కర్నూల్

కోరం ఉంటేనే ఎంపీపీ ఎన్నికలు :

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోడుమూరు, జనవరి 17: స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగే మండల అధ్యక్షుని (ఎంపీపీ) ఎంపికకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని సర్వం సిద్ధం చేశామని కోడుమూరు ఎన్నికల అధికారి ఆదెయ్య తెలిపారు. ఎన్నిక జరిగే సమయానికి మండలంలోని ఉన్న 19 మంది ఎంపీటీసీల్లో తప్పని సరిగా కోరం ఉంటేనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మండలంలో ఉన్న 19 మంది ఎంపీటీసీల్లో తప్పని సరిగా పది మంది ఎంపీటీసీలు హజరుకావాలని సూచించారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 వరకు ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ముందుగా అధ్యక్ష స్థానంకు పోటీ చేసే వారు నామినేషన్ వేయాల్సి ఉంటుందని, ఆ తరువాత మరో గంటకు నామినేషన్ పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమాలు ముగిసన తరువాత అధ్యక్షుని ఎన్నిక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. ఎన్నికల అధికారులు సూచించిన నిబంధనలను సభ్యులు పాటించాలన్నారు.
గట్టి పోలీసు బందోబస్తు...
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం జరిగే మండల అధ్యక్షుని ఎన్నికను ప్రశాంతంగా జరిగేందుకు గట్టి పోలీసు బందో బస్తును ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్‌కుమార్ తెలిపారు. ఎన్నికల సమయం ముగిసే వరకు కార్యాలయం ఎదుట 144 సెక్షన్ ఉంటుందని, అంతేగాక ఆ ప్రాంతంలో ఇద్దరు సీఐలు, నల్గురు ఎసైలు, భారీగా పోలీసు బందో బస్తును ఏర్పాటు చేస్తున్నామని వెళ్లడించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 9 మంది జైలు శిక్ష
ఎమ్మిగనూరు, జనవరి 17: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన 9 మంది నిందితులకు జైలు శిక్ష పడినట్లు రూరల్ ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపారు. వాహనాలు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుచగా నిందితులు 9మందికి 10 రోజులపాటు జైలు శిక్ష పడినట్లు ఆయన తెలిపారు. ఇందులో నిందితులు మహేష్, రాజు, ఏసు, మద్దిలేటి, సామేల్, చంద్రశేఖర్, పరమేష్, ఉరుకుందు, తిక్కయ్యలు ఉన్నారు.

నాటుసారా బట్టీలు ధ్వంసం
* 192 కర్నాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం
పెద్దకడబూరు, జనవరి 17: మండలంలోని చిన్నకడబూరు గ్రామ శివారులలో ఉన్న నాటుసారా తయారి స్థావరాలపై బుధవారం ఎస్‌ఐ శివాంజల్, ఎక్సైజ్ ఎస్‌ఐ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. రెండు ప్రదేశాలలో సారా తయారి బట్టీలను ధ్వంసం చేశారు. అలాగే 150 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. నౌలేకల్ గ్రామానికి చెందిన గిడ్డయ్య మాధవరం నుంచి 192కర్నాటక మద్యం ప్యాకెట్లతో మోటర్ సైకిల్‌పై వస్తుండగా దాడి చేసి గుడికల్ గ్రామ సమీపంలో పట్టుకున్నారు. అతని నుంచి 192 కర్నాటక మద్యం ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ శివాంజల్ తెలిపారు. చిన్నకడబూరు, చిన్నతుంబళం, కల్లుకుంట గ్రామాలలో నిర్వహించే దేవర సందర్భంగా నాటుసారాను, బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలిస్తున్నట్లు వెల్లడించారు. ఈదాడుల్లో స్థానిక పోలీసులు పాల్గొన్నారు.
ఇరువర్గాలపై కేసు నమోదు
గడివేముల, జనవరి 17: మండల పరిధిలోని పెసరవాయి గ్రామానికి చెందిన ఇరువర్గాలపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, నాగలక్షమ్మ, మరోవర్గానికి చెందిన పామన్న, సామేలు, అరుణకుమారిలపై బైండోవర్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరు ఇంటి వద్ద గోడపారు విషయంలో గొడవ పడుతూ గతంలో రెండు సార్లు కూడా ఘర్షణ పడినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
చోరీ కేసులో దొంగలు అరెస్టు
నంద్యాలటౌన్, జనవరి 17: నంద్యాల పట్టణంలోని టూటౌన్, త్రీటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో, కర్నూలులోని టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో చోరీలకు పాల్పడుతున్న రాజస్తాన్‌కు ఇరువురు దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు. బుధవారం మూడవ పట్టణ పోలీసుస్టేషన్‌లో జరిగిన సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ రాజస్థాన్‌కు చెందిన నరపత్, జితేందర్‌సింగ్‌లు చోరీలకు పాల్పడుతుండేవారని తెలిపారు. వీరిని రైల్వేస్టేషన్ వద్ద సీఐ రాజేంద్ర, శ్రీనివాసులు పట్టుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుంచి బంగారు చైన్లను స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.