కర్నూల్

నగరంలో రోడ్ల విస్తరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 7:నగరంలోని ముఖ్యమైన రద్దీ ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, అశోక్‌నగర్ అండర్ బ్రిడ్జి, కేవీఆర్ సర్కిల్, మున్సిపల్ ఆఫీస్ బస్టాప్‌లను గురువారం ఎస్పీ గోపీనాథ్‌జెట్టీ, మున్సిపల్ కమిషనర్ హరినాథరెడ్డి పరిశీలించారు. ఈ మేరకు వారు గురువారం అశోక్‌నగర్ అండర్ బ్రిడ్జి దగ్గర రాంగ్ రూట్‌లో వాహనాలు రావడంపై హెచ్చరించారు. మున్సిపల్ ఆఫీసు దగ్గర ఉన్న బస్టాప్ వద్ద ట్రాఫిక్‌కు అంతరాయం కలుగజేస్తున్నారని ఆటోలు, ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం మున్సిపల్ ఆఫీసు పక్కన ఉండే ఖాళీ స్థలాల్లో పార్కింగ్ చేయడానికి పరిశీలించారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, యూకాన్ ప్లాజా షాపుల దగ్గర కూడా రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తే జరిమానా విధించటమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కేవీఆర్ కళాశాల సర్కిల్ వద్ద ఉన్న నిరాశ్రయుల వసతి గృహాన్ని ఎస్పీ పరిశీలించి అక్కడ కల్పించే వసతులపై ఆరా తీశారు. సర్కిళ్లలో వాహనాలు సాఫీగా వెళ్లేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ డీఎస్పీ గంగయ్యను ఆదేశించారు. అనంతరం పాతబస్టాండ్ నుంచి కొత్తపేట మీదుగా మున్సిపల్ ఆఫీసుకు వెళ్లే రోడ్డు విస్తరణ పనులను పరిశీలించారు. వారి వెంట ట్రాఫిక్ డీఎస్పీ గంగయ్య, ఆర్‌ఐ రంగముని పాల్గొన్నారు.
కోడుమూరు
వైకాపా అభ్యర్థి మురళీక్రిష్ణ!
కోడుమూరు, డిసెంబర్ 7:2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు నియోజకవర్గ గడ్డపై మరోసారి వైకాపా జెండాను ఎగురవేసేందుకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గెలుపు గుర్రాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జగన్ కోడుమూరులో తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రను మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీక్రిష్ణ విజయవంతం చేసిన విషయం తెలిసిందే. 3 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో మురళీ మార్కు పడటం వల్లే జగన్‌కు జనం నీరాజనం పలికారు. తద్వారా శ్రేణులు అంతా సంతృప్తి చెందారు. ఆ కృషితోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కోడుమూరు అసెంబ్లీ స్థానానికి మాజీ ఎమ్మెల్యే పరిగెల మురళీక్రిష్ణ పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయంపై కోడుమూరు, గూడూరు, సి.బెళగళ్, కర్నూలు మండలాల్లో వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా మురళీకి దక్కినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.