కర్నూల్

ఘనంగా శ్రీచౌడేశ్వరీమాత జ్యోతి మహోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, మార్చి 22:మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరీమాత జ్యోతి ఉత్సవం గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజామున శ్రీవిశ్వబ్రాహ్మణ భాస్కరయ్య అమ్మవారికి దృష్టి చుక్క పెట్టడం, అమ్మవారి ఆలయం ఎదురుగా మంటలను రాజేయడం ద్వారా జ్యోతి ఉత్సవాలకు సన్నద్దమయ్యారు. అనంతరం ఈఓ రామానుజన్, ఆలయ కమిటీ చైర్మన్ పివి కుమార్‌రెడ్డి, వహీకర్త అబ్బాయి రాజేశ్వరరావు గ్రామంలోని జ్యోతి మండపం వద్దకు వెళ్లి పూజలు నిర్వహించి జ్యోతి ఉత్సవాన్ని ప్రారంభించారు. అమ్మవారికి మొక్కు చెల్లించేవారు జ్యోతిని తయారుచేసి దానిని తలపై వుంచుకుని వారి బృందంతో లయబద్దంగా నృత్యం చేస్తూ భక్తిగీతాలు ఆలాపిస్తూ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 2 నుంచి ఉదయం 8 గంటల వరకూ జ్యోతి ఉత్సవం కొనసాగింది. భక్తులు అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అగ్నిగుండంలో దిగి ఆపై జ్యోతితో అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పూజలు, గర్భాలయ ప్రవేశాన్ని తాత్కాలికంగా రద్దు చేసి కేవలం అమ్మవారి దర్శనాన్ని మాత్రమే కల్పించారు. జ్యోతి ఉత్సవంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుండా పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, నందివర్గం ఎస్‌ఐ శంకరయ్య వందలాది మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. అలాగే సీసీ కెమెరాల నిఘా వుంచారు. గ్రామ రైతు సంఘం సభ్యులు ఉత్సవాలకు వారివంతు సహకారం అందించారు. ఈ జ్యోతుల ఉత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిచ్చారు. దీంతో ఈఓ, చైర్మన్ ఆధ్వర్యంలో భక్తుల కోసం తాత్కాలిక వైద్య శిబిరం నిర్వహించారు.
కన్నుల పండువగా రథోత్సవం
శ్రీచౌడేశ్వరీమాత తిరుణాలలో భాగంగా 5వ రోజైన గురువారం సాయంకాలం అమ్మవారి రథోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. అమ్మవారి ఉత్సవమూర్తిని రథంలో కొలువుదీర్చి భక్తులు భక్తిపారవశ్యంతో రథాన్ని ముందుకు లాగారు.