కర్నూల్

రైతులకు ఈ-పాస్ పుస్తకమే ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉయ్యాలవాడ, మార్చి 22:రైతులు తమ పొలాలకు సంబంధించి పట్టాదారు పాసుపుస్తకం కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ-పాస్ పుస్తకమే అందజేయాలని డిప్యూటీ కలెక్టర్ సత్యనారాయణ రెవెన్యూ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. ఆయన గురువారం మండల పరిధిలోని అల్లూరు గ్రామంలో వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కార్యాలయం చేరుకుని సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన మీ కోసంలో అల్లూరు గ్రామానికి చెందిన కోగిల వెంగన్న చేసిన ఫిర్యాదుతో కలెక్టర్ ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలాన్ని పరిశీలించామన్నారు. ఈ నివేదికను కలెక్టర్‌కు నివేదిస్తామన్నారు. ఆర్‌ఎస్‌ఆర్, అడంగల్, 1-బిలలో రైతుల పేర్లు నమోదు చేసేటప్పుడు ఒకేలాగా వుండాలని, పేరులో తేడా లేకుండా రికార్డులు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో తహశీల్దార్ మోసేజ్‌ప్రసన్న, డిప్యూటీ తహశీల్దార్ బ్రహ్మయ్య, సీనియర్ అసిస్టెంట్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.
రాబోయే 48 గంటల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు
* కలెక్టర్ సత్యనారాయణ
కర్నూలు, మార్చి 22:రాబోయే 48 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసిందని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ గురువారం తెలిపారు. కావున ప్రజలు ఎండ తీవ్రతను ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని లేకపోతే వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయన్నారు. డీఆర్‌డీఏ ద్వారా 822 చంద్రన్న చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిని స్వయం సహాయక సంఘాల ద్వారా నిర్వహిస్తూ మజ్జిగ, చల్లని నీరు అందిస్తున్నారన్నారు. అంతేకాక అన్ని గ్రామ పంచాయతీల్లో ముఖ్య కూడళ్లలో సర్పంచ్‌ల ద్వారా 667 చలివేంద్రాలు, వివిధ సంస్థల ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకూ 2028 చలివేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.