అలాగే నాగులకట్ట వద్ద, గంగాధర మండపం వద్ద భక్తులు అధిక సంఖ్యలో ద్వీపారాధనలు చేసుకొనేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలకు 3 గంటల సమయం పట్టగా, ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పట్టింది. నేడు కార్తీక సోమవారం కావడంతో శ్రీశైలం క్షేత్రానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం దేవస్థానం వారు కళ నీరాజనం కార్యక్రమంలో భాగంగా సీతంపేట గిరిజన కళాబృందం వారిచే గిరిజన మయూర, తావర నృత్యాలు భక్తులను ఎంతో ఆకట్టుకున్నాయి.
పుష్కరిణి వద్ద లక్ష ద్వీపార్చన, నవహారతులు
శ్రీశైలం, నవంబర్ 12: శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా కార్తీక మాస ప్రారంభ సోమవారం నుండి చివరి సోమవారం వరకు 4 సోమవారాల పాటు ఆలయ పుష్కరిణి వద్ద దేవస్థానం వారు ప్రత్యేకంగా లక్ష ద్వీపార్చన, లోక కల్యాణం కోసం నవహారతులను దేవస్థానం వారు నిర్వహిస్తున్నారు. లోకం సుభిక్షంగా ఉండాలని, భక్తులు లక్ష ద్వీపార్చన నిర్వహించడం వల్ల సాంప్రదాయ విలువలు, అలవర్చుకుంటారనే ఉద్దేశ్యంతో భక్తులకు ద్వీపాలు వెలిగించుకునేందుకు ప్రతి సోమవారం కూడా లక్ష ద్వీపార్చన పేరుతో పుష్కరిణి వద్ద దేవస్థానం వారే ద్వీపారాధనలు ఇచ్చి లక్ష ద్వీపోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. కార్తీకమాస చివరి సోమవారం కావడంతో పుష్కరిణి వద్ద లక్ష ద్వీపార్చన, నవహారతుల కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
శ్రీశైలంలో ప్రముఖులు
శ్రీశైలం, నవంబర్ 12: పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకుని సేవించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు వేర్వేరు సమయాల్లో సాదర స్వాగతం పలికారు. వీరిలో అటవి శాఖ మంత్రి సిద్దా రాఘవరావు, డిప్యూటీ సియం, హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప, ఎపి, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్యాంప్రసాద్‌లు వేర్వేరు సమయాల్లో స్వామి, అమ్మవార్లను దర్శించుకుని సేవించుకున్నారు. స్వామి వారికి వజ్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చనాది ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు. వీరికి అమ్మవారి ఆశీర్వచన మండపం నందు ఆలయ అర్చక వేదపండితులు స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదింగా, ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను, లడ్డూ ప్రసాదాలను అందించారు.

విభజన హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయండి
* సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ
కర్నూలు సిటీ, నవంబర్ 12: రాష్ట్ర విభజన హామీల గురించి తప్పుగా మాట్లాడే నాయకులను తరిమి కొట్టాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపు నిచ్చారు. ఆదివారం పాత బస్టాండ్ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ హాల్‌లో ఎపి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై, 20న చలో అసెంబ్లీ జయప్రదం చేయాలని కోరుతూ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు అయ్యే విధంగా చూస్తామని చెబుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట సన్మానాలు చేయించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్‌లో కూడ రాష్ట్రానికి 5 సంవత్సరా కాదు 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇచ్చి వెనకబడిన సీమాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని ప్రకటించి, ప్రత్యేక హోదా ఇవ్వటం కుదరదని, ప్యాకేజి ఇస్తామని చెప్పటం ఏమిటని ప్రశ్నించారు. వెంకయ్యనాయుడు మాత్రం తాను ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటు వస్తున్న ఆయనకు ఉప రాష్టప్రతి పదవి వచ్చింది కాని రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్నారు. ప్రత్యేక హోదా తోనే రాష్ట్భ్రావృద్ధి సాద్యమవుతుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట సానుకూలంగా ఉండి, ప్రత్యేక హోదా ఏమన్న సంజీవినా అని విమర్శిస్తూ ప్యాకేజి వైపు మొగ్గు చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై చిన్నచూపు చూస్తోందని, బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు భారిగా నిదులు విడుదల చేస్తోందన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 44 పథకాలకు నిదులను విడుదల చేసిందని, వాటిలో స్వచ్చ భారత్ కోసం రూ.1355 కోట్లను కేటాయించి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి 21శాతం నిదులను కేటాయిస్తే ఎపికి మాత్రం 2శాతం నిదులు కేటయించిందన్నారు. స్వచ్చ భారత్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబునే కన్వీనర్‌గా ఉన్న అతి తక్కువ నిదులను కేటాయిస్తూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు. భజన చట్టంలోని హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో విద్యార్థులు, మేథావులు, ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నాయకులు పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ భావితరాల భవిష్యత్‌కు ఉపయోగపడే ప్రత్యేక హోదాపై విమర్శలు చేస్తూ చరిత్ర హీనులుగా మారుతున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక హోదా ఏమన్న సంజీవినినా అంటున్నాడని, ప్యాకేజి తోనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేస్తానని గొప్పలు చెప్పుతున్నాడన్నారు. సంవత్సరానికి 3-4లక్షల మంది విద్యను పూర్తి చేసుకుని బయటి వస్తున్నారని, వారిలో కనీసం లక్ష మంది విద్యార్థులకైన ఉద్యోగ అవకాశాలను కల్పించారాని ప్రశ్పించారు. నిరంతరం విదేశాల్లో తిరుగుతూ పెట్టుబడి దారులను అహ్వానించి దాదాపు రూ.16లక్షల కోట్లను రప్పించానని గొప్పలు చెప్పుకుంటున్నాడని, ప్రత్యేక హోదా వస్తే విదేశాల్లో తిరగాల్సిన అవసరం ఉండదని పారిశ్రామిక వేత్తలే వచ్చి పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తారని వెల్లడించారు. దేశంలో ఇప్పటి వరకు 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఉందని, జీయస్టీ ఆ రాష్ట్రాలకు కేంద్రమే భరించటమే కాకుండ సంవత్సరానికి రూ.25వేల కోట్ల రుణాలను ఇస్తూ మరొక 10 సంవత్సరాల పాటు పొడిగించిందన్నారు. మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ప్రధాని మోదీ దగ్గర మాట్లాడటానికి చంద్రబాబు సైతం భయపడుతున్నాడని, దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండ తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజి వైపు మొగ్గు చూపపడంతో సీమాంద్ర జిల్లాల అభివృద్ధికి కోసం రూ.2350 కోట్లు కావాలని డిమాండ్ చేస్తే జిల్లాకు కేవలం రూ.50కోట్లను విడుదల చేస్తూ ముష్టి వేసినట్లుగా వ్యవహరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ హీరో, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర నాయకులు శివాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన కంటే పెద్ద ఆర్టిస్టని, ఆయనకు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అవినీతికి పాల్పడుతూ రాజకీయాలను బ్రస్టు పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దమ్ముంటే ప్రత్యేక హోదాపై మోదీ మాట్లాడి ప్రజల నమ్మకాన్ని పొందాలని సూచించారు. పార్టీలకతీంగా సమైక్యంగా పోరాటం చేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాదించి భావితరాల భవిష్యత్‌కు పునాది వేద్దామని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.షడ్రక్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, ఎ ఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహార్ మాణిక్యం, ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం, పలు రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఏం కొనలేం...తినలేం
ఆదోని, నవంబర్ 12: మార్కెట్‌లో పెరిగిన కాయగూరల ధరలు సామాన్యులు, పేదల నడ్డి విరుస్తున్నాయి. ఇలా ధరలు పెరిగితే ఏం కొనాలి, ఎలా తినాలని అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీలను పెరిగిన ధరలు దడపుట్టిస్తున్నాయి. పెరిగిన ధరలను అస్త్రంగా మలుచుకుని విపక్షాలు అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. మరోవైపు దక్షణాధి రాష్ట్రాల్లో అతివృష్టి, మరో పక్క ఆనావృష్టి వల్ల పంటలు బాగా దెబ్బతిన్నాయి. దాని ఫలితంగా సామాన్యుడు ప్రతి రోజు వినియోగించే కూరగాయాల ధరలు బాగా పెరిగిపోయాయి. ఉల్లిగడ్డలు ప్రజలకు కన్నీరు పెట్టిస్తోంది. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయి. ఇక తమ వంతుగా టమోట ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఆదోని మార్కెట్‌లోకిలో టమోట ధర ఒక 15 రోజుల్లోనే రూ.20 నుంచి రూ.50లకు పెరిగింది. ఉల్లిగడ్డలు ధరలు కూడా కిలో రూ.20లు ఉండేవి. ఇప్పుడు రూ.50లకు అమ్ముతున్నారు. ఆదోని డివిజన్‌లో టమోట ధర పత్తికొండ, బెల్లేకల్లు, ఆదోని మార్కెట్‌లో వ్యాపారులు తమిళనాడు, కర్నాటక ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. అందువల్ల ఆ రాష్ట్రాలలో టమోట ధర వందకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఆదోని మార్కెట్‌లో వంకాయలు, బీరకాయలు, సొరకాయ, చౌళేకాయలు, అనపకాయలు, కాకరకాయలు
ధరలు ఒక్కసారిగా పెరిగి కిలో రూ.50లకు తగ్గకుండా ఉన్నాయి. ఏ కాయగూర తీసుకున్న ఇదే పరిస్థితి నెలకొంది. ఇక ఆకుకూరలు కూడానెలక్రితం రూ.5లకు దోరికే ఆకుకూరల కట్ట ఇప్పుడు రూ.15లు పలుకుతోంది. ఈవిధంగా కూరగాయాలు ధరలు పెరగడంతో పేదలతోపాటు, మధ్య తరగతిప్రజలు కూడా ఆందోళన చెందుతున్నారు. ధరలు పెరుగుదల కేవలం కాయగూరలకే పరిమితం కాలేదు. నెల క్రితం రూ.70లకు కిలోపలికిన ఎండుమిర్చి ఇప్పుడు రూ.140 నుంచి రూ.170 కిలో అమ్ముతున్నారు. ఈవిధంగా ఎండు మిర్చి ధర పెరిగింది. దీంతోపాటు వేరుశెనగ నూనే, నువ్వుల నూనే, సన్‌ప్లైవర్ ఆయిల్, కుసుముల నూనేలు కూడా ధరలు రూ.20ల నుంచి రూ.30ల వరకు పెరిగాయి. దీని వల్ల కూడా ప్రజలు ప్రభుత్వాల తీరుపై పెదవి విరుస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల పరిమితి కాలేదు. ఇంటి నిర్మాణానికి ఒపయోగ పడే సిమెంట్, ఉక్కు ధరలు కూడా పెరిపోయాయి. సిమెంట్ ధర బస్తా రూ.320 నుంచి రూ.350లకు అమ్ముతున్నారు. దీనిపై కూడాప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉండడం జరుగుతుంది. కంది బ్యాళ్ళ ధర రూ.20ల వరకు పెరిగింది. చింతపండు ధర రూ.90 నుంచి రూ.100ల వరకు అమ్ముతున్నారు. గతంలో రూ.50ల నుంచి రూ.60లకు కిలోచింత పండు అమ్మెవారు. ఈవిధంగా చింత పండు ధర కూడా పెరిగింది. ఈవిధంగా నిత్యావసర వస్తువులు అన్ని కూడా పెరిగి సామాన్యులు విలవిలాడుతుంటే కేంద్రమంత్రులు ధరలు పెరుగుదల రాష్ట్రాలకు సంబంధించిందని చేతులు దులుపుకుంది. అంతేకాకుండా పెరిగిన ధరలను నియంత్రించడానికి వ్యాపారస్థులు నిలువ చేసే సరుకులపై నియంత్ర విధించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చి కేంద్రం చేతులు దులుపుకుంది. రాష్ట్ర అధికారులు అక్రమ నిలువలపైన దాడులు చేయగా లక్షల టన్నుల నిత్యావసర వస్తువుల నిలువలను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అక్రమార్కులు సరుకులను నిలువ ఉంచి పెంచి కృత్రిమ కొరతను సృష్టిస్తున్న విషయం స్పష్టం అయినప్పటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వ్యాపారులపైన చర్యలు తీసుకోక పోవడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉంది. ఇక చౌక దుకాణాల ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యవసర సరుకుల విధానాన్ని పటిష్టం చేస్తామని చెబుతున్న ప్రభుత్వ విధానాలు అసలు అమలు కావడం లేదు. ఈసంవత్సరం చాలా రాష్ట్రాలలో వర్షభావం వల్ల రబీ సీజన్ కూడా పూర్తి అయింది. అందువల్ల ధరలు ఇప్పటి నుంచే పెరిగితే ప్రభుత్వంపైన మరింత అసంతృప్తి పెరిగింది. రాబోయే రెండు నెలల్లో బియ్యం వ్యాపారులు అక్రమంగా నిలువలను ఉంచి ధరలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా సమాచారం. ప్రతిపక్షాలు కూడా పెరిగిన ధరలపైన ఉద్యమిస్తున్నాయి. ధరలు ఇలాగే పెరుగుతూ పోతే రాబోయే గుజరాత్ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలకు గడ్డుకాలమే. కావున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలోప్రభుత్వాలపై ప్రజల వ్యతిరేకత తప్పదు.
భక్తులతో మహానంది కిటకిట
మహానంది, నవంబర్ 12: ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో అశేష భక్తజనవాహినితో క్షేత్రం కళకళలాడింది. ఆదివారం క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఆలయంలోని పుష్కరిణిల్లో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తులు క్యూలైన్లలో దాదాపు 4 గంటల పాటు వేచి వుండి శ్రీకామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లను దర్శించుకున్నారు. ఆలయంలోని శివపార్వతుల విగ్రహాలు, అరుగుల వద్ద, ధ్వజస్తంబం వద్ద, నంది స్థూపం, పంచలింగాలు, నాగులకట్ట వద్ద మహిళలు పెద్దసంఖ్యలో కార్తీక దీపాలు వెలిగిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు స్వామి వార్ల దర్శనాన్ని దేవాలయ అధికారులు కల్పించారు. కాగా మహానందికి వచ్చిన భక్తులు సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులు రద్దీని అంచనా వేయలేని అధికారులు ఏర్పాట్లలో పూర్తిగా విఫలమయ్యారు. క్యూలైన్లలో భక్తులు స్వామి వార్ల దర్శనానికి వేచి ఉండగా విఐపిల తాకిడి ఉండడంతో దర్శనాలు ఆపివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. తాగడానికి నీరు లేక చిన్నారులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం.
మహానందీశ్వరుని సన్నిధిలో ప్రముఖులు
మహానందిలో రాష్ట్ర న్యాయశాఖ, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే సాంబశివరావు, సినీ హాస్యనటులు అంబటి శ్రీనివాస్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తదితరులు మహానందిలో పూజలు నిర్వహించారు. క్షేత్రానికి వచ్చిన వీరికి ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం వారు శ్రీకామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు అభిషేకార్చన పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించగా అధికారులు శేషవస్త్రంతో సత్కరించారు.