కర్నూల్

రైల్వే జోన్ కోసం 48 గంటల నిరాహార దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 18:గుంతకల్లులో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ నెల 19,20 తేదీల్లో అనంతపురంలో చేపట్టనున్న 48గంటల నిరాహార దీక్షను జయప్రదం చేయాలని కర్నూలు హైకోర్టు సాధన సమితి జేఏసీ నేతలు కె.బలరాం, దేవపూజ ధనుంజయాచారి, కోనేటి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. స్థానిక బి.క్యాంపులోని బీసీ భవన్‌లో ఆదివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ గుంతకల్లును ఏపీ రైల్వేజోన్‌గా చేయాలని, ఇక్కడ అన్ని రకాల వసతులు ఉన్నాయన్నారు. గుంతకల్లు రైల్వే జంక్షన్‌కు ఇప్పటికే రైల్వే భూమి 760 ఎకరాలు ఉందని, ఇంకా భూమి అవసరమైతే చాలా చౌకగా లభిస్తుందని వారు సూచించారు. ఇప్పటికే జంక్షన్‌గా అధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న గుంతకల్లు రైల్వే డివిజన్‌ను జోన్‌గా చేయడం వల్ల ఏపీకి చాలా ఉపయోగపడుతుందన్నారు. ఓడిషా ప్రభుత్వం ఇటీవలే కేంద్ర ప్రభుత్వానికి తమ రాష్ట్ర జోన్ నుంచి విశాఖ(వాల్తేరు) డివిజన్‌ను వదులుకోలేమని లేఖ రాసిందని తెలిపారు. ఇకనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి గుంతకల్లును రైల్వేజోన్‌గా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటకే కర్నూలులో కేంద్రం ఆమోదించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ద్వారా మన జోన్ రైళ్లకు సంబంధించిన బోగీల మరమ్మతులు చేసుకుని నవ్యాంధ్రకు అద్భుతమైన రైల్వే సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందించవచ్చని తెలిపారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా రైల్వే జోన్ అంశంపై ఆందోళన చేశామని తెలిపారు. కర్నూలులో హైకోర్టు, కడప ఉక్కు కర్మాగారం, చితూర్తు ఐటీ హబ్ ఏర్పాటు చేసి సీమకు న్యాయం చేయాలని కోరారు.
న్యాయవాదుల దీక్షలకు వైద్యుల సంఘీభావం
కర్నూలు ఓల్డ్‌సిటి, ఫిబ్రవరి 18:రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 29వ రోజుకు చేరుకున్నాయి. న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలకు ఆదివారం వైద్యుల జేఏసీ సంఘీభావం తెలిపింది. సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకూ తమ పోరాటం ఆగదని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు వి.నాగలక్ష్మీదేవి, కార్యదర్శి బాబుసాహేబ్ స్పష్టం చేశారు. అనంతరం వైద్యుల జేఏసీ సభ్యులు శంకర్‌శర్మ, బాల మద్దయ్య, జి.ప్రవీణ్, శివశంకర్‌రెడ్డి, రామ్మోహన్, రామ్‌నాయక్, రామశివనాయక్, రామచంద్రనాయుడు మాట్లాడుతూ సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని గత 29 రోజులుగా న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం దారుణమన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామన్నారు.