కర్నూల్

అవినీతి, అక్రమాలకు పుట్టినిళ్లు టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 18:అధికార టీడీపీ అవినీతి, అక్రమాలకు పుట్టినిల్లు అని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైసీపీ అధ్యక్షుడు బివై రామయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కోర్టు తీర్పు వెలువడక ముందే కర్నూలు కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని టీడీపీ హడావిడి చేస్తుందన్నారు. కార్పొరేషన్ పాలక వర్గం 2010 సెప్టెంబర్‌లో ముగిసిందన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా కార్పొరేషన్ ఎన్నికల గురించి పట్టించుకోకుండా కోర్టు తీర్పుల పేరుతో కాలయాపన చేస్తూ వచ్చిందన్నారు. జనరల్ ఎన్నికలకు కూడా సమయం తక్కువగా ఉండటంతో ఎన్నికల ఖర్చును రాబట్టుకునేందుకు నగరాభివృద్ధి పేరుతో రూ. కోట్లు మంజూరు చేసిందని, అయితే అందులో టీడీపీ నాయకులు కమీషన్లు, ఎన్నికల ఖర్చును దండుకోవటానికే తప్ప అభివృద్ధి కోసం కాదన్నారు. విలువలకు పాతరేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నందు వల్లే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు చేతగానితనం, కేసుల వల్ల కేంద్రాన్ని నిధులు, బడ్జెట్ గురించి గట్టిగా అడగలేకపోతున్నాడని వివరించారు. ఏప్రిల్ 6వ తేదీ లోపు ప్రత్యేక హోదాపై స్పందించకపోతే ఎంపీల చేత రాజీనామా చేయిస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంతో చంద్రబాబుకు దిక్కుతోచక ప్రజలను తప్పుదోవ పట్టించటానికి కర్నూలు కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను తెరమీదకి తెచ్చాడన్నారు. జగన్ పాదయాత్రకు ప్రజల్లో వస్తున్న అనూహ్య స్పందన చూసి చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నామని, ధైర్యం ఉంటే కోర్టు తీర్పుతో పని లేకుండా ఎన్నికలు నిర్వహించాలని సవాల్ విసిరారు.