కర్నూల్

బాబుకు ప్రత్యేక హోదాపై విశ్వాసం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, ఫిబ్రవరి 20:ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై విశ్వాసం లేదని, ప్యాకేజీ ఇచ్చి, అసెంబ్లీ సీట్లు పెంచితే చాలని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. నగరంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు మంగళవారం డీసీసీ అధ్యక్షుడు లక్ష్మిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఆంధ్రుల ఆత్మగౌరవ దీక్ష కార్యక్రమంలో రఘువీరా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విభజనతో రాష్ట్రం రూ. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని, ప్రత్యేక హోదా వస్తే బాగుంటుందని, అందుకోసం అసెంబ్లీలో 2సార్లు తీర్మానం చేశారని గుర్తుచేశారు. అయితే కేసుల కారణంగా సీఎం చంద్రబాబు కేంద్రం చేతిలో కీలుబొమ్మగా మారి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని, హోదా వల్ల తనకు, మంత్రి వర్గానికి దోచుకోవటానికి అవకాశం ఉండదని భావించి ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతూ ప్రత్యేక హోదా ఏమన్నా సంజీవనా అని ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. 2014 ఫిబ్రవరి 20వ తేదీ పార్లమెంట్‌లో అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించి, వారి అభిప్రాయం తెలపాలని కోరగా ఆ సమయంలో ఎవరూ నోరు మెదపలేదన్నారు. బీజేపీతో పాటు టీడీపీ, వైసీపీ, తదితర పార్టీల నాయకులు వౌనం వహించడంతో రాష్ట్రాన్ని విభజిస్తూ ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి రూ. 24,350కోట్లు, లోటు బడ్జెట్‌ను పూర్తి చేసేందుకు రూ. 16వేల కోట్లు కేటాయించారని వెల్లడించారు. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ సైతం తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు సరిపోదని, పదేళ్లు కావాలని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చామని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టాక విస్మరించారని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మార్చి 2వ తేదీ జాతీయ రహదారుల దిగ్బంధం, 6,7 తేదీల్లో ఢిల్లీలో దీక్షలు చేపట్టి 8వ తేదీ పార్లమెంట్ ముట్టడి కార్యక్రమం చేపడుతామని స్పష్టం చేశారు. దేశానికి దశ, దిశ నిర్ణయించే శక్తి కాంగ్రెస్‌పార్టీకి మాత్రమే ఉందని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి, రాహుల్‌గాంధీ ప్రధాని అవుతారని, మొదటి సంతకం ప్రత్యేక హోదా ఫైలు పెట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలు చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో ప్రజలు రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ అడ్డుగోలుగా చీల్చిందన్న అక్కసుతో ఓట్లు వేయకుండా ఓడించారని, అయినా బాధలేదని ప్రజల జీవితాలు నాశనం కాకుడదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, గ్రామాల్లో తాగునీటి కోసం ప్రజలు అల్లాడుతన్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీనే ప్రజలకు నిరంతరం అండగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని, ఖచ్చితంగా 2019 ఎన్నికల్లో అధికారం మాదే అని ధీమా వ్యక్తం చేశారు.
అత్యున్నత ప్రమాణాలతో మెగా సీడ్ పార్కు
* వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్టి
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఫిబ్రవరి 20:ప్రపంచం గర్వించేస్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో మెగాసీడ్ పార్కు నిర్మిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. మెగాసీడ్ పార్కు పురోగతిపై మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సోమిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా అయోవా యూనివర్శిటీ సంయక్తంగా జిల్లాలోని తంగడంచెలో మోగాసీడ్ పార్కు నిర్మిస్తున్నారన్నారు. 650 ఎకరాల్లో మేలైన విత్తనాన్ని ఉత్పత్తి చేసి రాష్ట్రంతో పాటు ప్రపంచ దేశాలకు అందించే దిశగా గత ఏడాది అక్టోబర్‌లో సీఎం శంకుస్థాపన చేశారన్నారు. అయోవా వర్శిటీ సాంకేతిక పరిజ్ఞానంతో మేలైన విత్తనోత్పత్తి చేసి రైతులకు అందించాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నామన్నారు. సీడ్ పార్కులో వౌలిక వసతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఇందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో మొదటి విడతగా రూ. 190 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. దేశంలో ఉన్న విత్తన కంపెనీల్లో 50 శాతానికి పైగా విత్తన కంపెనీలు తంగడంచెకు వచ్చే అవకాశం ఉందన్నారు. కందులు, మినుములు, శెనగలను మార్క్‌ఫెడ్, ఆయిల్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయడాన్ని సోమవారం నుంచే ప్రారంభించామన్నారు. కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ మెగాసీడ్ పార్కు ప్రహరీ, ముళ్లతీగ ఏర్పాటు, అంతర్గత రోడ్లు నిర్మించేందుకు అయ్యే ఖర్చుకు సంబంధించి వారం లోపు నివేదిక అందించాలని పంచాయతీరాజ్ ఎస్‌ఈని ఆదేశించారు. మెగాసీడ్ పార్కుకు అవసరమేయ్య రోడ్లు అంచనా రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 220 కేవీ విద్యుత్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇవ్వాలని ట్రాన్స్‌కో ఎస్‌ఈను ఆదేశించారు. ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణానికి ప్రతిపాదనలు ఇవ్వాలని కోరారు.