కర్నూల్

ఖాళీ అవుతున్న జీడీపీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, నవంబర్ 22: గాజులదినె్న ప్రాజెక్టు ఎడమ కాలువల నుంచి గత నెల రోజులుగా ప్రతి రోజు 90 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర దిగువ కాలువ రైతులకు మళ్లిస్తుడడంతో జీడీపీ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు డ్యాంలో పూర్తి స్థాయిలో నీరు చేరడంతో ఇటు రైతులు, అటు నదీతీర ప్రాంతాల ప్రజలకు నీటి ఇబ్బందులు ఉండవని అనుకున్నారు. అయితే ఈ ఆశలను కోడుమూరు నియోజకవర్గ అధికార పార్టీ, నీటి పారుదల అధికారులు అడి ఆశలు చేశారని స్పష్టం అవుతోంది. ఎప్పటిల్లాగా ఈ ఏడాది కూడా తుంగభద్ర కోడుమూరు సబ్‌డివిజన్‌లోని ఆయకట్టు రైతులకు రావాల్సిన నీటి వాటా రాలేదు. రైతులకు రావాల్సిన నీటి వాటాకై నేతలు ఏమాత్రం పట్టించుకోక పోవడం గమనార్హం. దీంతో తుంగభద్ర డివిజన్ నుంచి కోడుమూరుకు రావాల్సిన వాటా గురించి ఇక్కడి అధికార పార్టీ నేతలు కానీ, నీటి సంఘాల ప్రతినిధులు కానీ ప్రస్తావించే దాఖలాలు కనిపించలేదు. ఈ దశలో నీటి కోసం ప్రయత్నాలు చేయని నేతలు, నీటి పారుదల అధికారులు దిగువ కాల్వ రైతులు సాగు చేసిన పంటలకు ఎప్పటిల్లాగే గాజులదినె్న ప్రాజెక్టుపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దిగువ కాలువలకు రావాల్సిన నీటి వాటా కోసం ప్రయత్నిం చేయకపోగా పక్కన ఉన్న గాజులదినె్న ప్రాజెక్టు నుంచి దిగువ కాలువలకు నీటి మళ్లించి చేతులు దులుపుకోవడంపై జీడీపీ రైతులు మండిపడుతున్నారు. ఈ ఏడాది వరుణ దేవుడు కరుణతో కురిసిన భారీ వర్షాలకు జీడీపీ డ్యాం పూర్తి స్థాయిలో నిండడంతో నదీతీర ప్రాంతాల ప్రజలకు నీటి సమస్యలు తీరినట్లైంది. కానీ గత నెల రోజుల నుంచి జిడిపి ఎడమ కాలువల నుంచి ప్రతి రోజు 90 క్యూసెక్కుల నీటిని తుంగభద్ర దిగువలకు నీటి మళ్లించి మళ్లీ డ్యాంలో నీటి నిల్వలను పూర్తిగా హరించే ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. నీటి సరఫరా ఇలా సాగితే రబీ సీజన్‌లో సాగు చేసుకుంటున్న జిడిపి రైతులకు సాగు నీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గత ఏడాది కూడా జిడిపి నీటిని దిగువ కాల్వలకు మళ్లించి అక్కడి రైతులను ఆదుకొని ఇక్కడి జిడిపి రైతుల పంటలు ఎండి పోయి నష్టాల వాతకు గురైన విషయం తెలిసిందే. అదే పరిస్థితి ఈ ఏడాది కూడా జిడిపి రైతులకు సాగు నీటి సమస్యలు తలెత్తడంతో పాటు వేసివిలో కోడుమూరు, డోన్, పత్తికొండ, కర్నూలు నగర ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని పాలకులు, అధికారులు మరిచిపోవడం గమనార్హం. గత ఏడాది మూడు నియోజకవర్గాల ప్రజలకు ఏర్పడిన తాగు నీటి కోసం జనం అల్లాడి పోయారు. నీటి కోసం ప్రజలు ఉద్యమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికైన మూడు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, పాలకులు, నాయకులు, అధికారులు స్పందించి ఇక్కడ సాగుతున్న జలదోపిడీకి అడ్డుకట్ట వేయకపోతే రానున్న వేసవిలో ప్రజలు మళ్లీ తాగునీటి కోసం ఉద్యమాల బాట పట్టకతప్పదని తెలుస్తోంది.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నీటి విడుదల : గత నెల రోజుల నుంచి నీటి పారుదల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము గాజులదినె్న ప్రాజెక్టు నుంచి నిర్విరామంగా తుంగభద్ర దిగువ కాల్వలకు నీటి విడుదల చేస్తున్నామని జిడిపి ఎఇ రవిప్రకాష్ తెలిపారు.

కర్షక, కార్మిక, ఉద్యోగ వర్గాలకు
అండగా ఉంటా
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
బేతంచెర్ల, నవంబర్ 22: రాష్ట్రంలోని కర్షక, కార్మిక, ఉద్యోగ వర్గాల వారికి అన్ని విధాలా అండగా ఉంటానని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో 15వ రోజు బేతంచెర్ల మండలం కొలుములపల్లె గ్రామ సమీపంలోని బస చేసిన ప్రాంతం నుండి పాదయాత్ర ప్రారంభించారు. మార్గమధ్యంలో గ్రామీణ వైద్యులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైద్య ఆరోగ్యపరిస్థితి పూర్తిగా దెబ్బతిందన్నారు. గ్రామీణ వైద్యులుగా మీరందిస్తున్న సేవలను గుర్తించి నాడు మన దివంగనేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శిక్షణ ఇచ్చి సర్ట్ఫికెట్లు అందజేశారన్నారు. అయితే దురదృష్టావశాత్తు వైఎస్ మృతి చెందడంతో ఆతరువాత ప్రభుత్వాలు దాన్ని పక్కన పెట్టాయన్నారు. నాలుగు సంవత్సరాల కాలం ఓపిక పట్టారు, మరో సంవత్సర కాలం ఆగితే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మూడునెలల్లో సంబంధిత జిఓ విడుదల చేసి ఆరునెలల్లో శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించి ఆర్హులైన వైద్యాన్ని అందించే విధంగా సర్ట్ఫికెట్లు జారీ చేస్తామన్నారు. దారి పొడువునా కలిసి రైతులను, వ్యవసాయ కూలీలతో మాట్లాడుతూ పంటకు గిట్టుబాటు ధర కలిపిస్తాం, కూలీలకు బీభీమా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆయా గ్రామాల్లో కలిసి మహిళలనుద్ధేశించి మాట్లాడుతూ సున్న వడ్డీకే పొదుపు రుణాలు ఇస్తాం, మీపిల్లలను చదవించుకోవడానికి సంవత్సరానికి ఒక్కొక్కరికి రూ.15వేలు నగదు అందిస్తామన్నారు. మోడల్ స్కూళ్లలో పనిచేసే 2100 మంది ఉపాధ్యాయుల కోసం, బకాయి వేతనాల కోసం, ప్రభుత్వంలో స్కూళ్ల వీలినం, ఉపాధ్యాయుల సిపిఎస్ రద్దు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియమాకానికై ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, సమస్యలు పరిష్కరించకపోతే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పరిష్కరిస్తామన్నారు. డిసెంబర్ 8న మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు చేపట్టే చలో సచివాలయానికి మద్దతు ఇస్తామన్నారు. ఆయన వెంట పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శిల్పాచక్రపాణి రెడ్డి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బివై రామయ్య, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు ఉన్నారు.

ప్రజా సమస్యలు తెలుసుకొని మాట్లాడాలి
* జగన్ సిఎం కావడం పగటి కల
* జిల్లాపై సిఎం ప్రత్యేక శ్రద్ధ
* టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి
ఆళ్లగడ్డ, నవంబర్ 22: ప్రజా సంకల్పయాత్రలో భాగంగా జిల్లాలో అడుగుపెట్టిన జగన్ జిల్లా సమస్యలను తెలుసుకుని మాట్లాడాలని టీడీపీ జిల్లా అధ్యక్షులు, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని మంత్రి స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రలో ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని, టీడీపీని విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత జగన్‌కు లేదన్నారు. జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కెయి. కృష్ణమూర్తి ఈ ప్రాంతంలో చెరువులకు నీరు తెప్పించలేక పోయాడని జగన్ మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. జగన్ మాటలు ప్రజల్లో విశ్వసనీయత లేదని గతంలోనే రుజువైందన్నారు. జగన్ పద్ధతులు నచ్చకనే వైకాపా ఎమ్మెల్యేలు సగం మంది టిడిపిలో చేరారన్నారు. తాను అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తాననడం వింతగా వుందన్నారు. 2019లో కూడా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సిఎం చంద్రబాబునాయుడు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ వుంచారని, విమానాశ్రయంతో పాటు అనేక పరిశ్రమలు జిల్లాకు తెప్పిస్తున్నారన్నారు. పరిశ్రమలు రావడంతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశం లభిస్తుందన్నారు. వైకాపాను ప్రజలు విశ్వసించరని ఇటీవల నంద్యాల, కాకినాడ ఎన్నికలే ఉదాహరణ అన్నారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని ఓట్లేసి గెలిపిస్తే జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా బహిష్కరించాడన్నారు. ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా తన వెంట తిప్పుకుంటున్నారని ఆయన విమర్శించారు. ప్రజా సంకల్పయాత్రకు ఆదరణ కరువైందన్నారు. తన సభకు భారీగా తరలివస్తున్నారని, తన స్వంత జిల్లా నుండి 80 వాహనాల్లో జనాలను రప్పించుకుంటున్నారన్నారు. ఒకప్పుడు 420 అని జగన్‌ను విమర్శించిన శిల్పా చక్రపాణిరెడ్డి ఆయనతోనే జతకట్టాడంటే శిల్పా ఎలాంటి వారో అర్థం చేసుకోవాలన్నారు. 2014 ఎన్నికల్లో భూమా పై ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తామని ప్రకటించిన శిల్పా ఆ తర్వాత రాజకీయ సన్యాసం గురించి మాట్లాడలేదన్నారు. ప్రజా సమస్యలపై వినతిపత్రం ఇచ్చారా, రాష్ట్భ్రావృద్ధి కోసం సూచనలు ఏవైనా ఇచ్చారా అని జగన్‌ను సోమిశెట్టి సూటిగా ప్రశ్నించారు. ఈ సమావేశంలో మార్కెట్‌యార్డు చైర్మన్ బివి రామిరెడ్డి, శ్రీ రామతీర్ధం పుట్టాలమ్మ దేవస్థానం చైర్మన్ అంబటి మహేశ్వరరెడ్డి, అనంత రామసుబ్బారెడ్డి, రంగనాయకులు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

కాంట్రాక్టు కార్మికుల పొట్టకొట్టనున్న జీవో 279!
* అమలుకు సన్నద్ధం.. కార్మికుల ఆందోళన బాట
కర్నూలు సిటీ, నవంబర్ 22: ఉద్యోగ భద్రత లేకుండా చేసి, తమ పొట్టకొట్టే జీవో నెం.279ని అమలుచేయవద్దని కాంట్రాక్టు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో అమలు చేస్తే తమ ఉద్యోగాలకు భద్రత లేకుండా పోతుందని, కుటుంబాలు రోడ్డునపడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పద్దతినే కొనసాగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పారిశుద్ధ్యం మెరుగు పర్చేందుకు ప్రభుత్వం డిసెంబర్ 30 2015న జీఓ నెం. 279ను జారీ చేసిన విషయం విధితమే. అయితే ఈ జీఓను అమలు చేస్తే కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, తక్షణమే ఉప సంహరించుకోవాలని మున్సిపల్ కార్మిక సంఘాలు జెఎగా ఏర్పడి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కార్మిక సంఘాల జెఎసి నాయకులతో చర్చలు జరిపింది. దీంతో ప్రభుత్వం జీవోను అమలు చేయలేదు. ఈ జీఓ ప్రకారం 350 ఇళ్లను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఆ పరిధిలో రోడ్లను, డ్రైనేజి కాల్వల శుభ్రత, ఇళ్ల నుండి వచ్చే చెత్తను ఎత్తివేయాల్సి ఉంటుంది. ప్రధాన రోడ్లను ఊడ్చడానికి స్వీపింగ్ మిషన్లను ఉపయోగిస్తారు. వీటితో పాటు నగరాన్ని మూడు జోన్లుగా ఏర్పాటు చేసి ఒక జోన్‌కు రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులు పని చేస్తే మిగిలిన రెండు జోన్ల నందు కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు పని చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులపై అజమాయిసీ నగర పాలక సంస్థ ఆధీనంలోనే ఉంది. 279 జీఓ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులు కాంట్రాక్టర్ల ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది. అంతే కాకుండా కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా వ్యవహరించి ఆయనకు ఇష్టం వచ్చిన వారితో పని చేయించుకోవచ్చు. ఈవిధంగా కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని కార్మిక సంఘాల జెఎసి నాయకులు ఆందోళన చేశారు. అయితే ప్రస్తుతం క్లస్టర్ విధానాన్ని పక్కన పెట్టి మైక్రోప్యాకెట్స్ అనే కొత్త విధానాన్ని తెరపైకి తీసుకువచ్చారు. దీనికి ఓ రూపం తీసుకొచ్చి అప్రూవల్ కోసం డిఎంఎకు మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ విభాగం అధికారులు నివేదికలను పంపారు. నగరంలో 51 వార్డులుండగా వాటిని 13 శానిటేషన్ డివిజన్లుగా ఏర్పాటు చేసి పారిశుద్ధ్య పనులను చేస్తున్నారు. జీఓ నెం. 279 ప్రకారం 13 శానిటేషన్ డివిజన్లను 329 మైక్రో ప్యాకెట్స్‌గా ఏర్పాటు చేసి, యుఎల్‌బి కింద 144 మైక్రో ప్యాకెట్స్, కాంట్రాక్ట్-1 కింద 85 ప్యాకెట్స్ కాంట్రాక్ట్-2 కింద 100 ప్యాకెట్స్ ఏర్పాటుచేశారు. వీటి నిర్వహణకు యుఎల్‌బి రూ.15.5కోట్లు, కాంట్రాక్ట్-1కు రూ.14.05 కోట్లు, కాంట్రాక్ట్-2కు రూ.17.71 కోట్లను కేటాయించింది. ఇందులో యుఎల్‌బి కింద రెగ్యులర్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తే మిగతా వాటిలో కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు పనిచేయాల్సి ఉంటుందని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ వీరశేఖర్ తెలిపారు.
నగర పాలక సంస్థ ఆజమాయిషీలో ఉంచాలి:
వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వైవి.రమణ
నగర పాలక సంస్థలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్య కార్మికులకు జీఓ నెం.279 వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని కర్నూలు కార్పొరేషన్ డ్వాక్రా గ్రూపు మహిళా శానిటరీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వైవి. రమణ అన్నారు. మెరుగైన పారిశుద్ధ్యం కోసం మార్పులు అవసరమే కాని, కార్మికులకే ఉద్యోగ భద్రత లేకపోతే ఎలా అని, పాత పద్ధతిలోనే పారిశుద్ధ్య కార్మికులను కొనసాగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.

ముగిసిన ఎమ్మెల్యే సినిమా షూటింగ్
ఆదోనిటౌన్, నవంబర్ 22: ఆదోని పట్టణ పరిసర ప్రాంతాల్లో గత ఆరు రోజుల నుంచి జరుగుతున్న ఎమ్మెల్యే చిత్రం షూటింగ్ బుధవారం ముగిసింది. నందమూరి కళ్యాణ్‌రామ్ నటిస్తున్న చిత్రం షూటింగ్ ఆదోని బైపాస్ రోడ్డుతోపాటు ఆస్పరి రోడ్డు, రాయమిల్, పర్వాతపురం రోడ్డులోని జిన్నింగ్ పరిశ్రమలోను వివిధ చిత్ర దృశ్యాలను చిత్రం హీరో, విలన్లపై చిత్రికరించినట్లు కళ్యాణ్‌రామ్ సేవా సమితీ వ్యవస్థాపక అధ్యక్షులు గోనబావి గోపాల్ పేర్కొన్నారు. చివరి రోజు పర్వతాపురం రోడ్డులోని పరిశ్రమలు బాలకార్మికులతో పనులు చేయిస్తున్న దృశ్యాలను చిత్రికరించారని, అలాగే ఇందుకు కారకుడైన చిత్రం విలన్ శివారెడ్డిని అరెస్టు చేసిన దృశ్యాలను చిత్రికరించడం జరిగిందని తెలిపారు. ఆదోని ప్రాంతంలో జరిగిన షూటింగ్‌కు అందరు సహకరించాలని పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి వచ్చి హీరో కళ్యాణ్‌రామ్‌తో ఫోటోలు దిగినట్లు ఆయన పేర్కొన్నారు.
చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
ఆలూరు, నవంబర్ 22: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో నైపుణ్యం ప్రదర్శించాలని సౌత్‌జోన్ ఐజి షేక్ అహ్మద్ ఇక్బాల్ పిలుపు నిచ్చారు. బుధవారం ఆయన ఆలూరులో పర్యటించారు. ప్రభుత్వ నెంబర్ 2 బాలుర పాఠశాల, జడ్పీ బాలికల పాఠశాలలను సందర్శించారు. ఈసందర్భంగా జరిగిన సమావేశంలో ఐజి మాట్లాడుతూ పాఠశాలల్లో వౌళిక వసతుల ఏర్పాటుకు దాతలు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అప్పుడే పాఠశాలల్లో విద్యా సౌకర్యలు మెరుగుపడుతాయని అన్నారు. 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని అన్నారు. ఆటల పోటీల్లో ఆసక్తికల్గిన వారు శిక్షణ పొందాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించారు. వైద్యాధికారి విశే్వశ్వరయ్యను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఇసిజి, వైద్య పరికరాలు ఏర్పాటు చేయాలని ఐజి దృష్టికి విన్నవించారు. ఈసందర్భంగా ఆదోని డిఎస్‌పిప్రసాద్, సిఐ గౌస్, ఎస్‌ఐ ధనంజలు ఐజిని ఘనంగా సత్కరించారు.

వె ల్దుర్తి చేరిన ప్రజాసంకల్పయాత్ర
వెల్దుర్తి నవంబర్ 22: ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొనసాగిస్తన్న ప్రజాసంకల్పయాత్ర బుధవారం సాయంత్రం పత్తికొండ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం సర్పరాజాపురం గ్రామానికి చేరుకుంది. నియోజవర్గానికి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నియోజకవర్గ ఇన్‌చార్జి కంగాటి శ్రీదేవమ్మ, మండలంలోని పలుగ్రామాల నాయకులు ప్రదీప్‌రెడ్డి, బి.రవిరెడ్డి, బి.క్రిష్ణారెడ్డి, సర్పరాజాపురం వెంకటేశ్వర రెడ్డి, తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం సర్పరాజాపురం గ్రామంలో వైఎస్ జగన్ పర్యటిస్తూ గ్రామ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు, గ్రామప్రజలు గృహలు మంజూరు కాలేదని, పింఛన్లు అందడం లేదని విన్నవించారు. వీటిపై జగన్ స్పందిస్తూ ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సమీపంలో నరసీపురం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన బస కేంద్రానికి చేరుకున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు పాదయాత్ర ప్రారంభించి రామళ్ళకోట, బోయినపల్లి బస్టాప్, బ్రహ్మగుండం మీదుగా 10 కిలో మీటర్ల పాదయాత్ర చేస్తారని, వెల్దుర్తి చేరుకొని బహిరంగసభలో ప్రసంగించనునున్నారు. అనంతరం గురువారం రాత్రి హైదరబాదు చేరుకుని శుక్రవారం కోర్టుకు హాజరై శుక్రవారం రాత్రి వెల్దుర్తి చేరుకొని శనివారం పాదయాత్ర ప్రారంభించనున్నారు.
మత ఘర్షణల కేసులు ఎత్తివేయాలి
ఆదోనిటౌన్, నవంబర్ 22: ఆదోని పట్టణంలో దురదృష్టవశాత్తు జరిగిన మతఘర్షణ కేసులను ఎత్తివేయాలని టిడిపి కౌన్సిల్ ప్లోర్ లీడర్ తిమ్మప్ప, బిజేవైఎం రాష్ట్ర కార్యదర్శి కునిగిరి నీలకంఠ, కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు దీలీప్‌డోకా, సీనియర్ కౌన్సిలర్ వై.జి బాలాజీలు కోరారు. బుధవారం మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, మాజీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డిలను కలిసి కేసులను ఎత్తివేసేందుకు సహకరించాలని కోరామన్నారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆ యన స్వగృహంలో వినతిపత్రం ఇచ్చామన్నారు. 2011 గణేష్ నిమజ్జనంలో జరిగిన ఘర్షణల్లో సుమారు 380 మందిపై కేసులు ఉన్నాయని గత 7 సంవత్సరాలుగా కేసుల్లో ఉన్న వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని యువకులు ఉద్యోగాలకు వెళ్ళలేకపోతున్నారని అన్నారు. అందువల్ల వెంటనే కేసులను ఎత్తివేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో న్యాయం చేయాలని కోరారు.
ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
కల్లూరు, నవంబర్ 22: మండల పరిదిలోని లక్ష్మిపురం గ్రామ పరిదిలోని జితేష్ పెటోప్రిఫామ్స్ కంపెనీలో ప్రమాద వశాత్తు మిషన్ కింద పడి ఎల్లప్ప(22) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మిపురం గ్రామానికి చెందిన ఎల్లప్పతో పాటు మరి కొందమంది యువకులు భారత్ గ్యాస్ పెట్రోల్ బంకు ముందు ఉన్న జితేష్ పెట్రోప్రిఫామ్స్ కంపెనీలో గత నాలుగు నెలల నుండి పనిచేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మిషన్ చెడిపోయింది. అయితే బుధవారం మిషన్‌ను మరమ్మతులు చేయించేందుకు మిషన్ కింద వీరందరు జాకీలు పెడుతుండగా జాకీలు పెట్టి లేపుతుండగా ఒకవైపే ఎత్తు ఎక్కువ కావడంతో ఎల్లప్ప ఉన్న వైపు మిషన్ జారుకుంది. జారిన మీషన్‌కు ఉన్న రాడ్డు ఎల్లప్ప చాతిలోకి దిగింది. దీంతో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఉలిందకొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం గల వివరాలు తెలుసుకొని ఫ్యాక్టరీ వారిపై కేసునమోదు చేసి దర్యాప్తుచేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్సపొందుతూ యువకుడి మృతి
మహానంది, నవంబర్ 22: మండలంలోని అల్లీనగరం వద్ద గత మూడు రో జుల క్రితం జరిగిన మోటారుబైక్ ప్రమాదంలో గాయపడిన శ్రీ్ధర్ కర్నూలులో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు తెలిపారు. మోటారు సైకిళ్లు ఢీకొన్న ప్రమాదంలో నంద్యాల వెంకటాచలం కాలనికి చెందిన ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారన్నారు. అందులో శ్రీ్ధర్ పరిస్థితి వషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఆదోనిటౌన్, నవంబర్ 22: ఆదోని పట్టణ సమీపం లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదోని హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ బ్యాం కు మేనేజర్ గోపికృష్ణ (42) అనే వ్యక్తి మృతి చెందినట్లు తాలూకా పోలీసులు పేర్కొన్నారు. ఆదోనిలోని ఏపిహెచ్‌బి కాలనీలో నివా సం ఉంటున్న గోపికృష్ణ పని నిమిత్తం ఎమ్మిగనూరు వైపు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన లారీ రాజ నగర్ సమీపంలో ఢీకొనడంతో గోపి కృష్ణ అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడికి ఒక కుమారుడు, కూతూరు, భార్య ఉన్నారని ఈమేరకు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.