కర్నూల్

అర్హులందరికీ సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 18: అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలు వర్థించేలా కృషి చేస్తామని పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆదివారం నియోజకవర్గ నాయకులు, ముఖ్య కార్యకర్తల సపమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు వర్థించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అందులో భాగంగా పెన్షన్‌లతో పాటు ప్రభుత్వ గృహాలు తదితర వాటిని వర్ధిస్తామన్నారు. ప్రతి నెల 9న గ్రామస్థాయిలో, 14న మండల స్థాయిలో, 18న నియోజకవర్గ స్థాయిలో సమావేశం నిర్వహించుకుని గ్రామ స్థాయి నుండి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశలో కృషి చేస్తామన్నారు.