కర్నూల్

2 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు అర్బన్, ఏప్రిల్ 30:నగర పాలక సంస్థ, జిల్లా క్రీడా సంస్థ, జిల్లా ఒలింపిక్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని పాఠశాల విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేసేందుకు వేసవిలో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. నగరంలోని 75 ప్రాంతాల్లో 19 క్రీడాంశాల్లో ఈ శిబిరాలను మే 2 నుంచి 31వ తేదీ వరకూ నిర్వహించేందుకు శిక్షకులు సిద్ధమయ్యారు. ఈ శిబిరాలను మూడు క్యాటగిరీలుగా విభజించారు. ఇందులో కేటగిరి-ఎ వారికి కిట్స్, గౌరవ వేతనం, క్రీడా పరికరాలు, కేటగిరి-బి వారి కిట్స్, గౌరవ వేతనం, కేటగిరి-సి వారికి కేవలం కిట్స్ ఇస్తారు. రైఫిల్ షూటింగ్, ఆర్చరీ, లాన్ టెన్నిస్, టెన్నీకాయిట్, అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, క్యారమ్స్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, హాకీ, కరాటే, సెపక్‌తక్రా, తైక్వాండో, త్రోబాల్, వాలీబాల్, ఉషూ, వెయిట్ లిఫ్టింగ్, యోగా క్రీడాంశాల్లో మొత్తం 75 శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా శిబిరాల నిర్వహణకు నగర పాలక సంస్థ రూ. 4 లక్షలు మంజూరు చేసినట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సత్యనారాయణ తెలిపారు. క్రీడా పరికరాలు 2వ తేదీ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తామన్నారు.