కర్నూల్

‘హోదా’ సాధించేంత వరకూ ఉద్యమం ఆపేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు సిటీ, మార్చి 22:రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీని సాధించేంత వరకూ ఉద్యమాలను ఆపేది లేదని వామపక్ష, రాజకీయ పార్టీ నాయకులు హెచ్చరించారు. వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో గురువారం తుంగభద్ర బ్రిడ్జి వద్ద జాతీయ రహదారుల దిగ్బంధం కార్యక్రమం చేపట్టారు. ఇందులో కర్నూలు, నంద్యాల పార్లమెంట్ నియోజక వర్గాల వైసీపీ అధ్యక్షులు బివై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి హఫీజ్‌ఖాన్, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి.షడ్రక్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఏఐటీయుసీ రాష్ట్ర కార్యదర్శి మనోహర్ మాణిక్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను అమలు చేయించలేడంలో ఘోరంగా విఫలం చెందారని విమర్శించారు. ముఖ్యంగా తనకు రాజకీయంగా ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీ మోసాలను కనిపెట్టలేనంత అమాయకుడా, లేక కేవలం తన రాజకీయ, వ్యక్తిగత అవసరాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టాడా అనే విషయాన్ని తేల్చి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మోదీ, వెంకయ్య నాయుడు ఎన్నికల సమయంలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, నాలుగేళ్లయిన ఆ హామీలను అమలు చేయకుండా తెలుగు ప్రజలను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో 5 కోట్ల మంది ఆంధ్రులు బీజేపీ చేసిన మోసానికి ప్రతీకగా ఆ పార్టీకి రాజకీయ సమాధి కడతారని హెచ్చరించారు. చంద్రబాబు కూడా తొలుత ప్రత్యేక హోదా కావాలని కోరి మోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని అందుకు సరిపడే ప్యాకేజీ ఇస్తామని ప్రకటించిన వెంటనే మాట మార్చి హోదా ఏమన్న సంజీవనా అని పేర్కొన్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా సాధనకు సహకరించాలని, లేనిచో రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి నాగరాజు, నగర అధ్యక్షుడు రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, మద్దయ్య, సీపీఎం నాయకులు పుల్లారెడ్డి, శేషయ్య, అంజిబాబు, రాజగోపాల్, సీపీఐ నగర కార్యదర్శి గోవిందు, నాయకులు శ్రీరాములు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర నాయకులు లక్ష్మీనరసింహా, వివిధ ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా
ఎర్రమట్టి తవ్వకాలు!

కల్లూరు, మార్చి 22:ప్రభుత్వ భూములు, కొండ ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు యథేచ్ఛగా ఎర్రమట్టి తవ్వకాలు చేపడుతూ ఇష్టారాజ్యంగా ప్రత్యేక వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మండల పరిధిలోని తడకనపల్లి, ఉలిందకొండ, లక్ష్మీపురం, ఓబులాపురం గ్రామాల్లో వేల ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టి ఉంది. వీటిని అదనుగా తీసుకున్న కొందరు అక్రమార్కులు స్వేచ్ఛగా జేసీబీల సాయంతో కొండలను తవ్వి మట్టిని టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం శోచనీయం. కొందరు అక్రమార్కులు బాగా విలువ చేసే ఎర్రమట్టిని తవ్వి ఇతర ప్రాంతాలకు తరించి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతుంటే అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా ఎర్రమట్టిని తరలించే వాహనాలు ఇష్టారాజ్యంగా అతివేగంగా రోడ్లపై వెళ్తుండడంతో ఆటో, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా ఆయా శాఖల అధికారులు స్పందించి ఎర్రమట్టి తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఉంచి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంతైనా ఉంది.