కర్నూల్

కొండ గుహల్లో చిరుత పులులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దకడబూరు, మార్చి 23:మండల పరిధిలోని చిన్నకడబూరు గ్రామ శివారులో ఉన్న పెద్దకొండ గుహల్లో శుక్రవరం రెండు చిరుత పులులు సంచరిస్తుండడంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు. గత 2 నెలల నుంచి చిరుత పులులు కొండ చుట్టూ పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండడంతో గ్రామస్థులు భయపడుతున్నారు. గొర్రెల కాపరులకు కొండ గుహల్లో రెండు చిరుత పులులు కనిపించడంతో పరుగులు పెట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొండ గుహల్లో ఉన్న చిరుత పులలను గుర్తించి అటవీ ప్రాంతానికి తరలించాలని డిమాండ్ చేశారు.
సీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకూ పోరాటం ఆగదు
* నేడు కడపలో జేఏసీ సమావేశం * సీనియర్ న్యాయవాది దేవపాల్
కర్నూలు ఓల్డ్‌సిటీ, మార్చి 23:రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేసేంత వరకూ న్యాయవాదుల పోరాటం ఆగదని సీనియర్ న్యాయవాది దేవపాల్ హెచ్చరించారు. రాయలసీమ హైకోర్టు సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీకృష్ణదేవరాయ సర్కిల్ వద్ద న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి 62వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో న్యాయవాదులు జి.రాము, రామాంజనేయులు, ఆర్.నరసింహులు, ఎం.మనోసర్, జి.సుమన కూర్చున్నారు. వారి దీక్షలకు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పలువురు న్యాయవాదులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా దేవపాల్ మాట్లాడుతూ సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ గత 62రోజులుగా న్యాయవాదులు ఉద్యమం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా లేదని మండిపడ్డారు. ఇకనైనా సీఎం చంద్రబాబు శ్రీ్భగ్ ఒప్పందం ప్రకారం సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకనాటి రతనాల సీమ నేడు రాళ్లసీమగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమలో హైకోర్టు ఏర్పాటైయితే పేదరిక నిర్మూలన జరగడంతో పాటు ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. సీమలో హైకోర్టు ఏర్పాటు కోసం ఈ నెల 24వ తేదీ కడపలో జరిగే సీమ హైకోర్టు సాధన సమితి జేఏసీ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.