కర్నూల్

పౌష్ఠికాహారానికి రూ. 1200కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, డిసెంబర్ 7: గర్భిణులకు, పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి ప్రతి సంవత్సరం శిశు సంక్షేమ శాఖకు రూ. 1200కోట్ల నిధులు కేటాయిస్తోందని, దీనివల్ల రాష్ట్రంలో 35లక్షల మంది లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర మహిళ శిశుసంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్. అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదోనిలో గురువారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో మహిళ అభివృద్ధి శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం, వైద్యం, ఆరోగ్యం, కుటంబ సంక్షేమం, డీఆర్‌డీఏ శాఖలతోపాటు ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశం ఆదోని, గ్రామీణ సీడీపీఓ శాంతిదుర్గ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రత్యేక కమిషనర్ మాట్లాడుతూ రక్తహీనత, పిల్లల ఎదుగుదల ఉండాలన్న ఉద్దేశంతో పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నట్లు చెప్పారు. అన్న అమృతపథకం ద్వారా ప్రతి వారం గర్భిణులకు భోజనం, పాలు, గుడ్లు అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 11వేల అంగన్‌వాడీ కేంద్రాలు నిర్మించేందుకు ముఖ్యమంత్రి నిధులను మంజూరు చేసిందని, ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 7వేల అంగన్‌వాడీ కేంద్రాలు పూర్తి అయ్యాయని, మిగిలిన 4వేల కేంద్రాలు వివిధ దశల్లో నిర్మాణం కొనసాగుతోందన్నారు. ముఖ్యంగా మహిళల్లో చైతన్యం వచ్చినప్పుడు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలు విజయవంతం అవుతాయని అన్నారు. ప్రజలు వీటిని ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
* కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ లాలెప్ప
కర్నూలు సిటీ, డిసెంబర్ 7:నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని కేవీఆర్ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ జి.లాలెప్ప పిలుపునిచ్చారు. ‘మహిళలు వృత్తి విద్య, ఉపాధి అవకాశాలు’ అంశంపై గురువారం నైస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కేవీఆర్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ మహిళల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో అవకాశాలు కల్పిస్తుందని, ఆ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు కుటుంబ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రాయపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ యువతి ప్రణాళికాబద్ధంగా ఒక దిశా నిర్ధేశ్యంతో ముందుకు నడవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణ పొందిన మహిళలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. వ్యాపార సంస్థల్లో కంప్యూటరీకరణ ఎక్కువగా ఉందని ఈ నేపథ్యంలో ఉద్యోగ సాధనలో కంప్యూటర్ అకౌంట్స్ నేర్చుకోవడం ఈ రోజుల్లో తప్పని సరి అన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ ప్రవేశపెట్టిందని ఇందులో కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మహిళలకు ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. పరిశ్రమలు, వ్యాపార రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పొందాలంటే ఇంగ్లీషు భాషలో పరిపక్వత కలిగి ఉండాలని, దాంతో పాటు కమ్యునికేషన్ స్కిల్స్‌పై అవగాహన ఉండాలన్నారు. సదస్సులో అధ్యాపకులు శ్రీరాములు, శివయ్య, నవీన్, తదితరులు పాల్గొన్నారు.