కర్నూల్

మినుముల కొనుగోలు వాయిదా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆళ్లగడ్డ, మార్చి 22: ఆళ్లగడ్డ మార్కెట్‌యార్డులో మినుముల కొనుగోళ్లు గురువారం నుంచి ప్రారంభమవుతాయన్న రైతుల ఆశలను మార్క్‌ఫెడ్ అధికారులు నీరుగార్చారు. దీంతో మినుము కొనుగోళ్ల కోసం ఎంతగానో ఎదురుచూసిన రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆళ్లగడ్డ మార్కెట్ యార్డులో గురువారం నుంచి మినుములు కొనుగోలు చేస్తారని మార్క్‌ఫెడ్ అధికారులు ప్రకటించడంతో రైతులు ఎంతో ఓర్పుతో గత 3 రోజులుగా గంటల తరబడి అధికారుల చుట్టూ తిరిగి పర్మిట్లు తీసుకున్నారు. తీరా గురువారం మినుములు మార్కెట్‌యార్డుకు తీసుకుని రావాలని అనుకుంటున్న తరుణంలో చావుకబురు చల్లగా చెప్పిన చందంగా గురువారం నుంచి మినుములు కొనుగోలు చేయడం లేదతని ఈ నెల 26వ తేదీ నుంచి 3 రోజుల పాటు వ్యవసాయాధికారుల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాలు పొందిన రైతులకు టోకన్లు ఇచ్చి అనంతరం కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ అధికారులు స్పష్టం చేశారు. కాగా ఆళ్లగడ్డ మార్కెట్ యార్డు వద్ద రైతుల నుంచి 8 వేల క్వింటాళ్లు మినుములు కొనుగోలు చేసేందుకు లక్ష్యం కాగా ఇప్పటి వరకూ గత 3 రోజులుగా ఇచ్చిన టోకన్ల ప్రకారం చూస్తే దాదాపు 50 వేల క్వింటాళ్లు మినుములు ఉన్నట్లు తెలిసింది. అయితే గత డిసెంబర్‌లో మినుములు కొనుగోలు కేంద్రాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. కానీ కేవలం ఒక్కరోజు కొనుగోలు చేసి మరుసటిరోజే కొనుగోలు నిలిపివేశారు. అయితే ఈ సారి అధికారులు ఒక్కరోజే కొనుగోలు చేసి నిలిపివేస్తారా లేదా పూర్తిస్ధాయిలో కొనుగోలు చేస్తారా అన్న ప్రశ్నలతో మినుము రైతులు ఆందోళన చెందుతున్నారు. మినుముల కొనుగోలు జాప్యంపై ఈ నెల 26వ తేదీ మార్కెట్‌యార్డు వద్ద రైతులు ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు.
టెక్నాలజీని తెలుసుకునేందుకే రైతుల జీపుయాత్ర
* జెండా ఊపీ ప్రారంభించిన కలెక్టర్
కర్నూలు, మార్చి 22:అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ సౌకర్యాల గురించి తెలుసుకునేందుకు జిల్లాలోని ఉద్యాన రైతులు బెంగళూరు, హోసూరు ప్రాంతాలకు గురువారం బయల్దేరిరి వెళ్లారు. ఈ మేరకు కలెక్టర్ సత్యనారాయణ వారి వాహనం ముందు జెండా ఊపీ యాత్రను ప్రారంభించారు. జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఆత్మకూరు, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల, అవుకు, బేతంచెర్ల, కొలిమిగుంట్ల మండలాల పరిధిలోని ఉద్యాన రైతులు పాలీహౌస్‌లు, షెడ్‌నెట్‌లను సందర్శిస్తారన్నారు. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరు, హోసూరు ప్రాంతాలను సందర్శించి అక్కడి టెక్నాలజీని తెలుసుకునేందుకు వెళ్తున్నారని ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల ఉద్యాన సహాయ సంచాలకులు రమణ, నందికొట్కూరు, పాణ్యం, నంద్యాల, ఆళ్లగడ్డ ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.