కర్నూల్

విద్యాభివృద్ధికి ప్రభుత్వం చర్యలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఫిబ్రవరి 18:ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని, అందులో భాగంగానే గ్రంథాలయాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డి తెలిపారు. పట్టణంలోని గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలు, దినపత్రికలు అందిబాటులో వుంటాయని నిరుద్యోగ యువతీ, యువకులు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పట్టణంలో రూ. 23.63 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ఆదివారం ఎమ్మెల్యే బీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బనగానపల్లె శాఖ గ్రంథాలయం ఇప్పటి వరకూ అద్దె భవనంలో అరకొర వసతులతో ఇబ్బందుల మధ్య కొనసాగిందన్నారు. ఈ సమస్య బీసీ రాజారెడ్డి తమ దృష్టికి తీసుకురావడంతో తాము పంచాయతీ కార్యాలయానికి చెందిన స్థలాన్ని కేటాయించడంతో పాటు భవన నిర్మాణానికి నిధుల మంజూరు చేయించి నూతనంగా సొంత భవనాన్ని నిర్మించామన్నారు. ఈ గ్రంథాలయం పాతబస్టాండ్‌కు సమీపంలో ప్రశాంత వాతావరణంలో వుందని, ఇక్కడికి వచ్చేవారు ఏకాగ్రతతో పఠనం సాగించి వారి లక్ష్యాలను అందుకోవాలన్నారు. గ్రంథాలయంలో స్ర్తి, పురుషులకు ప్రత్యేక గదులు నిర్మించారని తెలిపారు. గ్రంథాలయానికి తన సొంత నిధులు రూ. లక్ష వ్యయంతో అవసరమైన టేబుళ్లు, పుస్తకాలు అందజేయడంతో పాటు ప్రహరీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే బీసీ జనార్ధనరెడ్డిని, మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డిని ఘనంగా సత్కరించారు.