కర్నూల్

తాత్కాలిక డిప్యూటీ డీఈఓల తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని, ఫిబ్రవరి 23: హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి రాష్ట్రప్రభుత్వం తాత్కలిక డీఈఓలను,గ్రేడ్ 1ప్రధానోపాధ్యాయులను తొలగించింది. తొలగించిన వారిలో ఆదోని డివిజన్ ఉప విద్యాధికారి ఈరన్న, కర్నూలు డివిజన్ ఉప విద్యాధికారి లక్ష్మణ్‌రావు, సుండేపల్లి జడ్పీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయుల పోస్టుల్లో రాష్ట్ర పాఠశాలల ఉపాధ్యాయుల చేతనే ఆ పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ రాష్ట్ర పాఠశాలల ఉపాధ్యాయులు హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు గతంలో ఉన్న విధంగానే ఉండాలని, తాత్కాలిక తీర్పును ఇచ్చింది. ఇంకా సుప్రీంకోర్టులో రాష్ట్ర పాఠశాలల ఉపాధ్యాయులు వేసిన కేసుపై విచారణ పూర్తి కాలేదు. అయితే ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అలాగే పాఠశాలల పర్యవేక్షణ, ఇతర కార్యక్రమాల నిర్వహణ కోసం తాత్కలికంగా ఖాళీగా ఉన్న డీప్యూటీ డీఈఓ, అలాగే గ్రేడ్ 1ప్రధానోపాధ్యాయుల పోస్టుల్లో జడ్పీ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను నియమించింది. ఇందులో భాగంగానే మంత్రాలయం ఎంఈఓగా ఈరన్నను ఆదోని డివిజన్ ఉప విద్యాధికారిగా, ఆస్పరి ఎంఈఓ ఉన్నగా లక్ష్మణ్‌రావును కర్నూలు డిప్యూటీ డీఈఓగా తాత్కలికంగా నియమించింది. అలాగే కర్నూలు కింగ్ మార్కెట్ వద్ద ఉన్న జీజీహెచ్ స్కూల్ ఉపాధ్యాయురాలుప్రభావతిని గ్రేడ్ 1 ప్రధానోపాధ్యాయురాలుగా సుండుపల్లి జడ్పీ హైస్కూల్‌కు నియమించింది. ఈ తాత్కలిక నియమకాలపై ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం దిక్కరించిందని హైకోర్టులో కేసు వేశారు. కేసు విచారించిన న్యాయమూర్తులు హైకోర్టు ఉత్తర్వులను అతిక్రమించరాదన్నారు. గతంలో ఉన్న విధానాన్ని మార్పు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు శుక్రవారం జిల్లా విద్యాధికారి తాహెరా సుల్తానా తాత్కాలికంగా డిప్యూటీ డీఈఓలుగా విధులను నిర్వహిస్తున్న ఆదోని, కర్నూలు డీపీటీ డీఈఓలుగా ఉన్న ఈరన్న, లక్ష్మణ్‌రావుతోపాటు గ్రేడ్ 1 ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్న ప్రభావతిని కూడా ఈపోస్టుల నుండి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులను జారీ చేసింది. మరో నాలుగు రోజుల తరువాత ఈ అంశంపై పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. హైకోర్టు ఈకేసులో 9వ తేదీ తరువాత పూర్తి ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. అంత వరకు డీప్యూటీ డీఈఓలు పోస్టుల వ్యవహారం ఖాళీగానే కొనసాగుతుంది. కొత్తవారిని నియమిస్తారో లేదో వేచి చూడాలి. శుక్రవారం ఆదోని డిప్యూటీ విద్యాధికారి ఈరన్నకు జిల్లా విద్యాశాఖ అధికారుల నుంచి ఈమేరకు ఉత్తర్వులు అందాయి.
ప్రహ్లాదవరదునికి యోగానృసింహ గరుడ విమానసేవ
* ఎగువలో శేషవాహనంపై కొలువుదీరిన శ్రీ జ్వాలా నరసింహుడు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 23: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో బ్రహ్మోత్సవాలు 46వ పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఐదవ రోజైన శుక్రవారం దిగువ అహోబిలంలో శ్రీ ప్రహ్లాద వరదుడు, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పట్టువస్త్రాలు, పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి ఆలయ ఈఓ కామేశ్వరమ్మ ఆధ్వర్యంలో ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ పూజలు నిర్వహించారు. అనంతరం యోగా నృసింహ గరుడ విమానంలో కొలువుంచి రామానుజాచార్యుల ఆలయం వద్దకు సాంప్రదాయం ప్రకారం వెళ్లి వేదపండితులు గోష్ఠి నిర్వహించిన అనంతరం అహోబిల మాఢ వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించి మఠం వద్దకు తీసుకెళ్లారు. అక్కడ 46వ జియ్యర్ గారుడ విమానంలో కొలువు దీరిన స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి బొల్లవరానికి చెందిన కందుల లక్ష్మిదేవమ్మ, రాజగోపాల్‌రెడ్డిలు ఉభయదారులుగా వ్యవహరించారు. దేవాలయంలో స్వామి కొలువైన సన్నిధిపేరు విమానం. ప్రతి ఒక్క వైష్ణవ క్షేత్రంలో విమానానికి ఒక్కో పేరుంటుంది. శ్రీ అహోబిల క్షేత్రంలో వున్న విమానానికి గారుడ విమానమని పేరు. హిరణ్యకశ్యపుని సంహారానంతరం భగవంతుడు ప్రహ్లాదునికి రాజనీతిశాస్త్రం, యోగాభ్యాసం నేర్పించాడు. ఈ సందర్భానికి నిదర్శనముగా శ్రీ గారుడ విమానము నందు యోగాభ్యాసం నేర్పిన నృసింహస్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. మధ్యహ్నం ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు పంచామృతాభిషేకం నిర్వహించారు.
ఎగువ అహోబిలంలో: ఎగువ అహోబిలంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉత్సవమూర్తులైన శ్రీ జ్వాలా నరసింహ స్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి శేషవాహనంపై ఆశీనులను చేసి అర్చకులు కిడాంబి లక్ష్మీనరసింహాచార్యులు పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరుకు చెందిన డిప్యూటీ తహశీల్దార్ శ్రీమతి వేల్పుల మంజులాదేవి, రాజసింహ నరేంద్రలు ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారు.

నేడు అహోబిలంలో: ఎగువ అహోబిలంలో శనివారం రాత్రి శరభవాహనంపై స్వామి కొలువు దీరి భక్తలుకు దర్శనమిస్తారని ఈఓ కామేశ్వరమ్మ తెలిపారు. దిగుల అహోబిలంలో ఉదయం శేషవాహనంపై. రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్శనమిస్తారని తెలిపారు.