కర్నూల్

వైభవంగా అమ్మవారికి క్షీరాభిషేకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నంద్యాల టౌన్, ఫిబ్రవరి 23: పట్టణంలోని శ్రీ జగజ్జనని ఆలయ ప్రతిష్ఠ నవమ వార్షికోత్సవాల్లో భాగంగా అమ్మవారికి పెసరవాయి సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునుండే అమ్మవారికి మహిళలు తమ ఇళ్ల వద్ద నుండి ఆవుపాలను తలపై పెట్టుకొని ఆలయానికి చేరుకున్నారు. క్యూలైన్లలో వేచివుండి అమ్మవారికి క్షీరాభిషేకం చేశారు. మహిళలు పెద్ద ఎత్తున రావడంతో క్యూలైన్ ఆలయం బయట ఒక కిలో మీటరు వరకు అమ్మవారి దర్శనం కోసం వేచివున్నారు. ఈసందర్భంగా ఆలయ నిర్వాహకులు పుల్లయ్య మాట్లాడుతూ ఈ ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయని, రెండవ రోజు అమ్మవారికి ఆవుపాలతో క్షీరాభిషేకం నిర్వహించడం జరిగిందని చెప్పారు. శనివారం అమ్మవారికి వివిధ రకాల పండ్లతో అలంకరణ చేయడం జరుగుతుందని తెలిపారు.

మండిగిరి నీటి పథకం ఏప్రిల్‌లో పూర్తి
ఆదోని, ఫిబ్రవరి 23: రూ.12కోట్లతో నిర్మాణం సాగుతున్న మండిగిరి నీటి పథకం ఏప్రిల్ నెలలో పూర్తి అవుతుందని గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఆదోని డివిజన్ డీఇ ఏఎస్‌ఏ రామస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ మండిగిరి నీటి పథకం పూర్తి అయితే దిబ్బనకల్, సాదాపురం, మండిగిరి, విరుపాపురం, తంగరడోణ గ్రామాలకు నీటి ఎద్దడి తొలగిపోతుందన్నారు. మండిగిరి నీటి పథకం ద్వారా ఈ గ్రామాలకు నీటి సరఫరా అవుతుందన్నారు. నాబార్డు నిధులతో డివిజన్‌లోని కలుగొట్ల, టి.సల్లకుళ్ళూరు, సోగనూరు, పార్లపల్లె, గంజహళ్ళి, బి. అగ్రహారం, బైలుప్పుల, ముగతి, మాచాపురం, నందవరం గ్రామాల్లో ప్రజలకు అవసరమైన తాగునీటి పథకాలను నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నాబార్డు రూ.2కోట్ల 58లక్షల నిధులను మంజూరు చేసిందని, ఆ నిధులతో తాగునీటి పథకాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆదోని డివిజన్‌లోని ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో నీటి ఎద్దడి రాకుండా వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టామన్నారు. ఇందులో భాగంగానే డివిజన్‌లో ఉన్న 22 నీటి ట్యాంకులో పూర్తిస్థాయిలో నింపివేసినట్లు తెలిపారు. మే నెలలో తుంగభద్ర దిగువ కాలువకు మళ్లీ నీరు వస్తే నీటితో ట్యాంకులను నింపడం జరుగుతుందన్నారు. వేసవిలోనీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిలువ చేసిన 22 నీటి ట్యాంకుల ద్వారా 237 గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని ఆయన తెలిపారు.