కర్నూల్

అధినేత హెచ్చరించినా సమసిపోని విభేదాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఫిబ్రవరి 20:‘‘అంతా సమన్వయంతో పని చేయాలి.. విజయమే మన లక్ష్యం కావాలి.. సమస్యలు, మనస్పర్థలు పక్కన పెట్టి పని చేయండి.. పద్ధతి మార్చుకోకుంటే కఠిన చర్యలకు వెనుకాడను’’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పిన మాటలు, చేసిన హెచ్చరికలు జిల్లాలో ఏవీ పని చేయడం లేదని ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే తెలుస్తోంది. నాయకులంతా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని కర్నూలు, ఆళ్లగడ్డ, నంద్యాల, కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో ఆ పార్టీకి బహు నాయకత్వ సమస్య ఇరకాటంగా మారింది. నాయకుల మధ్య ఉన్న విభేదాలతో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందన్న కార్యకర్తల ఆందోళన ఏ మాత్రం తగ్గడం లేదు. నాయకుల మధ్య స్పర్థల పరిష్కారానికి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జనార్ధన్‌లతో వేసిన కమిటీ ఇంత వరకూ విభేదాల పరిష్కారానికి సమావేశం కాకపోవడంతో నాయకుల తీరు గతంలో మాదిరే కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. కర్నూలు నగర పాలక సంస్థ ఎన్నికలు ఏ క్షణానైనా నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ సిద్ధపడుతోందని పార్టీ విజయం కోసం అంతా కలిసికట్టుగా పని చేయాలని అధినేత చంద్రబాబు ఆదేశించిన విషయం తెలిసిందే. ముందు పార్టీ నేతలు కలిసి పని చేయడానికి సిద్ధపడాలని సూచించిన ఆయన ఆ తరువాత పురపాలక శాఖ మంత్రి నారాయణను కర్నూలుకు పంపి నగర సమస్యలపై తెలుసుకున్నారు. ఆ తరువాత తాను స్వయంగా సమీక్షించి రూ. 536కోట్ల నిధుల విడుదలకు అంగీకరించారు. ఇక నగరంలో విజయం కోసం పని చేయాల్సిన నాయకులు ప్రస్తుతానికి ఇద్దరూ వేర్వేరుగా కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఎంపీ టీజీ వెంకటేష్, ఎమ్మెల్యే ఎస్వీ మోహనరెడ్డి తమ వర్గాలతో విడివిడిగా మాట్లాడుతూ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో మంత్రి అఖిలప్రియపై పార్టీ నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. ఆమె కారణంగా తాము పడుతున్న ఇబ్బందులపై అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తానని బహిరంగ ప్రకటన కూడా చేశారు. ఇక కోడుమూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మణిగాంధీ, నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్ధన్‌రెడ్డిల మధ్య సయోధ్య కుదిరే అవకాశం లేనట్లు కనిపిస్తోంది. విష్ణుతో కలిసి పని చేయాలని ఒత్తిడి తీసుకొస్తే చివరకు తన ఎమ్మెల్యే పదవిని సైతం వదులుకోవడానికైనా సిద్ధమేనంటూ ఆయన తన మనసులో మాటను కార్యకర్తలకు చెప్పేశారు. నంద్యాల నియోజకవర్గంలో శాసన మండలి చైర్మన్ ఫరూక్, ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి వర్గాల మధ్య విభేదాలు ముదిరే పరిస్థితికి వచ్చినట్లు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి ఎంపీ బుట్టా రేణుక ఎమ్మెల్యేగా పోటీ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుత ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. ఆమె బహిరంగంగా తాను ఎమ్మిగనూరు నుంచి పోటీ చేస్తానని ఎక్కడా చెప్పకపోయినా ఆమె వర్గంతో సమావేశమైన సమయంలో తన మనసులో మాట చెబుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జిల్లాలో పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్న నియోజకవర్గాల్లోనే నేతల మధ్య విభేదాలు ఉండటం పార్టీని ఇరుకునపెడుతోంది. అధినేత చంద్రబాబు నియమించిన త్రిసభ్య కమిటీ వీలైనంత త్వరగా సమావేశం నిర్వహించి పార్టీ నేతలతో చర్చించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. త్రిసభ్య కమిటీ కృషికి ఫలితం లేనిపక్షంలో పార్టీ అధినేత చంద్రబాబు తగిన చర్యలు తీసుకోవాలని కార్యకర్తలు విన్నవిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం కోసం అధినేత ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని పార్టీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
నల్లమలలో పెద్ద పులుల సంచారం...
* ప్రజలు జాగ్రత్త ఉండాలి * డీఎఫ్‌ఓ శివప్రసాద్
చాగలమర్రి, ఫిబ్రవరి 20: నల్లమల అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులుల సంచరిస్తున్నాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని నంద్యాల డివిజన్ అటవీ శాఖ అధికారి శివ ప్రసాద్ తెలిపారు. మండలంలోని పెద్దవంగలి అటవీ బీట్ పరిధిలో చేపట్టిన కందకాల తవ్వకాల పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా డీఎఫ్‌ఓ మాట్లాడుతూ రుద్రవరం రేంజ్ పరిధిలో నాలుగు పెద్ద పులులు తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామన్నారు. అహోబిలం నుండి రుద్రవరం వరకు ఈ పులులు తిరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా అహోబిలం ప్రాంతంలోని పావన నరసింహస్వామి ఆలయం వద్దకు భక్తులు సాయంత్రం 6 గంటలు దాటితే వెళ్లరాదని ఆయన కోరారు. నంద్యాల అటవీ ప్రాంతంలో 15 పెద్ద పులులు ఉన్నట్లు గుర్తించామన్నారు. నల్లమల అటవీ సంపదను కాపాడుటలో భాగంగా రూ.1.10 కోట్లతో కందకాలను తవ్విస్తున్నామన్నారు. రుద్రవరం రేంజ్ పరిధిలో 45 కి.మీ.ల దూరంలో ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణా బాగా తగ్గిందని, నిఘా తనిఖీలు కొనసాగిస్తున్నామన్నారు. మూడు బేస్ క్యాంపులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అటవీ ప్రాంతంలో 45 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, 22 వేల హెక్టార్లలోని ఎర్రచందనం చెట్లకు జీయో ట్యాగింగ్ చేశామని తెలిపారు. పంట పొలల్లో సంచరించే కృష్ణజింకలకు ఎలాంటి హాని కలిగించరాదని, పంటలు నష్టపరిస్తే పరిహారం చెల్లింపుకు చర్యలు తీసుకుంటామన్నారు.