కర్నూల్

జగన్ ఎప్పటికీ సీఎం కాలేడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంజామల, డిసెంబర్ 7: జగన్మోహన్‌రెడ్డి భవిష్యత్తులో కూడా ముఖ్యమంత్రి కాలేడని బనగానపల్లె ఎమ్మెల్యే బిసి జనార్థన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల పరిధిలోని ఆకుమళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన అంగన్‌వాడీ రెండు భవనాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆకుమళ్ల గ్రామానికి రూ.1.50 లక్షలు సీసీ రోడ్లకు మంజూరు చేస్తానని, అలాగే గ్రామాల్లో ఏవైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని, జగన్ మాటను ప్రజలు నమ్మరని, రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అవుతారన్నారు. వైకాపా నాయకులు కొన్ని గ్రామాల్లో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అన్నారు. ఈకార్యక్రమంలో నారాయణరెడ్డి, మంచాలమద్దిలేటిరెడ్డి, వివిధ గ్రామాల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
కార్పెంటర్లకు ఉజ్వల భవిష్యత్తు కల్పిస్తాం
* మెగా వుడ్‌పార్కు ఏర్పాటు* విశ్రాంత కమర్షియల్ డిప్యూటీ కమిషనర్ లింగారెడ్డి
నందికొట్కూరు, డిసెంబర్ 7:చేతిలో నైపుణ్యం వున్నా పూట గడవని స్థితిలో వున్న కార్పెంటర్లకు మెగా వుడ్ పార్కు ఏర్పాటు చేసి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విశ్రాంత కమర్షియల్ డిప్యూటీ కమిషనర్ మాండ్ర లింగారెడ్డి తెలిపారు. ఆయన గురువారం పట్టణంలోని కార్పెంటర్ల జీవన విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తు తం ఇక్కడి కార్పెంటర్లు చేస్తున్న పనిలో చెక్క వృథా అవుతుందని, పురాతన పద్ధతిలో పనులు చేస్తుండడంతో చేతులు, కాళ్లు, కళ్లు కోల్పోవడమేగాక అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. వారికి నూతన టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చి అనుభవజ్ఞులైన 20 మంది నిపుణులతో అత్యాధునిక యంత్ర పరికరాల వాడకంపై ఈ నెల 10వ తేదీ కర్నూలులోని వీజేఆర్ కనె్వన్షన్ సెంటర్‌లో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రదర్శనను డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభిస్తారని, కార్యక్రమానికి ఏపి స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మినారాయణ, నందికొట్కూరు టీడీపీ ఇన్‌చార్జి మాండ్ర శివానందరెడ్డి ప్రారంభిస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వీరం ప్రసాదరెడ్డి, సూపర్‌బజార్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, కార్పెంటర్స్ అసోసియేషన్ నాయకులు ఎల్లయాచారి, మునీర్‌బాష, శ్రీరాములు, శ్రీరామచారి, షఫి, రాము పాల్గొన్నారు.