కర్నూల్

వనౌషధి మొక్కల పెంపక కేంద్రం ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఫిబ్రవరి 23: బనగానపల్లెలో ఆయుర్వేద వైద్యశాల అభివృద్ధితో పాటు ఆయుర్వేద మొక్కల నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తగు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నట్లు రాష్ట్ర ఆయుర్వేద వైద్య కమిషనర్ పీఎస్. శోభ వెల్లడించారు. కమిషనర్ ఎమ్మెల్యే బీసీ జనార్థనరెడ్డితో పాటు స్థానిక స్వామి హంసానంద సరస్వతీ ఆయుర్వేద వైద్యశాలను తనిఖీ చేశారు. ఈ వైద్యశాలకు గతంలో స్వామి హంసానంద సరస్వతీ ఎంతో విలువైన 9 ఎకరాల స్థలాన్ని ఆయుర్వేద వైద్యశాల, వనౌషధి మొక్కల పెంపక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ఇచ్చారని కమిషనర్ తెలిపారు. ఇప్పటికే ఇక్కడ 10 పడకల వైద్యశాల వుందని, ఇందుకు తగినంత సిబ్బంది పోస్టుల మంజూరు కూడా వుందని, అయితే వైద్యశాల గదులు శిథిలావస్థకు చేరుకున్నాయన్నారు. ఈ వైద్యశాల గదులను పడగొట్టి నూతన గదులను నిర్మింప చేయడం, అలాగే వనౌషధి మొక్కల నర్సరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిధులు కేటాయింపు చేస్తామని తెలిపారు. ఈ స్థల ట్రస్టులతో కోర్టులో వివాదం వుందని ఎమ్మెల్యే తెలుపగా దానిపై దృష్టిసారించి త్వరగా కేసును పరిష్కారం చేసేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని అన్నారు. తాము అనుకున్న పనులు జరిపేందుకు కనీసం 60 లక్షల రూపాయలు నిధులు అవసరం అవుతాయని ఈ నిధుల సమకూర్పు కూడా కష్టం కాబోదన్నారు. నర్సరీ మొక్కల అభివృద్ధికి రవిశర్మ అను ప్రత్యేక అధికారిని కూడా తమతో పాటు వచ్చారని తెలిపారు. భవనాల నిర్మాణానికి ఏడాది సమయం పడుతుందని, ఈ లోపు వనౌషధి మొక్కల పెంపకంపై దృష్టిసారించాల్సి వుంటుందన్నారు. సిబ్బంది కొరత, మందుల కొరత విలేఖర్లు కమిషనర్ దృష్టికి తీసుకురాగా పోస్టుల మంజూరీ వుందని, అందుకు ఇబ్బందులు వుండవన్నారు. మందులు ఈ ప్రాంతంలో అవసరాన్ని బట్టి డాక్టర్లు పంపిన ప్రతిపాదనల ప్రకారం మందుల సరఫరా అవుతాయని, ఇప్పటి వరకు సిబ్బంది సరిగా పట్టించుకోలేదన్నారు. ఆయుర్వేద వైద్యశాల, యునాని వైద్యశాలల్లో సిబ్బంది సమయపాలన పాటించలేదని, సేవలు అంతంతమాత్రంగా వున్నాయని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రానున్న కాలంలో అన్ని చర్యలు తాము తీసుకుంటామని ఆమె తెలిపారు.
ఆయుర్వే కళాకాశాల ఏర్పాటు చేయండి
బనగానపల్లెలో స్వామి హంసానంద సరస్వతీ ప్రభుత్వానికి 9 ఎకరాలకుపై స్థలాన్ని అందజేశారని ఇందులో వైద్యశాల, వనౌషధి కేంద్రంతోపాటు ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలని కమిషనర్ శోభను ప్రజల తరపున ఎమ్మెల్యే బీసీ కోరారు. వైద్యశాల-కమిటీ సభ్యుల మధ్య కోర్టు కేసు నడుస్తోందని, దీనిని చర్చల ద్వారా త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని, అందుకు తమవంతు సహకారం అందిస్తామని, ఈ రోజు కమిటీ సభ్యులతో మాట్లాడి రప్పించామని అన్నారు.