కర్నూల్

న్యూట్రీషన్ మిషన్‌ను ఉద్యమంలా చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, డిసెంబర్ 7 : 2022 నాటికి కర్నూలును పౌష్ఠికాహారలోపం లేని జిల్లాగా తీర్చిదిద్దాలని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిషనర్ హెచ్.అరుణకుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఒక ఫంక్షన్‌హాలులో గురువారం జిల్లా స్థాయి మల్టీసెక్టోరల్ న్యూట్రీషన్ యాక్షన్ ప్లాన్ ఫార్మలేషన్‌పై ఒకరోజు వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణకుమార్ మాట్లాడుతూ పౌష్ఠికాహార లోపం లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు మహిళా శిశు సంక్షేమం, వైద్య, ఆరోగ్య, డీఆర్‌డీఏ, పంచాయతీరాజ్‌శాఖలతో పాటు సంబంధిత శాఖ లు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. రాష్ట్ర న్యూట్రీషన్ మిషన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా చేపట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారన్నారు. జాతీయ కుటుంబ ఆరో గ్య మిషన్ సర్వే ప్రకారం దేశ వ్యాప్తం గా 281 జిల్లాలు పౌష్ఠికాహాలోపం, రక్తహీనతతో బాధపడుతున్నాయని వెల్లడించారు. అందులో మన రాష్ట్రం లో కర్నూలు జిల్లా ఉండటం బాధాకరమన్నారు. కావున 2022 నాటికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఈ లోపాన్ని అధిగమించి 100శాతం పౌష్ఠికాహారం అందుతున్న జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అలాగే ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు సంయుక్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి రక్తహీనతతో బాధపడుతున్న బాలింతలు, గర్భిణులు, చిన్నపిల్లలను గుర్తించి వారికి సరైన పౌష్ఠికాహారం అందించాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూ చించాలన్నారు. సకాలంలో వ్యాక్సినేషన్, ఐరన్, జింక్ ట్యాబ్లెట్లు ఇవ్వాలన్నారు. డయేరియా, మలేరియా తదితర జబ్బులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను విరించాలన్నారు. ఆహారంతో పాటు స్థానికంగా దొరికే పండ్లు, కూరగాయలు, రాగులు, సజ్జ లు, జొన్నలు, కొర్రలు తదితర తృణధాన్యాలతో పాటు కోడిగుడ్లను తీసుకునేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సమాఖ్య సమావేశాలకు అంగన్‌వాడీ, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలను ఆహ్వానించి గ్రామంలో ఉన్న గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లలు, కౌమార దశలోని బాలికలు, పౌష్ఠికాహార లోపంతో బాధపడుతున్న వారి జాబితా తీసుకుని చర్చించి గ్రామంలోని ప్రతి ఒక్కరికీ ఎస్‌హెచ్‌జీ మహిళలచే అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణను ఆదేశించారు. గ్రామాల్లో వున్న కిరాణ దుకాణాల్లో ఎస్‌హెచ్‌జీ మహిళలు రాగులు, తదితర తృణ ధాన్యాలతో తయారు చేసిన చిరుతిండిని పిల్లలకు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని పీడీ రామకృష్ణను ఆదేశించారు. గ్రామంలో పంచాయతీ ఆధీనంలో ఉన్న 5-10 ఎకరాల్లో ఆకుకూరలను సాగుచేసి అంగన్‌వాడీ కేంద్రాలకు అందేవిధంగా చర్యలు తీసుకోవాలని డీపీఓ పార్వతిని ఆదేశించారు. అలాగే అంటువ్యాధులు ప్రబలకుండా నీటి ట్యాంకులను శుభ్రం చేయించాలన్నారు. రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతి పంచాయతీ ద్వారా రూ. 60కోట్ల విలువైన వంట పాత్రలను అందజేస్తారన్నారు. చిత్తూరు జిల్లాలో వివిధ శాఖలు సంయుక్తంగా పని చేసి వందశాతం విద్యుత్ సౌకర్యం వుండేలా అంగన్‌వాడీలను తీర్చిదిద్దారన్నారు. రాష్ట్రంలో వున్న అంగన్‌వాడీ కేంద్రాలకు ఈ నెలాఖరు లోపు పూర్తిస్థాయిలో వౌలిక వసతులు కల్పించేటట్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా మరో 11వేల అంగన్‌వాడీ భవనాలను నిర్మిస్తున్నామన్నారు. అన్న అమృత హస్తం పథకం కింద 4.5 లక్షల మంది గర్భిణులు, బాలింతలకు వారానికి 6 రోజుల పాటు రూ. 400 కోట్లు ఖర్చు చేసి పౌష్ఠికాహారం అందిస్తున్నామన్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా 85శాతం మంది దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. బాలామృతం పథకంలో ప్రతి నెల 7 నెలల నుంచి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు సుమారు 16 లక్షల మందికి ప్రతి నెల 2.5 కిలోల పౌష్ఠికాహారాన్ని ప్యాకెట్ రూపంలో అందిస్తున్నామన్నారు. వర్క్‌షాపులో జేసీ-2 రామస్వామి, ఐసీడీఎస్ పీడీ జుబేదాబేగం, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ శివహరినాయక్, కేవీకే సైంటిస్టు ధనలక్ష్మి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు వరలక్ష్మి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సీడీపీఓలు, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా 2కె రన్
* 200 మీటర్ల జాతీయ జెండాతో ప్రదర్శన
నంద్యాల, డిసెంబర్ 7 : నంద్యాల పట్టణంలోని గురురాజ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో ఆర్మీ స్పోర్ట్స్‌డే పురస్కరించుకొని 2కె రన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి వద్ద ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో స్పెషల్ కలెక్టర్ సుబ్బారెడ్డి, గురురాజ విద్యాసంస్థల అధినేత దస్తగిరిరెడ్డి, డైరెక్టర్లు షావలిరెడ్డి, వౌలాలిరెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. కాగా పాఠశాల ఆధ్వర్యంలో 200 మీటర్ల జాతీయ జెండాను విద్యార్థులు ఊరేగించారు. నూనెపల్లె ఓవర్ బ్రిడ్జి నుండి ప్రారంభమైన 2కెరన్ ప్రభుత్వ ఆసుపత్రి ఎన్‌జీవో కాలనీ మీదుగా లలితానగర్‌లోని పాఠశాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల్లో జాతీయ భావాన్ని దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం అన్నారు. బాల్యం నుండే విద్యార్థుల్లో ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ అలవడుతుందన్నారు. వీర జవాన్లకు ఆదర్శంగా ప్రతి విద్యార్థి సేవా ధృక్పదాన్ని అలవర్చుకోవాలని కోరారు.